Main Menu

రవితేజ నేలటిక్కెట్ మువీ రివ్యూ

Spread the love

సినిమా: నేలటిక్కెట్
న‌టీన‌టులు: ర‌వితేజ‌, మాళ‌వికా శ‌ర్మ‌, జ‌గ‌ప‌తిబాబు, పోసాని కృష్ణ‌ముర‌ళి, అలీ తదితరులు
మ్యూజిక్: శ‌క్తికాంత్ కార్తీక్‌
నిర్మాత‌: రామ్ తాళ్లూరి
ద‌ర్శ‌క‌త్వం: క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల‌

మాస్ మహారాజ్ కొంత గ్యాప్ తర్వాత రాజాదిగ్రేట్ మువీతో ఫామ్ లోకి వచ్చాడు. మళ్లీ తన బ్రాండ్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. దాంతో మళ్లీ స్పీడ్ పెంచి తీస్తున్న సినిమాలపై జనంలో ఆసక్తి కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగానే నేలటిక్కెట్ అనే మాస్ టైటిల్ తో వచ్చిన మువీ కావడంతో ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఓపెనింగ్ బాగున్నాయి. మరి `నేల‌టిక్కెట్టు` జనాలను మెప్పించిందా… మాస్‌, క్లాస్ ఆడియెన్స్‌ను ఆకర్షించిందా? ఈ రివ్యూలో చూద్దాం..

స్టోరీ:

అనాథ రవితేజ ని అందరూ నేలటిక్కెట్ గాడు అంటారు. హైదరాబాద్ లో ఉంటున్న నేలటిక్కెట్ గాడికి అందరిని ఏదో బంధం కలిపేసుకుని పిలవడం అలవాటు. ఓ సారి డాక్టర్ కోర్స్ చదువుతున్న మాళవిక ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను గెలవడం కోసం ఏదో చేయాలనుకుంటాడు. అదే సమయంలో ఆనంద్ భూపతి(శరత్ బాబు) కి అనాధలకోసం ఆనంద నిలయం కట్టడం, తన కొడుకు అజయ్ భూపతి(జగపతిబాబు)ని మంత్రి చేయడం అనే ఆశయాలుంటాయి. అందుకు తగ్గట్టుగానే ఆనంద్ భూపతి మంచితనం పనిచేసి అజయ్ భూపతి ఎన్నికల్లో గెలుస్తాడు. ఆ తర్వాత ఓసారి టెర్రరిస్ట్ లు దాడి చేయడంతో అజయ్ భూపతి తప్పించుకున్నప్పటికీ ఆనంద్ భూపతి మాత్రం చనిపోతాడు.

అయితే అది టెర్రరిస్ట్ ఎటాక్ కాదని, ప్లానింగ్ ప్రకారం ఆనంద్ భూపతిని హత్య చేశారని నేలటిక్కెట్ గాడికి తెలుస్తుంది. దాంతో హోమ్ మినిస్టర్ అజయ్ భూపతితో తగువు పెట్టుకుంటాడు. అసలు ఆ తగువులు ఎందుకు వచ్చాయి..ఆనంద్ భూపతిని ఎందుకు చంపారు..నేలటిక్కెట్ గాడితో ఆనంద్ భూపతి సంబంధం ఏమిటనే విషయాలు తెరమీద చూడాల్సిందే

ప్ల‌స్ పాయింట్స్‌:
– ర‌వితేజ
– కామెడీ

మైన‌స్ పాయింట్స్‌:
– రొటీన్ స్టోరీ
– మ్యూజిక్
– ఎమోష‌న్స్ క‌నెక్ట్ కాక‌పోవ‌డం

ఫెర్మార్మెన్స్

రవితేజ బ్రాండ్ మువీ. ఇలాంటి మాస్ రోల్ అతడికి కొట్టిన పిండి. అయితే కొత్తదనం ప్రదర్శించలేకపోవడంతో ప్రేక్షకులు మొనాటనీ ఫీలయ్యే ప్రమాదం కనిపిస్తోంది. ఇక హీరోయిన్ మాళవిక శర్మ గ్లామర్ పరంగా ఫర్వాలేదు. కానీ నటనలో మరింత మెరుగుపడాల్సి ఉంటుంది. జగపతి బాబు తన పరిధి మేరకు మెప్పించాడు. బ్రహ్మానందం, అలీ, ప్రుథ్వీ వంటి స్టార్ కమెడియన్స్ ఉన్నప్పటికీ కావాల్సినంత కామెడీ పండించలేకపోవడం కొంత లోటుగా కనిపిస్తోంది.

విశ్లేష‌ణ‌:

ఫస్ట్ హాఫ్ కన్ఫ్యూజన్ గా సాగడం పెద్ద సమస్యగా ఉంది. సెకండా హాఫ్ బాగా సాగదీత ఉంది. కొన్ని డైలాగులు పేలినప్పటికీ పక్కా మాస్ మువీ అనే పేరుతో గంపెడంత ఆశతో వెళ్లిన వారికి నిరాశ తప్పదు. దర్శకుడు కళ్యాణ్ క్రుష్ణ స్టోరీని డీల్ చేయలేకపోవడం, మ్యూజిక్ పేలవంగా ఉండడం పెద్ద బలహీనతలుగా చెప్పవచ్చు. మొత్తంగా ఓ మాదిరి సినిమాగా మిగిలిపోవడం ఖాయం.

పంచ్ లైన్: క్లాస్ కి గిట్టదు, మాస్ కి పట్టదన్నట్టుగా `నేల‌టిక్కెట్‌` .
అప్ డేట్ ఏపీ రేటింగ్‌: 2/5


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *