ప‌టేల్ స‌ర్: మువీ రివ్యూ

patel
Spread the love

సినిమా: పటేల్ సర్
తారాగణం : జగపతిబాబు, పద్మప్రియా, తాన్య హోపే, సుబ్బరాజు, కబీర్ దుహన్ సింగ్
సంగీతం : డీజే వసంత్
దర్శకత్వం : వాసు పరిమి
నిర్మాత : సాయి కొర్రపాటి

విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేశాలతో ఫుల్ బిజీగా ఉన్న జగపతిబాబు, మరోసారి హీరోగా చేసిన ప్రయత్నమే పటేల్ సర్. అయితే రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా తన వయసుకు తగ్గ రివేంజ్ డ్రామాను ఎంచుకున్న జగపతి బాబు.. లుక్స్ పరంగా ఆకట్టుకున్నాడు. మరి ఈ పటేల్ సర్, జగపతిబాబుకు హీరోగా హిట్ ఇచ్చిందా..? వారాహి చలనచిత్రం బ్యానర్ స్థాయికి తగ్గ సినిమాగా పటేల్ సర్ ప్రూవ్ చేసుకుందా..?

కథ :
దేవరాజ్ అలియాస్ డీఆర్ (కబీర్ దుహాన్ సింగ్) తన తమ్ముడు కన్నా తయారు చేసిన సింథటిక్ డ్రగ్ ను దేశంలోని యువత మొత్తానికి అలవాటు చేయాలని ప్లాన్ చేస్తాడు. అందుకోసం తన ఫ్రెండ్స్ మౌంటీ(పృథ్వీ), ఛోర్ బజార్ లాలా( కాలకేయ ప్రభాకర్)లతో కలిసి భారీ స్కెచ్ వేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ రవి ఎలాగైన డీఆర్ గ్యాంగ్ ను పట్టించాలని సాక్ష్యాధారాలు రెడీ చేస్తాడు. ఈ లోగా విషయం తెలుసుకున్న డీఆర్, రవిని చంపేస్తాడు. రవి చనిపోయిన కొద్ది రోజుల తరువాత డీఆర్ గ్యాంగ్ లోని చోర్ బజార్ లాలాను అరవైయ్యేళ్ల ముసలాడు పటేల్ సర్(జగపతి బాబు) వేటాడి వేటాడి రాక్షసంగా చంపేస్తాడు.

హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవాలనుకున్న డీఆర్, మినిస్టర్ పాపారావు(రఘుబాబు) సాయంతో లంచాలకు అలవాటు పడ్డ పోలీస్ ఆఫీసర్ కేథరిన్(తాన్యా హోపే)ను ఇన్వస్టిగేషన్ ఆఫీసర్ గా అపాయింట్ చేయిస్తాడు. పోలీస్ ఇన్వస్టిగేషన్ జరుగుతుండగానే డీఆర్ తమ్ముడితో సహా మౌంటి కూడా పటేల్ సర్ చేతిలో హత్యకు గురవుతారు. అసలు పటేల్ సర్ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు..? పటేల్ తో పాటు ఉన్న చిన్న పాప యామిని (బేబీ డాలీ) ఎవరు..? కేథరిన్ పటేల్ సర్ ను పట్టుకుందా..? చివరకు పటేల్ సర్ ఏమయ్యాడు అన్నదే మిగతా కథ.

ప్లస్ :
జగపతిబాబు నటన
ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్స్

మైనస్ :
పూర్ టేకింగ్
క్వాలిటీ లేని గ్రాఫిక్స్
స్లో నేరేషన్

నటీనటులు :
సినిమా అంతా జగపతి బాబు వన్ మేన్ షోలా నడిచింది. మిగతా పాత్రలన్నింటికీ స్క్రీన్ టైం చాలా తక్కువ. క్రూరంగా హత్యలు చేసే పటేల్ సర్ గా, అదే సమయంలో యంగ్ డాక్టర్ వల్లభ్ పటేల్ గా జగపతి బాబు నటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా లుక్స్ పరంగా జగపతి బాబు సూపర్బ్ అనిపించాడు.తనకు అలవాటైన స్టైలిష్ విలనిజంతో కబీర్ దుహన్ సింగ్ మరోసారి మెప్పించాడు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన ఆమని, పద్మప్రియ, పృథ్వీలు తమ స్థాయిక తగ్గ నటనతో పాత్రలకు న్యాయం చేశారు. బాహుబలి సినిమాలో కామెడీతో ఆకట్టుకున్న సుబ్బరాజు. ఈ సినిమాలోనూ అదే తరహా పాత్రలో కనిపించాడు. ఇతర పాత్రల్లో కాలకేయ ప్రభాకర్, శుభలేఖ సుధాకర్, పోసాని కృష్ణ మురళీ ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు :
విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హాయిగా ఉన్న జగపతిబాబును మరోసారి హీరో పాత్రల వైపు తీసుకువచ్చిన దర్శకుడు వాసు పరిమి, ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. మంచి కథతో పాటు జగపతిబాబు లాంటి నటుడు ఉన్నా సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించలేకపోయాడు. పూర్తి యాక్షన్ సినిమాగా రూపొందించే ప్రయత్నంలో ఎమోషనల్ సీన్స్ కు అవకాశామున్నా అలాంటి సీన్స్ మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. డీజే వసంత్ సంగీతం పరవాలేదు. మెలోడీ సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అలరిస్తుంది. నిర్మాణ విలువలు వారాహి చలనచిత్రం బ్యానర్ స్థాయికి తగ్గట్టుగా లేవు.


Related News

pawan-teaser-1-587x342

అజ్ణాతవాసి మువీ రివ్యూ

Spread the loveమువీ: అజ్ణాతవాసి న‌టీన‌టులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యేల్, రావు ర‌మేష్ త‌దిత‌రులు సంగీతం:Read More

Sapthagiri-LLB-Movie-Stills

సప్తగిరి మువీ రివ్యూ

Spread the loveసినిమా : సప్తగిరి ఎల్.ఎల్ బి నటీనటులు : సప్తగిరి, కషిష్ వోహ్రా, సాయి కుమార్ ,Read More

 • జవాన్ మువీ రివ్యూ
 • `బాల‌కృష్ణుడు`మువీ రివ్యూ
 • మెంటల్ మదిలో మువీ రివ్యూ
 • ఖాకీ మువీ రివ్యూ
 • ఒక్కడున్నాడు: మువీ రివ్యూ
 • నెక్ట్స్ నువ్వే: మువీ రివ్యూ
 • ఉన్నది ఒకటే జిందగీ: మువీరివ్యూ
 • మహానుభావుడు మువీ రివ్యూ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *