Main Menu

‘సాక్ష్యం’ మువీ రివ్యూ

Spread the love

మువీ : సాక్ష్యం
న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురు స్వామి, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు
మ్యూజిక్ : హర్షవర్ధన్ రామేశ్వరన్
నిర్మాత: అబిషేక్ నామ
డైరెక్టర్: శ్రీవాసు

టాలీవుడ్ యంగ్ హీరోల‌లో బెల్లంకొండ శ్రీనివాస్ కి కొంత గుర్తింపు వ‌చ్చింది. ఇటీవ‌ల వ‌చ్చిన ప‌లు సినిమాల‌తో ఓ మేర‌కు స‌క్సెస్ అయ్యాడు. దాంతో తాజా సినిమా మీద ఇండ‌స్ట్రీలో అంచ‌నాలు పెరిగాయి. అందులోనూ పూజాహెగ్డే తో జ‌త‌గట్టిన సినిమా కావ‌డంతో మ‌రింత మంది ఎదురుచూశారు. లేటెస్ట్ ట్రెండ్ కి త‌గ్గట్టుగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ స‌బ్జెక్ట్ తో రూపొందించారు. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల‌లో అడుగుపెట్టిన బెల్లంకొండ వారి సాక్ష్యం స‌క్సెస్ అయ్యిందా..ఈ రివ్యూలో చూద్దాం.

క‌థ:
స్వ‌స్తిక్ పురం గ్రామంలోని రాజుగారు(శ‌ర‌త్‌కుమార్‌) పేద ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండే వ్య‌క్తి. అదే ప్రాంతంలో ఉండే మున‌స్వామి అత‌ని త‌మ్ముళ్లు అక్ర‌మాల‌కు పాల్ప‌డుతుంటారు. వారికి ఎదురు తిరిగిన రాజుగారిని, అత‌ని కుటుంబాన్ని దారుణంగా చంపేస్తారు. అయితే రాజుగారికి పుట్టిన కొడుకుని ఎద్దు కాపాడ‌టంతో త‌ప్పించుకుంటాడు. కాశీ చేరిన ఆ శిశువుని శివ ప్ర‌కాశ్‌(జ‌య‌ప్ర‌కాశ్‌) చెంత‌కు చేరుతాడు. పిల్ల‌లు లేని శివ ప్ర‌కాశ్ ఆ పిల్లాడికి విశ్వ‌జ్ఞ( బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తాడు.

పెరిగి పెద్ద‌యిన విశ్వ వీడియో గేమింగ్‌ల‌ను ప్లాన్ చేసి చిత్రీక‌రిస్తుంటాడు. ఓ సంద‌ర్భంలో సౌంద‌ర్య‌ల‌హ‌రి(పూజా హెగ్డే)ని చూసి ప్రేమిస్తాడు విశ్వ‌.
ఆమెకు ఓ సంద‌ర్భంలో స‌హాయం చేస్తాడు. కానీ అది అర్థం చేసుకోని సౌంద‌ర్య.. విశ్వ‌పై కోపంతో ఇండియాకు వ‌చ్చేస్తుంది. విశ్వ కూడా సౌంద‌ర్య కోసం ఇండియా వ‌చ్చేస్తాడు. అదే స‌మ‌యంలో హైద‌రాబాద్‌లోని సౌంద‌ర్య తండ్రి మున‌స్వామి ఆక్ర‌మాల‌కు అడ్డుప‌డుతుంటాడు. మున‌స్వామికి వ్య‌తిరేకంగా కొన్ని సాక్ష్యాల‌ను సేక‌రిస్తుంటాడు. మున‌స్వామి త‌మ్ముడు వీరాస్వామి(ర‌వికిష‌న్‌) సౌంద‌ర్య‌ను చంపేయాల‌నుకుంటాడు. కానీ ప్ర‌కృతి కార‌ణంగా చ‌నిపోతాడు. దానికి విశ్వ ప‌రోక్షంగా కార‌ణ‌మ‌వుతాడు. అలాగే మున‌స్వామి ఇద్ద‌రు త‌మ్ముళ్లు కూడా విశ్వ చేతిలోనే చ‌స్తారు. అస‌లు మున‌స్వామి అండ్ బ్ర‌ద‌ర్స్‌పై ప్ర‌కృతి ఎందుకు కోపం తెచ్చుకుంటుంది? చివ‌ర‌కు మున‌స్వామి ప‌రిస్థితేంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

ప్ల‌స్
– డైలాగులు
– సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్లు
– లాజిక్ లేక‌పోవ‌డం
– పేల‌వ‌మైన విల‌నిజం

విశ్లేష‌ణ‌
గాలి, నిప్పు, నేల‌, మ‌ట్టి, ఆకాశం.. ఈ పంచ‌భూతాలు మ‌నిషిని సృష్టిస్తాయి, నాశ‌నం చేస్తాయి. ప్ర‌కృతి ధ‌ర్మాన్ని మ‌నం పాటిస్తే మ‌న ఉన్న‌తికి తోడ్పడుతాయి. వాటిని అతిక్ర‌మిస్తే అంతం చూస్తాయి. అష్ట‌దిక్కుల్లో ఏ క‌న్ను చూడ‌క‌పోయినా, మ‌నం చేసే మంచి చెడుల‌ను పైనుంచి భ‌గవంతుడు చూస్తుంటాడు. మంచి చెడుల‌ను బేరీజు వేసి పాపాన్ని ప్ర‌క్షాళ‌న చేస్తాడు. మ‌నిషి ధ‌ర్మాన్ని పాటించాలి అని చెప్పే సినిమా ఇది. మామూలుగా ఇలాంటి సినిమా చేస్తే ఆధ్యాత్మిక సినిమా అవుతుంది. అయితే ఈ సినిమాలో క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌ను మేళ‌వించి, నేటి ట్రెండ్‌లో అంద‌రికీ అర్థ‌మ‌య్యే వీడియో గేమ్ రూపంలో క‌థ‌ను చెప్పే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు. ఒక మ‌నిషి రాసే స‌న్నివేశాలు.. నిజ జీవితంలో హీరోకి అవే ఎదుర‌వ‌డం తెలుగు తెర‌కు కొత్త కాదు. కాక‌పోతే పంచ‌భూతాల సాక్షిగా వాటిని నెర‌వేర్చ‌డం అనేది మాత్రం కొత్తే. హీరో బ్యాక్‌గ్రౌండ్‌, హీరోయిన్ కేర‌క్ట‌ర్ బావున్నాయి. అడ్వంచ‌ర్స్ ని ఇష్ట‌ప‌డే కుర్రాడిగా, రిచ్ కిడ్‌గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చ‌క్క‌గా చేశారు. ఈ సినిమాలో ఎక్కువ క్రెడిట్‌ని కొట్టేసేది పీట‌ర్ హెయిన్‌. గ్రాఫిక్స్ కూడా బావున్నాయి.

అయితే అనాథ పిల్ల‌ల‌ను క్వారీలో ఉంచ‌డం వంటివి కొన్ని నాట‌కీయంగా అనిపించాయి. అయినా సినిమా క‌థ‌లో ఎక్క‌డా క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా తెర‌కెక్కించారు. దేవుడు, శ‌క్తి, న‌మ్మ‌కం, ప‌శు ప‌క్ష్యాదులు కూడా స‌త్సంక‌ల్పానికి సాయం చేయ‌డం అనే కాన్సెప్ట్ బావుంది. సంగీత ద‌ర్శ‌కుడు రామేశ్వ‌ర్ కొత్త‌వాడైనా చాలా బాగా రీరికార్డింగ్ ఇచ్చారు. సన్నివేశాల‌కు స‌గం బ‌లం రీరికార్డింగే. హీరో, హీరోయిన్ల చేత డ‌బ్బింగ్ చెప్పించ‌డంలో మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సింది. సెట్స్ పాట‌ల‌ను క‌నుల‌కు విందు చేశాయి. పాట‌లు ట్యూన్ల ప‌రంగా పెద్ద‌గా గొప్ప‌గా లేక‌పోయినా, సెట్స్ తో క‌లిపి చూసేట‌ప్పుడు బావున్నాయి. నిర్మాత పెట్టిన ఖ‌ర్చు మొత్తం తెర‌మీద క‌నిపించింది. ప్ర‌తి ఒక్క‌రూ వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు. అంత‌మందిని డీల్ చేయ‌డం కూడా ద‌ర్శ‌కుడికి స‌వాలైన విష‌య‌మే. అయినా కృత‌కృత్యుడ‌య్యాడు. ఈ సినిమాలోనే చెప్పిన‌ట్టు ప్ర‌తిదానికీ లాజిక్ అడ‌గ‌క‌పోతే ఇది మంచి సినిమానే.

రేటింగ్‌: 2.25/5
పంచ్ లైన్‌: లాజిక్కుల‌కు అంద‌ని ‘సాక్ష్యం’


Related News

జెర్సీ మువీ రివ్యూ

Spread the loveమువీ: జెర్సీ న‌టీన‌టులు: నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్, స‌త్యరాజ్‌, రోనిత్ క‌మ్ర‌, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ, శిశిర్Read More

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *