Main Menu

నేనే రాజు నేనే మంత్రి: మువీ రివ్యూ

Nene-Raju-Nene-Mantri-Theatrical-Trailer-Rana-Kajal-Aggarwal-Catherine-Tresa-NRNMTrailer-810x400
Spread the love

సినిమా నేనే రాజు నేనే మంత్రి
నటీనటులు: రానా, కాజల్‌, కేథరిన్‌, అశుతోష్‌ రాణా, పోసాని కృష్ణమురళి, అజయ్‌, నవదీప్‌, జోష్‌ రవి, తనికెళ్లభరణి, జయప్రకాష్‌ రెడ్డి తదితరులు
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి.దిలీప్‌
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, కిరణ్‌రెడ్డి, భరత్‌ చౌదరి
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తేజ

విభిన్న సినిమాల‌తో ఆడియెన్స్ ని ఆక‌ట్టుకోవ‌డంలో ద‌గ్గుబాటి రానా ముందుంటాడు. ఇటీవ‌ల వ‌రుస‌గా ప‌లు సినిమాల‌లో అత‌డి పాత్ర‌లు దానికి నిద‌ర్శ‌నంగా ఉన్నాయి. విల‌క్ష‌ణ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఒక‌నాటి స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ తేజ‌తో చేతులు క‌ల‌ప‌డం విశేషంగానే క‌నిపించింది. కాజ‌ల్ తో క‌లిసి తేజ ద‌ర్శ‌క‌త్వంలో రానా న‌టించిన నేనే రాజు నేనే మంత్రి ప్రీ రిలీజ్ క్యాంపెయిన్ విస్తృతంగా సాగింది. దాంతో ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానుల్లో ఈ సినిమా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. అందులోనూ పొలిటిక‌ల్ బ్యాక్ గ్రౌండ్ మువీ కావ‌డంతో మ‌రింత ఆస‌క్తి క‌లిగించింది. ఈ నేప‌థ్యంలో థియేట‌ర్ల‌లో అడుగుపెట్టిన నేనే రాజు నేనే మంత్రి మువీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం..

కథ:
జోగేంద్ర(రానా), రాధ(కాజల్‌) అన్యోన్యంగా జీవించే భార్యభర్తలు. జోగేంద్ర త‌న‌ గ్రామంలో వ‌డ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ధర్మ వడ్డీలకే డబ్బు అప్పుగా ఇస్తుంటాడు. జోగేంద్ర భార్య రాధ గ‌ర్భ‌వ‌తి కావ‌డంతో మొక్క కోసం గుడికెళుతుంది. అక్క‌డ జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆ ఊరి స‌ర్పంచ్ (ప్రదీప్‌ రావత్‌) భార్య గుడి మెట్లపై నుండి తోసేస్తుంది. దాంతో రాధ గర్భం శోకం మిగులుతుంది. అంతేగాకుండా ఇక రాధకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేస్తారు. రాధకు సర్పంచ్‌ అంటే కోపం వస్తుంది. ఎలాగైనా జోగేంద్రను సర్పంచ్‌ కావాలని కోరిక కోరుతుంది. భార్య అంటే ఇష్టముండే జోగేంద్ర తన తెలివి తేటలతో సర్పంచ్‌ అవుతాడు. తన పదవి పోవడంతో మాజీ సర్పంచ్‌, జోగిని హత్య చేయాలని చూస్తే, జోగియే మాజీ సర్పంచ్‌ను చంపేస్తాడు. జోగేంద్ర పదవి, డబ్బు, ప్రజల్లో అతనికున్న పలుకుబడిని చూసి ఎమ్మెల్యే చౌడప్ప(సత్య ప్రకాష్‌) అతన్ని పోలీసు కేసు నుండి తప్పిస్తాడు. ఈ కేసులో ఎమ్మెల్యేకు సి.ఐ(అజయ్‌) సహాయపడతాడు. చివరకు అజయ్‌, ఎమ్మెల్యేలు జోగిని డబ్బులు అడుగుతారు. జోగి తన తెలివితో సిఐని ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తాడు. ఎమ్మెల్యేను చంపేసి ఎమ్మెల్యే అవుతాడు. అక్కడ నుండి జోగేంద్ర రాజకీయ చదరంగం ఆడటం మొదలు పెడతాడు. జోగేంద్రకు శివ(నవదీప్‌) కుడిభుజంలా అండగా నిలబడతాడు. రాజకీయ ప్రత్యర్థులు ఆడే ఆటలో నిజానిజాలు తెలియకుండా శివను జోగేంద్ర చంపేస్తాడు. ఎలాగైనా సీఎం కావాలని జోగేంద్ర కలలు కంటాడు. అందుకోసం అతను కుర్చీలాటను మొదలు పెడతాడు. చివరకు ఆ ఆటలో ఎవరు విజేతగా నిలుస్తారు? జోగేంద్ర చివరికి ఏం సాధిస్తాడు? ఏం పొగొట్టుకుంటాడు? అనే విషయాలు తెర‌మీద చూడాల్సిందే

ప్ల‌స్

ద‌గ్గుబాటి రానా న‌ట‌న‌
డైలాగ్స్

మైన‌స్
ఎంట‌ర్టైన్మెంట్ లేక‌పోవ‌డం
ఫ‌స్టాఫ్

న‌టీన‌టులు

సినిమాలో ద‌గ్గుబాటి రానా ప్ర‌దాన హైలెట్ గా చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో లీడ‌ర్ సినిమాతో పొలిటిక‌ల్ లీడ‌ర్ పాత్ర‌ను మెప్పించిన రానా ఈసారి మ‌రింత ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించాడు. త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా ప‌లుమార్పులు చేసుకుని బాడీలాంగ్వేజ్ తోనూ రానా ఆక‌ట్టుకున్నాడు. ఇక సినిమాలో రానాతో స‌మాన‌మైన పాత్ర కాజ‌ల్ ది. రాధ పాత్ర‌కు కాజ‌ల్ స‌రిగ్గా స‌రిపోయింది. కుటుంబ క‌థానాయిక పాత్ర‌లో మెప్పించింది. ఫ్రీ క్లైమాక్స్ లో కాజ‌ల్ న‌ట‌న ఆక‌ట్టుకుంది. ఇక ఫస్టాఫ్‌ వరకే ప‌రిమిత‌మైన పాత్ర‌లో నవదీప్‌ తన పాత్రకు న్యాయం చేశాడు. ప్ర‌తినాయ‌కుడిగా అశుతోష్‌ రానా మెప్పించాడు. ఇక పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో సెటైరికల్‌ డైలాగ్స్‌తో ప్రేక్షకులను నవ్వించాడు. ప్రభాస్‌ శ్రీను నవ్వించాడు. దూరదర్శన్‌ కెమెరామెన్‌గా బిత్తిరి సత్తి తనదైన యాసతో అల‌రించారు.

టెక్నిక‌ల్ టీమ్
ద‌ర్శ‌కుడు తేజ స‌హ‌జ‌శైలికి భిన్న‌మైన సినిమా ఇది. గ‌తంలో ల‌వ్ మువీస్ తో గ్రాండ్ స‌క్సెస్ కొట్టిన అనుభ‌వం తేజ‌ది. కానీ ఈసినిమాలో రాజ‌కీయాలు ఎలా ఉంటాయి, జ‌నం ఎలా మోస‌పోతారు, ఓట్ల కోసం నాయ‌కులు ఏం చేస్తార‌న్న విష‌యాన్ని తేజ చ‌క్క‌గా వివ‌రించాడు. స్క్రీన్ ప్లే చ‌క్క‌గా ఉంది. అనూప్ సంగీతంలో ఒక‌టి రెండు పాట‌లు మాత్రం ఆక‌ట్టుకున్నాయి. ల‌క్ష్మీ భూపాల్ మాట‌లు సినిమాకు అద‌న‌పు బ‌లం. సంద‌ర్భానుసారం సామెత‌లు ప్ర‌యోగించ‌డం ఆక‌ట్టుకుంటుంది. సినిమాటోగ్ర‌ఫీ కూడా ఫ‌ర్వాలేదు.

విశ్లేషణ:
ప‌క్కా పొలిటిక‌ల్ సినిమా. రానా అభిమానుల‌కు సంతృప్తినిస్తుంది. తేజ‌కు తోడ్ప‌డుతుందా అంటే సంతోష‌మే. రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న వారికి కొత్త‌గా లేక‌పోయినా కొత్త త‌రానికి మాత్రం పొలిటిక్స్ లో తెరవెనుక వ్య‌వ‌హారాల మీద కొంత అవ‌గాహ‌న క‌ల్పిస్తుంది. ఆడియెన్స్ ను ఏమాత్రం మెప్పించ‌గ‌ల‌ద‌న్న‌ది సందేహ‌మే.

పంచ్ లైన్ ప‌క్కా పొలిటిక్స్
updateap రేటింగ్‌: 2.5/5


Related News

pantham-movie-review

పంతం మువీ రివ్యూ

Spread the loveసినిమా: ప‌ంతం తారాగ‌ణం: గోపీచంద్‌, మెహ్రీన్ కౌర్‌, శ్రీనివాస‌రెడ్డి, పృథ్వి, సంప‌త్ త‌దిత‌రులు మ్యూజిక్: గోపీ సుంద‌ర్‌Read More

kaala-karikaalan_044cf412-4c00-11e7-81ca-1a4d4992589d

రజనీకాంత్ ‘కాలా’ మువీ రివ్యూ

Spread the loveసినిమా: కాలా తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *