రజనీకాంత్ ‘కాలా’ మువీ రివ్యూ

సినిమా: కాలా
తారాగణం: రజనీకాంత్, నానా పటేకర్, హ్యూమా ఖురేషి, ఈశ్వరీరావు, సముద్రఖని, అంజలి పాటిల్, అరవింద్ ఆకాశ్, షాయాజీ షిండే తదితరులు
మ్యూజిక్: సంతోశ్ నారాయణ్
సినిమాటోగ్రఫీ: మురళి.జి
నిర్మాత: ధనుశ్
దర్శకత్వం: పా.రంజిత్
తరాలు మారినా తరగని క్రేజ్ రజనీకాంత్ కే సొంతం. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సూపర్ స్టార్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ అర్రులు చాస్తుంటారు. సినిమా థియేటర్ల వద్ద సందడి చేస్తారు. అందులోనూ ఈసారి రజనీ పొలిటికల్ ఎంట్రీ తర్వాత వచ్చిన సినిమా ఇది. మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ జనం ముందుకు రాబోతున్న నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో పెద్ద చర్చకు దారితీసింది. అనేక అడ్డంకులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా వాటిని అధిగమించిన థియేటర్లలో అడుగుపెట్టిన కాలా పరిస్థితి ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
తమిళనాడుకి చెందిన యువకుడు కరికాలన్(రజనీకాంత్) కొన్ని కారణాలతో ముంబైలోని ధారావికి వెళతాడు. కొద్దికాలంలోనే అక్కడి ప్రజలకు నాయకుడయిపోతాడు. అక్కడే జరీనా(హ్యూమా ఖురేషి)తో ప్రేమలో పడతాడు(ప్లాష్ బ్యాక్ ఏపిసోడ్).. కానీ ఒక్కటి కాలేకపోతారు. చివరకు కాలా సెల్వి(ఈశ్వరీరావు)ను పెళ్లి చేసుకుంటాడు. ధారావి ప్రాంతం పేద ప్రజలకు చెందింది. అక్కడున్న హిందూ ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉంటారు.ఆ ప్రాంతాన్ని ఆధీనం చేసుకోవాలని హరినాథ్ దేశాయ్(నానా పటేకర్) వంటి రాజకీయ నాయకుడు ప్రయత్నిస్తాడు. దానిని కాలా వ్యతిరేకిస్తాడు. కాలా అండతో ప్రజలు పోరాటానికి దిగుతారు. అనుకన్న పని కాకపోతే మన రాజకీయ నాయకులు ఊరుకుంటారా? అక్కడి మనుషుల మధ్య గొడవలు సృష్టిస్తారు. అప్పుడు కాలా ఏం చేస్తాడు? తన ప్రాంత ప్రజలను ఒక్కటి చేసే ఎలా పోరాడుతాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్:
-రజనీకాంత్
-పొలిటికల్ మువీ
మైనస్:
-సాగదీత
-రొటీన్ కథాంశం
ఫెర్మార్మెన్స్:
రజనీకాంత్ ఉన్నాడంటేనే సినిమా ఆయన చుట్టూ ఉంటుంది. ఆయనే బలం, బలహీనతగా చెప్పుకోవాల్సి వస్తుంది. కాలా కూడా అంతే. కబాలి ఫెయిల్యూర్ తర్వాత రెండేళ్లకు కాలా వచ్చింది. అయితే ఈసినిమా ఆయనకు పొలిటికల్ మైలేజ్ తీసుకురావడం కోసం రూపొందించిన సినిమాగా స్పష్టం అవుతోంది. దానికి తగ్గట్టుగా రజనీ గెటప్ నుంచి, అనేక విషయాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. కబాలిలో ఫస్టాఫ్‌లో రజనీకాంత్‌ను మాస్ హీరోగా చూపించి.. సెకండాఫ్‌లో ఫ్యామిలీ హీరోగా చూపించిన పా.రంజిత్ ఇందులో ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ మేన్‌లా చూపించారు. ఫ్లాష్ బ్యాక్‌లో హ్యూమాతో రజనీకాంత్ ప్రేమ.. విఫలం చెందడం.. ఈశ్వరీరావు, రజనీ మధ్య సన్నివేశాలు బావున్నాయి. ముఖ్యంగా ఈశ్వరీరావు నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. నానాపటేకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన పాత్రలన్నీ రజనీ చుట్టూ తిరిగేవే. ఇక ఎన్జి.ఒ సభ్యురాలుగా హ్యూమా నటన ఆకట్టుకుంటుంది. సముద్రఖని పాత్ర పరిధి మేర చక్కగా ఉంది. ఇక సాంతికేకంగా చూస్తే మురళి.జి సినిమాటోగ్రఫీ చాలా బావుంది. మ్యూజిక్ డైరెక్టర్ సంతోశ్ నారాయణ్ సంగీతం, నేపథ్య సంగీతం ఒకే. సినిమాలో రజనీ చేసే ఫ్లై ఓవర్ ఫైట్ సీన్.. ఇంటర్వెల్ బ్లాక్ మెప్పిస్తాయి.
ఎనాలిసిస్:
కరికాలుడు అలియాస్ కాలాగా రజనీకాంత్ తనదైన మాస్ పెర్ఫార్మెన్స్తో ఆక్టుకున్నారు. మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లా ఉండాలనుకునే ప్రేక్షకుడికి ఇది డిఫరెంట్‌గా అనిపిస్తుది. రజనీకాంత్‌లాంటి మాస్ హీరోతో ఇలాంటి సినిమా చేయడం సాహసంగతా చెప్పాలి. రజనీ కూడా నేను పక్కా కమర్షియల్ సినిమా చేయాలని కాకుండా ఓ మంచి మెసేజ్ ఉన్న సినిమా చేయాలని ఆలోచించి ఇమేజ్‌కి భిన్నంగా చేసిన సినిమా ఇది. ఇందులో చర్చించిన ప్రధానమైన పాయింట్ భూమి. స్వాతంత్యం వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా.. 60 శాతం మంది ప్రజలు స్వంత ఇల్లు లేకుండా ఉన్నారు. అటువంటి వారి గురించి, వారి సమస్యలు గురించి చర్చించే సినిమా. మొత్తంగా సగటు ప్రేక్షకుడిని నిరాశపరచడు కాలా
పంచ్ లైన్: పక్కా పైసా వసూల్ సినిమా
UPDATE APరేటింగ్: 3/5
Related News

కవచం మువీ రివ్యూ
Spread the loveసినిమా: కవచం నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ
Spread the loveసంచలన దర్శకుడు శంకర్ మరో సృష్టి అందరి దృష్టిని ఆకర్షించింది. వన్నె తరగని క్రేజ్ తో దూసుకుపోయేRead More