Main Menu

నితిన్ లై ఎలా ఉంది?: మువీ రివ్యూ

Lie-Movie-HD-Posters-1
Spread the love

సినిమా: లై
న‌టీన‌టులుః నితిన్‌, మేఘా ఆకాష్‌, అర్జున్, ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, శ్రీ‌రామ్‌, సురేష్‌, అజ‌య్‌, పృథ్వీ, బ్ర‌హ్మాజీ, మ‌ధుసూధ‌న్‌, రాజీవ్‌క‌న‌కాల‌, పూర్ణిమ త‌దిత‌రులు
సంగీతంః మ‌ణిశ‌ర్మ‌
నిర్మాత‌లుః రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌, అనీల్ సుంక‌ర‌
క‌థ‌, స్క్రీన్‌ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వంః హ‌ను రాఘ‌వ‌పూడి

ఆ ఆ హిట్ త‌ర్వాత హుషారుగా ఉన్న నితిన్, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ తో స‌క్సెస్ కొట్టిన హ‌ను రాఘ‌వ‌పూడి క‌లిసి తీసిని సినిమా కావ‌డంతో లై మీద అంచ‌నాలు పెద్ద‌స్థాయిలో ఉన్నాయి. అందులోనూ విభిన్న‌మైన క‌థాంశంతో వ‌స్తుండ‌డంతో చాలామందిని ఆక‌ట్టుకుంది. హీరో, విల‌న్ మ‌ధ్య సాగే మైండ్ గేమ్ క‌థా వ‌స్తువు కావ‌డంతో క్లాస్ ఆడియెన్స్ కి ఖ‌చ్చితంగా ఆక‌ట్టుకుంటుంద‌న్న అంచ‌నాల‌తో లై థియేట‌ర్ల‌లో అడుగుపెట్టింది. మ‌రి ఈ సినిమాతో నితిన్ మ‌రో హిట్ కొట్టాడా..హ‌ను రాఘ‌వ‌పూడి కెరీర్ కి లై కూడా తోడ‌య్యిందా…ఈ రివ్యూలో చూద్దాం..

క‌థః
పేరులో స‌త్యం ఉన్నా.. ఇంటి పేరు ‘ఎ’ తో క‌లుపుకుని వాడుకలో అస‌త్యంగా త‌న‌ని తాను హైలెట్ చేసుకుంటుంటాడు ఎ.స‌త్యం (నితిన్‌). తండ్రిలేని స‌త్యంకి తొంద‌రగా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేయాల‌న్న‌ది స‌త్యం త‌ల్లి కోరిక‌. అయితే స‌త్యం మాత్రం లైఫ్‌లో సెటిల్ అవ‌డం కోసం లాస్ వేగాస్ వెళ్లాల‌ని ప్లాన్ చేసుకుంటాడు. కొన్ని విచిత్ర‌మైన ప‌రిస్థితుల మ‌ధ్య పిసినారి అమ్మాయి చైత్ర (మేఘా ఆకాష్‌)తో క‌లిసి లాస్ వేగాస్‌కి వెళ్లాల్సి వ‌స్తుంది స‌త్యంకి. ఆ జ‌ర్నీలో ఇద్ద‌రికీ ఒక‌రంటే ఒక‌రికి ప్రేమ పుడుతుంది. ఈ మ‌ధ్య‌లో ఒక ‘సూట్’ కోసం పద్మ‌నాభం (అర్జున్‌) చేసే ప్లానింగ్స్ .. ఆ ‘సూట్’ తాలుకు ర‌హ‌స్యం చేధించ‌డానికి సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ బృందం చేసే ప్ర‌య‌త్నాలు న‌డుస్తుంటాయి. ఇంత‌కీ ఆ ‘సూట్’ వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటి? ఈ మిష‌న్‌లో హీరో ఎలా ఇరుక్కున్నాడు? హీరో, విల‌న్ కి మ‌ధ్య ఉన్న క‌నెక్ష‌న్ ఏంటి? అనేది తెర‌పైనే చూడాలి.

