Main Menu

స్పైడర్ మువీ రివ్యూ

spyder
Spread the love

సినిమా: స్పైడర్
నటీనటులు: మ‌హేష్, ర‌కుల్ ప్రీత్‌, ఎస్‌.జె.సూర్య‌, భ‌ర‌త్ త‌దిత‌రులు
సంగీతం: హేరిష్ జైరాజ్‌
సినిమాటోగ్రఫీః సంతోష్ శివ‌న్‌
నిర్మాతః ఎన్‌.వి. ప్రసాద్‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగ‌దాస్‌

టాలీవుడ్ సూపర్ స్టార్ తాజా సినిమా స్పైడర్ మీద భారీ అంచనాలున్నాయి. వరుసగా హిట్స్ తర్వాత మహేష్ గత చిత్రం బ్రహ్మోత్సవం ఫెయిల్ కావడం ఫ్యాన్స్ ని నిరాశ పరిచింది. దాంతో స్పైడర్ మీద అతిగా ఆశలు పెట్టుకున్నారు. అందులోనూ కోలీవుడ్తు టాప్ డైరెక్టర్, తుపాకీ, క‌త్తి సినిమాల‌తో పాటు ప‌లు హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు ఎ.ఆర్.మురుగ‌దాస్‌ తో మహేష్ చేస్తున్న మువీ కావడం ఆశలు సహజంగానే పెరిగాయి. స్టాలిన్ త‌ర్వాత మ‌రే తెలుగు సినిమాను డైరెక్ట్ చేయ‌ని మురుగ‌దాస్ మ‌హేష్ హీరోగా తెలుగులో తెర‌కెక్కించిన సినిమా స్పైడ‌ర్‌ కావడం విశేషం. ఈ నేపథ్యంలో స్పైడర్ అంచనాలకు తగ్గట్టుగా ఉందా….ఈ రివ్యూలో చూద్దాం

క‌థః శివ (మ‌హేశ్‌) ఇంట‌లిజెన్స్ బ్యూరోలో ప‌నిచేస్తుంటాడు. షూటింగ్‌లో ప్రావీణ్యం ఉన్నప్పటికీ త‌ప్పులు జ‌ర‌గ‌క‌ముందే తెలుసుకుని వారిని కాపాడ‌టంలో ఆత్మసంతృప్తి ఉంద‌ని న‌మ్ముతాడు. ఆ ప్రకారం త‌న అవ‌స‌రాల‌కు అనుగుణంగా సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ప‌బ్లిక్ మాట్లాడే ప్రైవేట్ ఫోన్ల ద్వారా కొన్ని ప‌దాలు వినిపిస్తే త‌న‌కు అల‌ర్ట్ వ‌చ్చేలా రెండు సాఫ్ట్‌వేర్‌ల‌ను సిద్ధం చేసుకుంటాడు. ఆ ప్రకార‌మే కొంద‌రిని కాపాడుతుంటాడు. ఈ ప‌నిలో అత‌నికి మ‌రో ముగ్గురు స్నేహితులు సాయం చేస్తుంటారు. ఓ సారి ఇత‌నికి సాయం చేయ‌బోయి పోలీస్ ఉద్యోగం చేస్తున్న స్నేహితురాలు ప్రాణాల‌ను పోగొట్టుకుంటుంది. దాంతో దానికి కార‌కులెవ‌ర‌నే విష‌యాన్ని ఆరాతీస్తాడు.

భైర‌వుడు (ఎస్‌.జె.సూర్య‌), అత‌ని త‌మ్ముడు (భ‌ర‌త్‌) గురించిన విష‌యాలు అప్పుడే వెలుగులోకి వ‌స్తాయి. ఇత‌రుల ఏడుపు విని ఆనందాన్ని అనుభ‌వించే ఆ సోద‌రుల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? జ‌నాల ఏడుపులు విన‌డానికి వాళ్లు ఎంత దూరానికైనా తెగిస్తారా? హాస్పిట‌ల్‌లో ఉన్న పేషెంట్స్ ప్రాణాల‌తో భైర‌వుడు ఎలా ఆడుకున్నాడు. ఆ ఆట నుంచి జ‌నాల‌ను కాపాడ‌టానికి శివ‌కు చార్లీ (ర‌కుల్ ప్రీత్ సింగ్‌) ఎలా సాయం చేసింది? ఇంత‌కూ శివ‌కు, చార్లీకి ప‌రిచ‌యం ఎలా జ‌రిగింది? వ‌ంటివ‌న్నీ ఆస‌క్తిక‌రం.

ప్లస్ పాయింట్స్:

మహేష్ , ఎస్ జే సూర్య నటన
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మైన‌స్ పాయింట్స్:

కథ
పాటలు

నటీనటులు

మ‌హేష్ ఎప్పటిలా త‌న‌దైన న‌ట‌న‌తో అల‌రించాడు. ఎప్పటిలా ఎన‌ర్జిటిక్ పెర్ఫామెన్స్‌, న‌ట‌న‌తో ఆకట్టుక‌న్న మ‌హేష్ తెర‌పై చాలా హ్యాండ్‌స‌మ్‌గా క‌న‌ప‌డ్డాడు. విల‌న్‌తో క్లైమాక్స్ ముందు జ‌రిగే సంభాష‌ణ స‌న్నివేశంతో పాటు విల‌న్‌ను పోలీసులకు లేడీస్ ప‌ట్టించే స‌న్నివేశంలో కూడా మ‌హేష్ న‌ట‌న మెప్పిస్తుంది. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు ర‌కుల్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం క‌న‌ప‌డ‌లేదు. కేవ‌లం పాట‌ల‌కు మాత్రమే ప‌రిమితం అయ్యింది. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాత్ర విల‌న్‌గా న‌టించిన ఎస్‌.జె.సూర్య‌. పూర్తి స్థాయి విల‌న్‌గా ఎస్‌.జె.సూర్య న‌ట‌న మెప్పించింది. ఒక సైకిక్ ప్రశ్నగా సూర్య హావ‌భావాలు మెప్పిస్తాయి. అలాగే భ‌ర‌త్ పాత్ర ప‌రిమిత‌మే అయినా, ఉన్నంతలో త‌న పాత్రకు న్యాయం చేశాడు భ‌ర‌త్‌.

ఇజ జ‌య‌ప్రకాష్‌, షియాజీ షిండే వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. మ‌హేష్ స్నేహితులుగా ప్రియ‌ద‌ర్శి, ఆర్‌.జె.బాలాజీ ఓకే. ఇక టెక్నిక‌ల్ టీం విష‌యానికి వ‌స్తే, ద‌ర్శకుడు ఎ.ఆర్‌.మురుగదాస్ బ‌ల‌మైన క‌థ‌ను రాసుకోలేదు. ఎస్‌పిడి అనే మాన‌సిక రోగం చుట్టూ ఓ క‌థ‌ను రాసుకున్నాడు. దాని చుట్టూ ఓ స్పై మూవీ చేయ‌డం, అది కూడా మురుగ‌దాస్ వంటి ద‌ర్శకుడు సినిమాను తెరకెక్కించ‌డం కాస్తా ఆశ్చర్యానికి లోను చేసేదే. సంతోష్ శివ‌న్ సినిమాటోగ్రఫీ చాలా బావుంది. నిర్మాత పెట్టిన ఖ‌ర్చును సంతోష్ శివ‌న్ త‌న కెమెరాతో బంధించిన తీరు బావుంది. హరీష్ జైరాజ్ ట్యూన్స్ బాలేవు. ట్యూన్స్ త‌గ్గ సాహిత్యం కుద‌రలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

విశ్లేష‌ణః

ఓవరాల్ గా స్పైడర్ నుంచి ఎక్కువ ఆశించడం అత్యాశే అవుతుంది. మహేష్ మంచి మార్కులే కొట్టేసినా సినిమా సక్సెస్ కోటాలో చేరడం సందేహమే. దర్శకుడి వైపల్యం కొట్టిచ్చినట్టు కనిపించింది. మహేష్ కి మళ్లీ నిరాశ తప్పదనిపిస్తోంది. అయినా స్పైడర్ ని ఓసారి చూడొచ్చు. పూర్తిగా ఒక వర్గం సినిమాగా మిగిలిపోవడమే విశేషం.

పంచ్ లైన్: `స్పైడర్‌`…నై థ్రి‌ల్లర్‌
రేటింగ్: 2.5/5


Related News

pantham-movie-review

పంతం మువీ రివ్యూ

Spread the loveసినిమా: ప‌ంతం తారాగ‌ణం: గోపీచంద్‌, మెహ్రీన్ కౌర్‌, శ్రీనివాస‌రెడ్డి, పృథ్వి, సంప‌త్ త‌దిత‌రులు మ్యూజిక్: గోపీ సుంద‌ర్‌Read More

kaala-karikaalan_044cf412-4c00-11e7-81ca-1a4d4992589d

రజనీకాంత్ ‘కాలా’ మువీ రివ్యూ

Spread the loveసినిమా: కాలా తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *