Main Menu

నెక్ట్స్ నువ్వే: మువీ రివ్యూ

Spread the love

న‌టీన‌టులుః ఆది, వైభ‌వి శాండిల్య‌, బ్ర‌హ్మాజీ, ర‌ష్మి, ర‌ఘుబాబు, హిమ‌జ‌, ఎల్బీ శ్రీ‌రామ్‌, పృథ్వీ, పోసాని కృష్ణ‌ముర‌ళి, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి త‌దిత‌రులు
సంగీతంః సాయి కార్తీక్
ఛాయాగ్ర‌హ‌ణంః కార్తీక్ ప‌ళ‌ని
ఎడిటింగ్ః ఎస్‌.బి.ఉద్ధ‌వ్‌
నిర్మాతః బ‌న్నీ వాసు
ద‌ర్శ‌క‌త్వంః ప్రభాక‌ర్‌

తెలుగులో హార‌ర్‌ కామెడీ జోన‌ర్‌ల‌కు మంచి ఆద‌ర‌ణ ఉంది. ఈ జోన‌ర్‌లో వ‌చ్చే తెలుగు సినిమాలు చాలా వ‌ర‌కు బాగానే క్లిక్ అవుతున్నాయి కూడా. ఇప్పుడు ఇదే వ‌రుస‌లో వ‌చ్చిన మ‌రో సినిమా ‘నెక్ట్స్ నువ్వే’. త‌మిళంలో విజ‌యం సాధించిన ‘యామిరుక్క భ‌య‌మే’ (2014) చిత్రం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకి టీవీ న‌టుడు ప్ర‌భాక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆది, వైభ‌వి శాండిల్య‌, బ్ర‌హ్మాజీ, ర‌ష్మి ముఖ్య పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

క‌థాంశం
కిర‌ణ్ (ఆది) ఓ సీరియ‌ల్ డైరెక్ట‌ర్‌. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కిర‌ణ్.. చ‌నిపోయిన తండ్రి (పోసాని) త‌న కోసం ఓ ప్యాలెస్ రాసిపెట్టాడ‌ని తెలుసుకుంటాడు. అయితే అదో పాత కాలం నాటి బంగ్లా. అది బాగు చేయించాలంటే రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. జెపి (జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి)తో అప్ప‌టికే ఓ స‌మ‌స్య‌లో ఉన్న కిర‌ణ్‌.. జెపి కొడుకు (అదుర్స్ ర‌ఘు)ని తెలివిగా వాడుకుని రూ.50 ల‌క్ష‌లు రాబ‌ట్టుకుంటాడు. పాడుబడిన ఆ ప్యాలెస్‌ని బాగు చేయించి ‘హిల్ టాప్ రిసార్ట్’ అనే పేరు పెడ‌తాడు. కిర‌ణ్ ప్రియురాలు స్మిత (వైభ‌వి)తో పాటు శ‌ర‌త్ (బ్ర‌హ్మాజీ), శ‌ర‌త్ చెల్లెలు ర‌ష్మి (ర‌ష్మి) కూడా ఆ రిసార్ట్‌లో ఉంటుంటారు. అయితే ఆ రిసార్ట్ కి వ‌చ్చే క‌స్ట‌మ‌ర్లు వ‌రుస‌గా చ‌నిపోతుంటారు. ఓ సారి దంపతులు, మ‌రోసారి చైనీస్ బ్యాచ్‌ , ఇంకోసారి డ్రిల్ మాస్టర్ (రామ్ జ‌గ‌న్‌), మరో వ్య‌క్తి.. ఇలా మొత్తం ఆరుగురు ఒక్కో ర‌కంగా కిర‌ణ్‌, స్మిత‌, శ‌ర‌త్‌, ర‌ష్మి ముందు చ‌నిపోతుంటారు. అయితే ఈ న‌లుగురికి మాత్రం ఏం కాదు. క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే ఇలా ఎందుకు జ‌రుగుతుంద‌ని ఆరా తీస్తే.. వాళ్లు క‌స్ట‌మ‌ర్లు కాదు.. ఆ ప్యాలెస్‌ పాత య‌జ‌మానులు అని తెలుస్తుంది. ఇప్పుడు ఆ ప్యాలెస్ యజ‌మాని.. కిర‌ణ్. కాబ‌ట్టి.. నెక్ట్స్ చ‌నిపోయేది కిర‌ణే. మ‌రి కిర‌ణ్ గ్యాంగ్.. ప్యాలెస్ నుంచి బ‌య‌ట‌ప‌డిందా? లేదా? అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్‌:
-కామెడీ
-బ్యాగ్రౌండ్ స్కోర్‌

మైన‌స్ పాయింట్స్‌:
-లాజిక్స్ మిస్ అవ్వ‌డం
-క్లైమాక్స్‌
-హర్రర్ వర్కవుట్ కాకపోవడం

విశ్లేష‌ణ‌
ద‌ర్శ‌కుడు ప్ర‌భాక‌ర్‌కి ఇదే తొలి సినిమా అయినా.. రీమేక్ అనే సేఫ్ గేమ్‌తో కెరీర్‌ని మొద‌లుపెట్టాడు. ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్‌లో ఉన్న స్క్రీన్‌ప్లేనే య‌ధాత‌థంగా వాడుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, హార‌ర్ ఎలిమెంట్స్ కంటే.. కామెడీ ఎలిమెంట్స్‌నే ఈ సినిమాలో బాగా వ‌ర్క‌వుట్ అయ్యాయి. దానికి తోడు న‌టీన‌టుల నుంచి మంచి న‌ట‌న‌ను రాబ‌ట్టుకోవ‌డంలో ప్ర‌భాక‌ర్ స‌క్సెస్ అయ్యాడు. ముఖ్యంగా శ‌ర‌త్ పాత్ర‌లో బ్ర‌హ్మాజీ సినిమాకి బాగా ప్ల‌స్ అయ్యాడు. ప్ర‌థ‌మార్థంలో చాలా స‌న్నివేశాలు న‌వ్విస్తాయి. ముమైత్ సీన్‌తో పాటు.. ష‌కీలా, బ్ర‌హ్మాజీ ఎపిసోడ్‌.. అలాగే బెన‌ర్జీపై తీసిన ఇచ్‌గార్డ్ ఎపిసోడ్‌.. స‌త్య‌కృష్ణ‌న్ ఎపిసోడ్‌.. అలాగే సెకండాఫ్‌లో ర‌ఘుబాబుపై తీసిన ఎపిసోడ్‌.. హిలేరియ‌స్‌గా ఉన్నాయి. ఇవ‌న్నీ సినిమాని పైసా వ‌సూల్ అనిపిస్తాయి. ఇక హిమ‌జ‌పై తీసిన హ‌ర్ర‌ర్ ఎపిసోడ్స్‌.. భ‌య‌పెట్ట‌డం కంటే న‌వ్వించ‌డంలోనే స‌క్సెస్ అయ్యాయి. ఓవ‌రాల్‌గా సినిమాని చూడ‌డానికి వ‌చ్చే ఆడియ‌న్స్‌ని కామెడీ విష‌యంలో ఈ సినిమా శాటిస్ ఫై చేస్తుంది.

న‌టీన‌టుల, సాంకేతిక నిపుణుల ప‌నితీరు
కిర‌ణ్ పాత్ర‌లో ఆది న‌ట‌న డీసెంట్‌గా ఉంది. క్యారెక్ట‌ర్‌కి త‌గ్గ‌ట్టుగానే క‌నిపించాడు. ఎక్క‌డా లిమిటేష‌న్స్ దాట‌లేదు. ఇక హీరోయిన్ పాత్ర‌లో వైభ‌వి న‌ట‌న బాగుంది. ముఖ్యంగా భ‌య‌ప‌డే స‌న్నివేశాల్లో ఎక్స్‌ప్రెష‌న్స్ బాగా ఇచ్చింది. సినిమాలో మేజ‌ర్ ప్ల‌స్‌.. బ్ర‌హ్మాజీ చేసిన శ‌ర‌త్ పాత్ర‌. అత‌ని కామెడీ టైమింగ్ సినిమాని నిల‌బెట్టింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. ర‌ష్మిగా హాట్‌గా క‌నిపించింది. ప‌తాక స‌న్నివేశాల‌కి ముందు వ‌చ్చే ర‌ఘుబాబు.. ఆర్జీవీ పాత్ర‌లో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశాడు. దెయ్యం పాత్ర‌లో హిమ‌జ న‌ట‌న బాగుంది. అది బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది కూడా. పృథ్వీ, పోసాని, జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి, అదుర్స్ ర‌ఘు, ఎల్బీ శ్రీ‌రామ్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌.. ఇలా అంద‌రూ త‌మ ప‌రిధుల్లో చ‌క్క‌గా న‌టించారు. ముమైత్ ఖాన్‌, ష‌కీలా త‌మ ప్ర‌జెన్స్‌తో మాస్‌ని మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు.
టెక్నీక‌ల్‌గా ఈ సినిమా బాగుంది. సాయికార్తీక్ పాట‌లు డీసెంట్‌గా ఉంటే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్‌ని బాగా ఎలివేట్ చేసింది. కార్తీక్ ప‌ళ‌ని ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. ‘అద్బుతం జ‌రిగినప్పుడు ఆశ్చ‌ర్య‌పోవాలి త‌ప్ప ఆరా తీయ‌కూడ‌దు’, ‘ఆ సినిమాకి బాడీ లాంగ్వేజ్ ఉంటే చాలు లాంగ్వేజ్‌తో ప‌నిలేదు’, ‘వాళ్లు చ‌చ్చే టైప్ కాదు చంపే టైప్‌’, ‘అది మ‌సాజ్ చేస్తున్న‌ట్లు లేదు ఏదో మెసేజ్ ఇస్తున్న‌ట్లు ఉంది’.. వంటి డైలాగ్‌లు మాస్‌ని అల‌రిస్తాయి. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

పంచ్ లైన్ః హర్రర్ లెస్..కామెడీ మువీ
update ap రేటింగ్: 2/5


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *