Main Menu

రోబో2.0 రివ్యూ

Spread the love

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయే ర‌జ‌నీకాంత్ మ‌రో రోబో వేషం వేయ‌డం ఆస‌క్తిని రాజేసింది. ఈసారి అక్ష‌య్ కుమార్ కూడా జ‌త‌క‌ల‌వ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సీక్వెల్ మువీ కొత్త చ‌రిత్ర సృష్టిస్తుంద‌నే అంచ‌నాలు పెరిగాయి. అమీ జాక్సన్ చేసిన యాక్ష‌న్స్ టీజ‌ర్స్ రూపంలో ప్రేక్ష‌కుల‌ను మ‌రింత ఉత్సాహ ప‌ర‌చ‌డంతో చిట్టి క్యారెక్ట‌ర్ త్రీడీలో చూసేందుకు జ‌నం క్యూ క‌ట్టారు. ప్ర‌పంచ సినీ చ‌రిత్ర‌లో భార‌త‌దేశ ఖ్యాతిని పెంపొందించిన బాహుబ‌లి త‌ర్వాత అదే స్థాయిలో వ‌చ్చిన రోబో 2.0 ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

భారీ అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన సినిమా రోబో 2.ఓ. ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించారీ సినిమా. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీకి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. డైరెక్టర్ శంకర్, రజినీకాంత్‌లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అక్షయ్ కుమార్ నటన అమోఘం అంటున్నారు. ఈ సినిమాలోని విజువల్స్ కళ్లు తిప్పుకోనివ్వడం లేదని చెబుతున్నారు. తొలి అర్ధభాగం శంకర్ డైరెక్షన్ ప్రతిభను తెలిపితే… మలి అర్ధభాగం అతనిలోని సాంకేతిక నైపుణ్యాన్ని బయటపెడుతోందని అంటున్నారు.

సాంకేతికతను ఉపయోగించుకున్న తీరు అద్భుతం అంటున్నారు. హీరోయిన్‌గా అమీ జాక్సన్ నటన బాగుందని.. ఇంటర్వెల్‌లో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయంటున్నారు. రోబో సీక్వెల్‌ను అంచనాలకు తగ్గట్టుగానే తీశారని.. శంకర్ అండ్ కో ఐదేళ్ల కష్టం ఫలించిందంటున్నారు అభిమానులు. సినిమాను ఎక్కడా ఆసక్తిని కోల్పోకుండా.. థ్రిల్‌కు గురి చేసేలా సినిమా రూపొందించారని ప్రేక్షకులు చెబుతున్నారు.

ప్ల‌స్
ర‌జ‌నీకాంత్
వీఎఫ్ ఎక్స్
క్లైమాక్స్
అక్ష‌య్ కుమార్

మైన‌స్
అన్ని చోట్లా త్రీడీ అందుబాటులో లేక‌పోవ‌డ‌మే

మొత్తంగా ఈ సినిమా బాహుబ‌లి రికార్డ్స్ ని బ్రేక్ చేసే అవ‌కాశం ఉంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.






Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *