‘సిల్లీ ఫెలోస్’ మువీ రివ్యూ

సినిమా: సిల్లీఫెలోస్
నటీనటులు: అల్లరి నరేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినిరాయ్, బ్రహ్మానందం, జయప్రకాశ్ రెడ్డి, పోసాని కృష్ణమురళి, రాజారవీంద్ర, చలపతిరావు, అదుర్స్ రఘు, ఝాన్సీ, హేమ తదితరులు
ఆర్ట్ డైరెక్టర్: ఎం కిరణ్ కుమార్
సంగీత దర్శకుడు: శ్రీవసంత్
ఎడిటర్: గౌతంరాజు
దర్శకుడు: భీమినేని శ్రీనివాస్
నిర్మాతలు: కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
2012లో నరేశ్, భీమనేని శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ `సుడిగాడు` సినిమా రిలీజ్ అయిన ఆరేళ్ల తర్వాత వారి కలయికలో వచ్చిన చిత్రం `సిల్లీ ఫెలోస్`. సునీల్ ఈ చిత్రంతో కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడంతో ఆసక్తిగా మారింది. నరేశ్, సునీల్ కలిసి నటించిన చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎప్పటిలాగానే భీమనేని తన మార్కు తమిళ సినిమాను రీమేక్ చేసి సిల్లీ ఫెలోస్‌గా తీసుకొచ్చాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుంద తెలుసకోవాలంటే సినిమా కథేంటో చూద్దాం.
కథ:
వీరబాబు (అల్లరి నరేశ్) లేడీస్ టైలర్. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలనేది అతని కల. స్థానికంగా చిన్న హోటల్ పెట్టుకుని నడుపుతున్న ఓ మహిళ (ఝాన్సీ) కుమార్తె (చిత్ర శుక్ల) \ను ప్రేమిస్తాడు. ఆ అమ్మాయికి పోలీస్ కావాలనేది కోరిక. వీరబాబు ఫ్రెండ్ సూరిబాబు (సునీల్). అనుకోకుండా పుష్ప (నందినిరాయ్) మెడలో తాళి కడతాడు. ఆమెతో తెగతెంపులు చేసుకుని వస్తేనేగానీ, పెళ్లిచేసుకోనని సూరి అసలు గర్ల్ ఫ్రెండ్ షరతు పెడుతుంది. అక్కడి నుంచి సూరి విడాకుల కోసం పుష్ప వెంట పడతాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే వీరబాబుకు ఓ చిక్కు వచ్చి పడుతుంది. దాన్ని ఎలా విడిపించుకున్నాడు? మధ్యలో ఎమ్మెల్యే గొడవ ఏంటి? మినిస్టర్ బావమరిది ఎవరు? ఇంకో కిరాయి ముఠా ఎవరు? రూ.500కోట్ల సంగతి ఏంటి? వంటివన్నీ మిగిలిన సినిమా చూస్తే అర్థమవుతుంది.
ప్లస్ పాయింట్స్
– అల్లరి నరేశ్, సునీల్ కామెడీ
– పాటలు
– జయప్రకాష్‌రెడ్డి
మైనస్ పాయింట్లు
– పేలవమైన కథనం
– వెకిలి కామెడీ
– హీరోయిన్లు
విశ్లేషణ
కొన్ని కథలు పొరుగు భాషల్లో చూస్తే బావుంటాయి. వాటిని తెలుగులోకి తీసుకొస్తే తప్పకుండా పెద్ద హిట్ అవుతాయనే నమ్మకాన్ని కలిగిస్తాయి. అలా తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ అయిన కథ `సిల్లీ ఫెలోస్`. సునీల్‌కి కమెడియన్ రీ ఎంట్రీ చిత్రమిది. పేరుకు కమెడియన్ అయినా, అల్లరి నరేశ్‌తో సమ ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించారు సునీల్. ఆయన వే ఆఫ్ కామెడీ నవ్వించింది. అక్కడక్కడా కొన్ని డైలాగులు పేలాయి. కడుపుబ్బ నవ్వించాయి. కానీ పోలీస్ స్టేషన్ సీన్లు, కిడ్నాప్ సీన్లు విసుగు పుట్టించాయి. తమిళ సినిమాను అడాప్ట్ చేసుకున్న దర్శకుడు పాత్రల పేర్లను కూడా అక్కడివాటినే తీసుకోవడాన్ని ఇందులో గమనించవచ్చు. సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతుంటే వెహికల్స్ నెంబర్స్ అన్నీ టీఎస్ అని ఉంటాయి. డైరక్షన్ డిపార్ట్ మెంట్ ఆ మాత్రం కేర్ తీసుకోలేదా? అనేది ఆలోచించాల్సిన విషయం. నాలుగు పాటలు, పది డైలాగులు, కొన్ని కమర్షియల్ సీన్లు చూడాలనుకున్నవారికి ఈ సినిమా సరిపోతుంది.
పంచ్ లైన్: టైటిల్ కి సరిపోయింది
రేటింగ్: 2/5
Related News

కవచం మువీ రివ్యూ
Spread the loveసినిమా: కవచం నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ
Spread the loveసంచలన దర్శకుడు శంకర్ మరో సృష్టి అందరి దృష్టిని ఆకర్షించింది. వన్నె తరగని క్రేజ్ తో దూసుకుపోయేRead More