ప్ల‌స్ పాయింట్స్
నితిన్‌, అర్జున్ న‌ట‌న‌
స్క్రీన్ ప్లే

మైన‌స్ పాయింట్స్‌
రోటీన్ రివేంజ్ డ్రామా

న‌టీన‌టులు

నితిన్ అంటే అంతా ల‌వ‌ర్ బాయ్ అనుకుంటారు. కానీ మ‌ధ్య‌లో కొన్ని ప్ర‌యోగాలు చేసి చేతులు కాల్చుకున్న నితిన్ మ‌రోసారి అలాంటి ప్ర‌యోగాత్మ‌క మైండ్ గేమ్ స్టోరీతో మ‌రో ప్ర‌య‌త్నం చేశాడు. కానీ గ‌త సినిమాల కంటే నితిన్ లో మంచి ప‌రిణ‌తి క‌నిపించింది. ‘అఆ’ లో నితిన్‌ని చూసి.. ఇందులో నితిన్ ని చూస్తే ఆశ్చ‌ర్య‌పోక త‌ప్ప‌దు.అవ‌స‌ర‌మైన చోట్ల ప‌వ‌న్‌ని రెఫ‌రెన్స్‌ని కూడా చ‌క్క‌గా వాడుకున్నాడు. నితిన్ కెరీర్ లో ఇదో గుర్తుండిపోయే పాత్ర‌గా చెప్ప‌వ‌చ్చు. ఆ త‌ర్వాత అర్జున్ గురించి ప్ర‌త్యేకంగాచెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఈ సినిమాలో విల‌న్‌గా అద్భుతంగా న‌టించాడు. స్టైలీష్‌గా క‌నిపిస్తూనే తన బాడీ లాంగ్వేజ్‌తో సినిమాకి ‘షోమాన్‌’గా నిలిచాడు. సినిమాకి ఒక‌ హైలెట్‌గా నిలిచాడు. ఇక కొత్త‌మ్మాయి మేఘా ఆకాష్‌కి న‌ట‌న‌కు అంత‌గా ప్ర‌ధాన్య‌త లేని పాత్రే కావ‌డం విశేషం. కొన్ని చోట్ల తొలి రోజుల్లోని శ్రియ‌ని గుర్తుకి తెచ్చింది. నితిన్‌తో రొమాంటిక్ సీన్స్‌లో ఆక‌ట్టుకుంది. ర‌వికిష‌న్‌, నాజ‌ర్‌, అజ‌య్‌, శ్రీ‌రామ్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధిమేర‌కు చ‌క్క‌గా న‌టించారు. నిన్న‌టి త‌రం హీరోయిన్ పూర్ణిమ హీరో త‌ల్లిగా ద‌ర్శ‌న‌మిస్తే.. రాజీవ్ క‌న‌కాల హీరోయిన్‌కి తండ్రిగా క‌నిపించాడు. ఇక ఇంద్ర‌కుమార్‌, నార‌ద శ‌ర్మ అంటూ కామెడీ కోసం అల్లిన పురాణ పాత్ర‌ల్లో పృథ్వీ, బ్ర‌హ్మాజీ న‌వ్వులు పంచారు.

టెక్నిక‌ల్ టీమ్

హ‌ను రాఘ‌వ‌పూడి మూడో చిత్రాన్ని మైండ్ గేమ్ జోన‌ర్‌లో ఎంచుకోవ‌డమే విశేషం. అయినా డీలింగ్ లో ఎక్క‌డా తేడా రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు. స్క్రీన్‌ప్లే విష‌యంలోనూ జాగ్ర‌త్త‌లు తీసుకున్న హ‌ను.. మాట‌ల ర‌చ‌యిత‌గా త‌న మార్క్ చూపించాడు. ఇక యువ‌రాజ్ ఛాయాగ్ర‌హ‌ణం సినిమాకి హైలెట్‌గా నిలిచిన అంశాల‌లో ఒక‌టి. బొంబాయి, శాన్‌ప్రాన్‌సిస్కో, జోర్డాన్‌, లాస్ వేగాస్‌.. ఇలా సినిమాలో లోకేష‌న్లు మారుతూనే ఉన్నా.. అత‌ని సినిమాటోగ్ర‌ఫీలో క్వాలిటీ ఎక్క‌డా మార‌లేదు. సంగీతం విష‌యానికి వ‌స్తే.. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న స్థాయిని చాటుకున్నాడు. రీరికార్డింగ్ విష‌యంలో త‌న‌ను ఎందుకు కింగ్ అని పిలుస్తారో ఈ సినిమాతో మ‌రోసారి చెప్ప‌క‌నే చెప్పాడీ రీరికార్డింగ్ స్పెష‌లిస్ట్‌.

విశ్లేష‌ణః

మైండ్ గేమ్ సినిమాలు గ‌తంలో కూడా చాలానే వ‌చ్చి స‌క్సెస్ అయ్యాయి. అయితే ఇది ఏ క్లాస్ ఆడియెన్స్ మెచ్చే మైండ్ గేమ్ మువీ కావ‌డం విశేషం.ఆ త‌ర‌హా జోన‌ర్‌ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి సినిమాని ఇచ్చే ప్ర‌య‌త్నంగా చెప్పాలి. మొత్తంగా లై ఆక‌ట్టుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

పంచ్ లైన్ః లై ఓ మ‌ల్టీఫ్లెక్స్ మువీ
రేటింగ్ః 3/5


Related News

pantham-movie-review

పంతం మువీ రివ్యూ

Spread the loveసినిమా: ప‌ంతం తారాగ‌ణం: గోపీచంద్‌, మెహ్రీన్ కౌర్‌, శ్రీనివాస‌రెడ్డి, పృథ్వి, సంప‌త్ త‌దిత‌రులు మ్యూజిక్: గోపీ సుంద‌ర్‌Read More

kaala-karikaalan_044cf412-4c00-11e7-81ca-1a4d4992589d

రజనీకాంత్ ‘కాలా’ మువీ రివ్యూ

Spread the loveసినిమా: కాలా తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *