Main Menu

‘రంగ‌స్థ‌లం’ మువీ రివ్యూ

Spread the love

సినిమా: రంగ‌స్థ‌లం
న‌టీన‌టులు: రామ్ చ‌ర‌ణ్, స‌మంత‌, జ‌గ‌ప‌తిబాబు, ఆదిపినిశెట్టి, ప్ర‌కాష్ రాజ్, అన‌సూయ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: ర‌త్న‌వేలు
సంగీతం: దేవీ శ్రీప్ర‌సాద్
ద‌ర్శ‌క‌త్వం: సుకుమార్
నిర్మాత‌లు: వై న‌వీన్, వై రవిశంక‌ర్,మోహ‌న్ చెరుకూరి

మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో సుకుమార్ మొద‌టి సినిమా. స‌మంత‌, చెర్రీ కాంబినేష‌న్ లో మొద‌టి మువీ. రామ్ చ‌ర‌ణ్ విలేజ్ బ్యాక్ గ్రౌండ్ లో తొలిసారి. ఇలాంటి అనేక ప్ర‌త్యేక‌తల నేప‌థ్యంలో రంగ‌స్థ‌లం సినిమా మీద అంద‌రి దృష్టి ప‌డింది. అందులోనూ ఈసారి స‌మ్మ‌ర్ సీజ‌న్ లో వ‌స్తున్న తొలి పెద్ద చిత్రం కావ‌డంతో టాలీవుడ్ లో ఆస‌క్తిరేగింది. మెగా ఫ్యాన్స్ లో బోలెడు ఆశ‌లు నింపింది. ఇక రామ్ చ‌ర‌ణ్ చెవిటివానిగా న‌టించి, స్వ‌యంకృషి సినిమాలో చిరంజీవిని త‌ల‌పించేలా ఉండ‌డంతో రంగ‌స్థ‌లం బిజినెస్ భారీగా జ‌రిగింది. ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇక శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో అడుగుపెట్టిన రంగ‌స్థ‌లం మువీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

క‌థ‌:

రంగ‌స్థ‌లం అనే గ్రామానికి ముప్పై ఏళ్లుగా ఫ‌ణీంద్ర భూప‌తి( జ‌గ‌ప‌తిబాబు) స‌ర్పంచ్ గా ఉంటాడు. ఆయ‌న చెప్పిందే వేదం. సొసైటీ పేరుతో రైతుల‌కు అప్పులిచ్చి అధికంగా గుంజుతూ వేధిస్తూ ఉంటాడు. తిరగ‌బ‌డిన వాళ్ల‌ను హ‌త్య చేసి త‌న‌కు పోటీ లేకుండా చేసుకుంటాడు. అలాంటి భూప‌తికి చెల్లుబోయిన చిట్టిబాబు( రామ్ చ‌ర‌ణ్), కుమార్ బాబు( ఆది పినిశెట్టి) అనే అన్న‌ద‌మ్ములు ఎదురుతిరుగుతారు. కుమార్ బాబు తొలిసారిగా నామినేష‌న్ కూడా వేస్తారు. దాంతో అన్న‌ను కాపాడుకోవ‌డం కోసం చిట్టిబాబు చేసే ప్ర‌య‌త్నాలు, మ‌ధ్య‌లో ఎమ్మెల్యే ద‌క్షిణామూర్తి( ప్ర‌కాష్ రాజ్) పాత్ర , వాటికితోడుగా రామ‌ల‌క్ష్మి ( స‌మంత‌) కోసం చిట్టిబాబు చేసే చేష్ట‌లు సినిమాలో ప్ర‌ధానాంశాలు. చివ‌ర‌కు త‌న అన్న‌ను చంపిన వాళ్ల‌ను చిట్టిబాబు అంత‌మొందించ‌డం, ఊరికి స‌ర్పంచ్ గా రంగ‌మ్మ‌( అన‌సూయ‌) ని గెలిపించుకోవ‌డం సినిమాలో కీల‌కాంశాలు. అవ‌న్నీ వివ‌రంగా తెలియాలంటే తెర‌మీద చూడాల్సిందే.

ప్ల‌స్:-
+రామ్ చ‌ర‌ణ్
+మ్యూజిక్

మైన‌స్:-
-కామెడీ లేక‌పోవ‌డం
-నిడివి ఎక్కువ‌గా ఉండ‌డం

న‌టీన‌టులు:

సినిమాలో రామ్ చ‌ర‌ణ్ న‌టన‌లో వైవిధ్యాన్ని చూడ‌వ‌చ్చు. విభిన్నమైన పాత్ర‌లో ఒదిగిపోయాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ క‌థ‌లో చిట్టిబాబు పాత్ర‌కు సంపూర్ణంగా న్యాయం చేశాడు. దాదాపు వ‌న్ మ్యాన్ షోగా సినిమాని న‌డిపించాడు. అభిమానుల‌ను మెప్పించ‌డ‌మే కాకుండా సాధార‌ణ ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రించాడు. స‌మంత కూడా డీ గ్లామ‌ర‌స్ పాత్ర‌కు అంగీక‌రించ‌డ‌మే ఆశ్చ‌ర్యం. అయినా త‌నవంతుగా పాత్ర‌కు న్యాయం చేసింది. ఆ త‌ర్వాత జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి త‌న‌దైన విల‌నీ ప్ర‌ద‌ర్శించాడు. భూప‌తి పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా హావ‌భావాలు ప్ర‌ద‌ర్శించి ఆక‌ట్టుకున్నాడు. కుమార్ బాబు పాత్ర‌లో ఆదిపినిశెట్టి, రంగ‌మ్మత్త‌గా అన‌సూయ మెప్పించారు. ప్ర‌కాష్ రాజ్ కి చాలా సాధార‌ణ‌మైన పాత్ర‌. అది ఆయ‌న‌కు కొట్టిన పిండిగా చెప్ప‌వ‌చ్చు.

సాంకేతిక బృందం:

ద‌ర్శ‌కుడు సుకుమార్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. ప్ర‌జెంట్ ట్రెండ్ కి భిన్నమైన క‌థాంశాన్ని ఎంచుకోవ‌డం ఆయ‌న దైర్యానికి నిద‌ర్శ‌నం. అందులోనూ నాన్న‌కు ప్రేమ‌తో వంటి అల్ట్రా మోడ‌ర్న్ స‌బ్జెక్ట్ త‌ర్వాత ముప్పై ఏళ్ల క్రితం నాటి మారుమూల గ్రామం క‌థ‌ను ఎంపిక చేయ‌డమే విశేషం. ఇక సంగీతం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. క‌థ‌కు త‌గ్గ‌ట్టుగా పాట‌లు అల‌రించాయి. సంగీతానికి ఎక్కువ మార్కులు ప‌డ్డాయి. ఆ త‌ర్వాత ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ కూడా బాగుంది. డైలాగ్స్ కూడా ఓకే. ఓవ‌రాల్ గా తెర‌మీద గోదావ‌రి యాస‌ను, గోదావ‌రి జిల్లాల అందాల‌ను పంచేశారు.

విశ్లేష‌ణ‌:

సినిమా యువ‌త‌ను ఏమేర‌కు మెప్పిస్తుంద‌న్న‌ది సందేహ‌మే. ముఖ్యంగా క‌థ ప్ర‌కారం పాత సినిమాల‌ను త‌ల‌పిస్తోంది. కానీ సుకుమార్ మార్క్ స్ప‌ష్టంగా ఉంది. కామెడీ లేక‌పోవ‌డం పెద్ద లోటు. నిడివి కూడా ఎక్కువ‌గా ఉంది. కొన్ని సీన్స్ లాజిక్ కి దూరంగా ఉన్న‌ప్ప‌టికీ స‌గ‌టు ప్రేక్ష‌కుడిని నిరాశ‌ప‌ర‌చ‌ద‌ని మాత్రం చెప్ప‌వ‌చ్చు.

పంచ్ లైన్: పాత్ర‌ధారులు మాత్ర‌మే మారిన ‘రంగ‌స్థ‌లం’
update ap రేటింగ్ : 2.75/5


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *