Main Menu

సప్తగిరి మువీ రివ్యూ

Spread the love

సినిమా : సప్తగిరి ఎల్.ఎల్ బి
నటీనటులు : సప్తగిరి, కషిష్ వోహ్రా, సాయి కుమార్ , శివ ప్రసాద్, శకలక శంకర్ తదితరులు
నిర్మాత : డాక్టర్ కే.రవికిరణ్
దర్శకత్వం : చరణ్ లక్కాకుల
సంగీతం ; విజయ్ బుల్గానిన్

కమెడియన్ గా చిత్ర పరిశ్రమకి పరిచయమైన సప్తగిరి కామెడి టైమింగ్స్ తో ప్రేక్షకులని అలరించాడు. కమెడియన్ లు హీరోలుగా మారుతుండడం కొత్తేమి కాదు. అలా సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో తోలి ప్రయత్నంలోనే ఆకట్టుకున్నాడు సప్తగిరి. ఓ వైపు హాస్యనటుడిగా రాణిస్తూనే హీరోగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన జాలీ ఎల్.ఎల్.బి సినిమాని రీమేక్ చేశాడు సప్తగిరి. మరి ఈ సినిమా ఎలా ఉన్నదో ఇప్పుడు ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

చిత్ర కథ :
చిత్తూరులో ఉంటూ ఎల్.ఎల్ బి పూర్తి చేసి సప్తగిరి లాయర్ గా ఎదిగి మంచి పేరు, డబ్బు సంపాదించి తన మరదల్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతో హైదరాబాద్ సిటీకి వచ్చి సెషన్స్ కోర్టులో ప్రాక్టీస్ పెట్టి కేసుల కోసం ఎదురుచుస్తుంటాడు. అటువంటి తరుణంలోనే అతను ప్రముఖ లాయర్ రాజ్ పాల్(సాయి కుమార్) వాదించి, తీర్పు రాబట్టుకున్న ఓ హిట్ అండ్ రన్ కేసు పై పిల్ వేసి దాన్ని రీ ఓపెన్ చేయిస్తాడు. అసలు సప్తగిరి ఆ కేసునీ ఎందుకు రీఓపెన్ చేయించాడు. ఆ కేసు కథ ఏంటి, పేరు మోసిన లాయర్ రాజ్ పాల్ ని సప్తగిరి ఎలా డీ కొట్టాడు, చివరకి సప్తగిరి కేసు గెలిచాడా? లేదా? అనేదే ఈ సినిమా.

నటీనటుల ప్రతిభ :
సప్తగిరి తన వరకు మంచి ఎనర్జీ చూపించాడు. ఉత్సాహంగా నటించాడు. అతనికి అలవాటైన అమాయకపు నటనతో ఆకట్టుకున్నాడు. ఆలాగే హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ బాగా చేశాడు. వీర లెవల్ లో డాన్స్, ఫైట్స్ చేశాడు. హీరోయిన్ కషిష్ వోరా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఈ అమ్మాయి ఏ రకంగా ఆకట్టుకోలేకపోయింది. హీరోయిన్ కు ఎంత ప్రధానం లేకున్నా…సప్తగిరి పక్కన ఆమె ఏమాత్రం సూట్ కాలేదు.

డైలాగ్స్ కి, పాటలకి సరిగా లిప్ సింక్ కూడా ఇవ్వలేని అమ్మాయినీ ఎందుకు పెట్టుకున్నారో? కీలకమైన పాత్రలో సాయికుమార్ రాణించాడు. కొన్నిచోట్ల ఆయన కూడా సినిమా టోన్ కు తగ్గట్లే కొంచెం అతిగా చేస్తున్న భావన కలుగుతుంది కానీ.. ఓవరాల్ గా ఆయన బాగానే చేశాడు. శివప్రసాద్ కూడా అంతే. షకలక శంకర్ మామూలే. ఎల్బీ శ్రీరాం ఓకే.

సాంకేతిక నైపుణ్యం :
దర్శకుడు చరణ్ లక్కాకుల సినిమా కోసం ఎంచుకున్న న్యాయం కోసం పోరాడే లాయర్ అనే పాయింట్ బాగానే ఉన్నప్పటికీ ఆకట్టుకునే కథనాన్ని రాయలేదు. ముఖ్యమైన క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప మిగిలినవాటిపై పెద్దగా పనితన చూపలేదు. దాంతో చిత్రం ఏదో ఉంది అన్నట్లుగా మిగిలింది తప్ప స్టాంప్ వేయగలిగిన సినిమాగా నిలవలేదు. సన్నివేశాల టేకింగ్ కూడా ప్రభావంతంగా లేదు. బుల్గేనిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటల సంగీతం మెప్పించలేదు. సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ పర్లేదు. సప్తగిరి వేసిన డాన్స్ బాగున్నది. డా. కే.రవి కిరానే పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్ :
కోర్టు సన్నివేశాలు
సాయికుమార్‌
సప్తగిరి డ్యాన్సులు

మైనస్ పాయింట్ :
పాటలు
తెలిసిన కథే కావటం

విశ్లేషణ :
బాలీవుడ్ లో సక్సెస్ అయిన జానీ ఎల్.ఎల్.బి సినిమాని రీమేక్ చేసి సప్తగిరికి ఓ మంచి కమర్షియల్ సక్సెస్ ఇవ్వాలని దర్శకుడు భావించాడు. అందుకోసం ఒరిజినల్ వెర్షన్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేశాడు. అయితే తెలుగు నేటివిటి కోసం చేసిన మార్పులు సినిమా స్థాయిని తగ్గించేలా ఉన్నాయి. సినిమాలో ఇంకాస్త ఆసక్తికరమైన ఎలిమెంట్స్ జోడించి ఉంటె సినిమా స్థాయి మరో లెవల్ లో ఉండేది.

దర్శకుడు పెట్టుకున్న నమ్మకాన్ని సప్తగిరి పూర్తిగా నిలబెట్టుకున్నాడు. తనకు అప్పగించిన పాత్రని చక్కగా పోషించి వినోదాన్ని పంచాడు. ఇక కీలక పాత్రకు సాయి కుమార్ ని ఎంపిక చేయడం దర్శకుడి గుడ్ ఛాయస్ అని చెప్పొచ్చు. సినిమాలో సాయి కుమార్ లేకుంటే సినిమా స్థాయి తగ్గేది. హీరోయిన్ అప్త్రకు ప్రాముఖ్యతని కల్పించి, సినిమాలో స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా నడిపించి ఉంటె బాగుండేది.

పంచ్ లైన్ :సప్తగిరి ఎల్ ఎల్ బీ.. మంచి కథకు మసాలా పులిమేశారు


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *