Main Menu

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the love

సినిమా: క‌వ‌చం
న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్‌, హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రాణే, పోసాని, స‌త్యం రాజేష్ త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం : శ‌్రీనివాస్ మామిళ్ల‌
నిర్మాత‌: న‌వీన్ శొంఠినేని
కెమెరా: చోటా.కె.నాయుడు
సంగీతం: ఎస్ .ఎస్‌. థ‌మ‌న్‌

బెల్లంకొండ శ్రీనివాస్ ..టాలీవుడ్ లో అన్నిర‌కాలుగా ఆశీస్సులు ఉండ‌డంతో అడుగుపెట్టిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత త‌న‌దైన మార్క్ చూపుతున్నాడు. ర‌క‌ర‌కాల పాత్ర‌ల‌తో యువ‌త‌కు చేరువ‌వుతున్నాడు. మాస్ మువీస్ తో చాలామందిని ఆక‌ట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈసారి ఖాకీ డ్ర‌స్ లో క‌నిపించి క‌వ‌చం ప్ర‌ధాన‌పాత్ర పోషించ‌డంతో ప‌లువురి దృష్టి ప‌డింది.దాంతో క‌వ‌చం ఓపెనింగ్స్ బాగా క‌నిపించాయి. ఎన్నో సినిమాల‌కు కో డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేసిన శ్రీనివాస్ మామిళ్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తొలి చిత్రం `క‌వ‌చం`కావ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. ఫ్రెష్ లుక్ తో ఉంటుంద‌నే అభిప్రాయం వినిపించింది. మ‌రి ఈ క‌వ‌చం ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

క‌థ‌:
విజ‌య్‌.బి (బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌) ఓ పోలీస్ ఉద్యోగి. అత‌నికి ఆవేశం (పోసాని కృష్ణ‌ముర‌ళి) పై అధికారి. ఎప్ప‌టికైనా ఎన్‌కౌంట‌ర్ స్పెష‌లిస్ట్ కావాల‌న్న‌ది విజ‌య్ క‌ల‌. అత‌ని తండ్రి (ఆహుతి ప్ర‌సాద్‌) కూడా పోలీసే. కాక‌పోతే విజ‌య్ పోలీస్ అయ్యే స‌మ‌యానికి అత‌ను చ‌నిపోయి ఉంటాడు. ఆప‌ద‌లో ఉన్న అమ్మాయిని అమ్మ‌లా చూసుకోమ‌ని వాళ్ల‌మ్మ చెప్పిన మాట విజ‌య్‌కి వేద‌మంత్రం. అందుకే అమ్మాయిలంటే చాలా గౌర‌వంగా చూస్తాడు. ఎలాంటి కేసుల‌నైనా డీల్ చేయాల‌నే సాహ‌సాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటాడు. అత‌ను ఓ సారి ప‌ర్సు పోగొట్టుకుంటాడు. అత‌ని ప‌ర్సును ఓ అమ్మాయి (కాజ‌ల్‌) తీసుకొచ్చి ఇస్తుంది. అప్ప‌టినుంచి ఆమెను ప్రేమిస్తాడు. అయితే ఆమెకు పెళ్లి కుదిరింద‌ని తెలుస్తుంది. అదే స‌మ‌యంలో సంయుక్త (మెహ‌రీన్‌) అనే అమ్మాయిని కాపాడుతాడు విజ‌య్‌. ఓ సంద‌ర్భంలో విజ‌య్ త‌ల్లి త‌ల‌కు పెద్ద ఆప‌రేష‌న్ జ‌రుగుతుంది. ఆమెను కాపాడుకోవ‌డానికి సంయుక్త చెప్పిన‌ట్టు చేస్తాడు. ఆ క్ర‌మంలో ఏమైంది? సంయుక్త‌లాగా అప్ప‌టిదాకా ప‌రిచ‌య‌మైన అమ్మాయి నిజ‌మైన సంయుక్త కాదా? కాక‌పోతే మ‌రో సంయుక్త ఎవ‌రు? అలాంట‌ప్పుడు ఈమె ఎందుకు సంయుక్త‌గా న‌టించాల్సి వ‌చ్చింది? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్
– బెల్లంకొండ సాయి శ్రీనివాస్
– యాక్ష‌న్ సీన్స్

మైన‌స్ పాయింట్లు
– రొటీన్ స్టోరీ
– ఫ‌స్టాఫ్
– పాట‌లు, రీరికార్డింగ్ యావ‌రేజ్‌గానే ఉన్నాయి

విశ్లేష‌ణ
హీరో ఫిజిక్ బెల్లంకొండ శ్రీను మెప్పించాడు. ఆయ‌న‌కి పోలీస్ కేర‌క్ట‌ర్ చ‌క్క‌గా సూట్ అయింది. క్యారెక్ట‌రైజేస‌న్ కూడా కుదిరింది. యాక్ష‌న్ సీన్స్ బాగా మెప్పించాయి. ఇక హీరోయిన్ కాజ‌ల్ త‌న పాత్ర‌లో బాగా న‌టించింది. మెహ‌రీన్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే కొంత మెరుగ‌నిపించేలా ఉంది. పాట‌ల కోసం వేసిన సెట్లు, వెతికిన లొకేష‌న్లు అన్నీ బావున్నాయి. మ్యూజిక్ ఆకర్ష‌ణీయంగా లేదు. పోసాని కామెడీ ఫ‌ర్వాలేద‌నిపించినా, ప‌లు సీన్లు సాగ‌దీసిన తీరు విసుగు కూడా పుట్టించింది. ఇంట‌ర్వెల్ ట్విస్ట్ బావుంది. అక్క‌డ అజ‌య్ మాట్లాడే డైలాగులు ప్రేక్ష‌కుడిని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తాయి. నీల్ నితిన్. ముఖేష్ రుషి త‌మ పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. సెకండాఫ్‌లో కొంత ఆక‌ట్టుకుంది. డైలాగ్స్ కూడా సాదీగా ఉన్నాయి. మొత్తంగా సినిమా బిలో యావ‌రేజ్ గా మిగిలిపోతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *