Main Menu

రంగ‌స్థ‌లం ఫ‌స్ట్ రివ్యూ, రేటింగ్!

Rangasthalam_5745
Spread the love

మెగా అభిమానుల్లో ఆస‌క్తి రేపుతున్న సినిమా రేపు థియేట‌ర్ల‌లో అడుగుపెట్ట‌బోతోంది. రంగ‌స్థ‌లం సినిమాతో రామ్ చ‌ర‌ణ ర‌చ్చ చేయ‌బోతున్నాడు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమాలో స‌మంత‌తో జ‌త‌గ‌ట్టి మాస్ లుక్ తో మెప్పించాడు. ఈ నేప‌థ్యంలో సినిమా మంచి ఫ‌లితాలు సాధిస్తుంద‌నే అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టికే పాటలు జ‌నం నోళ్ల‌లో నానుతున్నాయి.

ప్ర‌స్తుతం యూకే సెన్సార్ బోర్డ్ స‌భ్యుడు త‌న రివ్యూ వెలువ‌రించారు. గ్రామీణ నేప‌థ్యంలో వ‌స్తున్న ఈ సినిమాపై త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షో చూసిన ఆయ‌న వెలువ‌రించిన తొలి రివ్యూ టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

తాజాగా దానికి సంబంధించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా సినిమా విడుద‌ల‌కు ముందే ఈ సినిమా తొలి రివ్యూ వెలువ‌డింది. ప్ర‌ముఖ సినీ విమ‌ర్శ‌కుడు ఉమ‌ర్ సంధు ట్విట్ట‌ర్ లో సినిమా రివ్యూ రాశారు. ప‌క్కా పైసా వ‌సూల్ క‌మ‌ర్షియ‌ల్ మ‌సాలా మువీగా పేర్కొన్నారు. రామ్ చ‌ర‌ణ్‌, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న అదుర్స్ అని పేర్కొన్నారు. సినిమాకి అద‌న‌పు బ‌లంగా మారిన‌ట్టు వ్యాఖ్యానించారు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ‌, డీఎస్పీ పాట‌లు మెప్పిస్తాయ‌న్నారు. మొత్తంగా ఆయ‌న 3.5 రేటింగ్ ఇవ్వ‌డంతో మెగా అభిమానులు మురిసిపోతున్నారు.

రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ ఓపెనింగ్స్ ఖాయంగా మారింది. ఇప్ప‌టికే ప్రీమియ‌ర్ షో ల‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో తాజాగా వెలువ‌డిన ఉమ‌ర్ సంధు రివ్యూ మ‌రింత క్రేజ్ పెంచుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.






Related News

pantham-movie-review

పంతం మువీ రివ్యూ

Spread the loveసినిమా: ప‌ంతం తారాగ‌ణం: గోపీచంద్‌, మెహ్రీన్ కౌర్‌, శ్రీనివాస‌రెడ్డి, పృథ్వి, సంప‌త్ త‌దిత‌రులు మ్యూజిక్: గోపీ సుంద‌ర్‌Read More

kaala-karikaalan_044cf412-4c00-11e7-81ca-1a4d4992589d

రజనీకాంత్ ‘కాలా’ మువీ రివ్యూ

Spread the loveసినిమా: కాలా తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *