Main Menu

జ‌య‌జాన‌కి నాయ‌క: మువీ రివ్యూ

Spread the love

సినిమా: జ‌య‌జాన‌కి నాయ‌క
న‌టీన‌టులు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌గ్యాజైశ్వాల్‌, కేథ‌రిన్ ట్రెస్సా, సుమ‌న్‌, జ‌గ‌ప‌తిబాబు, శ‌ర‌త్‌కుమార్‌, చ‌ల‌ప‌తిరావు, నందు, శివ‌న్నారాయ‌ణ‌, త‌రుణ్ అరోరా, వాణీ విశ్వ‌నాథ్ త‌దిత‌రులు
మ్యూజిక్: దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత‌: మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: బోయ‌పాటి శ్రీను

వ‌ర్థ‌మాన న‌టుడే అయిన‌ప్ప‌టికీ బెల్లంకొండ శ్రీనుకి మొద‌టి నుంచి మంచి ఫాలోయింగ్ ఉంది. దానికి త‌గ్గ‌ట్టుగానే మాస్ సినిమాల‌తో ఆడియోన్స్ ని మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. దానికి కొన‌సాగింపుగానే ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్ లో జ‌య‌జాన‌కి నాయ‌క చేశాడు. దాంతో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా న‌టించిన సినిమా కావ‌డంతో ఆడియెన్స్ లో ఆస‌క్తి పెంచింది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఇక స్టార్ డైరెక్ట‌ర్, యంగ్ హీరో కాంబినేష‌న్ లో వ‌చ్చిన మువీ రివ్యూ చూద్దాం..

క‌థ‌

కేంద్ర‌మంత్రి (సుమ‌న్‌) కొడుకు కాలేజీలో చేస్తున్న అల్ల‌రిఓ ఒక‌మ్మాయి టీసీ తీసుకుని వెళ్లిపోవాల‌నుకుంటుంది. అయితే ఆమెను స్వీటీ (ర‌కుల్ ప్రీత్‌సింగ్) ఆపుతుంది. అది గ‌మ‌నించిన ఆక‌తాయి ఆమెపై కూడా దౌర్జ‌న్యం చేయాల‌నుకుంటాడు. అప్పుడు గ‌గ‌న్ (బెల్లంకొండ శ్రీను) జోక్యం చేసుకుంటాడు. గ‌గ‌న్‌కి తోడుగా అత‌ని తండ్రి చ‌క్ర‌వర్తి (శ‌ర‌త్‌కుమార్‌), సోద‌రుడు (నందు) కూడా ఫైట్ చేస్తారు. సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ ఆ విష‌యాన్ని మ‌న‌సులో పెట్టుకుని అశ్వ‌త్ నారాయ‌ణ వ‌ర్మ (జ‌గ‌ప‌తిబాబు) ఇంటి వేడుక‌కు హాజ‌ర‌వుతాడు. ప‌రువు కోసం ప్రాణాల‌ను లెక్క‌చేయ‌ని వ‌ర్మ త‌న కుమార్తె ఆత్మ‌హ‌త్య‌కు, కాబోయే అల్లుడి చావుకు కార‌ణ‌మ‌వుతాడు. మ‌రోవైపు డైమండ్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ను ప్రెస్టీజియ‌స్‌గా తీసుకుంటాడు. అంత‌వ‌ర‌కు లిక్క‌ర్ బిజినెస్‌లో ఉన్న ప‌వార్ దృష్టి ఈ క్రాంటాక్ట్ మీద ప‌డుతుంది. ప‌వ‌రు కోసం పాటుప‌డే ప‌వార్‌, ప‌రువు కోసం పాకులాడే వ‌ర్మ ఆడుతున్న గేమ్‌లోకి స్వీటీ అలియాస్ జాన‌కి (ర‌కుల్ ప్రీత్‌సింగ్‌) చేరుతుంది. ఆమెను వారిద్ద‌రి నుంచి హీరో ఎలా కాపాడాడ‌న్న‌దే అస‌లు సినిమా. తెర‌మీద చూడాల్సిందే..

ప్ల‌స్
మాస్ ని మెప్పించే క‌థ‌, క‌థ‌నం
మ్యూజిక్

మైన‌స్
కామెడీ లేక‌పోవ‌డం
అతిగా ఉన్న యాక్ష‌న్ సీన్స్

న‌టీన‌టులు

బెల్లంకొండ శ్రీను త‌న మార్క్ క్యారెక్ట‌ర్ లో మెప్పించాడు. యాక్ష‌న్ సీన్స్ లో ప‌వ‌ర్ ఫుల్ గా క‌నిపించాడు. ఫైట్లు, డ్యాన్సులు బాగా చేశాడు. ఇక ర‌కుల్ ఆక‌ట్టుకుంది. అటు అల్ల‌రి పిల్ల‌గా, బాధ్య‌త‌గా ఉన్న అమ్మాయిగా, డిప్రెష‌న్‌కు గురైన మ‌గువ‌గా ర‌కుల్ చ‌క్క‌గా క‌నిపించింది. గ్లామ‌ర్ పాత్ర‌లో ప్ర‌గ్యా, ఐట‌మ్ సాంగ్‌లో కేథ‌రిన్ అల‌రించింది. ప‌రువు కోసం ఏం చేయ‌డానికైనా వెన‌కాడ‌ని పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు ఒదిగిపోయాడు. త‌రుణ్ అరోరా యాజ్ యూజువ‌ల్‌గా క‌ర‌డుగ‌ట్టిన పాత్ర‌లో క‌నిపించారు. సుమ‌న్ ఈ సినిమాలో చేసిన త‌ర‌హా పాత్ర‌ల్ని ఇంత‌కు ముందు చాలానే చేశారు. మిగిలిన పాత్ర‌ల‌న్నీ త‌మ ప‌రిధి మేర‌కు ఫ‌ర్వాలేద‌నిపించారు,

టెక్నిక‌ల్ టీమ్

ద‌ర్శ‌కుడు బోయపాటి బ్రాండ్ క‌నిపించింది. అన్ని సీన్ల‌లోనూ ఆయ‌న మార్క్ స్ప‌ష్టం. కానీ క‌థ‌ను ఆస‌క్తిగా మ‌ల‌చ‌డానికి ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్టు లేదు. ముఖ్యంగా కామెడీ కి అస‌లు చోటివ్వ‌క‌పోవ‌డం చాలామందిని నిరాశ‌ప‌రుస్తుంది. ఇక మ్యూజిక్ దేవిశ్రీ ప్ర‌సాద్ మ‌రోసారి సినిమాకు అద‌న‌పు బ‌లంగా మార్చాడు.. వింటున్నంత సేపు ఫుట్ టాపింగ్‌గా ఉన్నాయి పాట‌లు. వీడే వీడే, ఎ ఫ‌ర్ అనే ఐట‌మ్ సాంగ్ ది బెస్ట్ సాంగ్స్. కెమెరాప‌నిత‌నం మెచ్చుకోవాలి. కీల‌క స‌న్నివేశాల్లో నేప‌థ్య సంగీతం బావుంది.

విశ్లేష‌ణ‌

పాటలు బాగున్నాయి. ఫైట్స్ కాస్త ఎక్కువ‌గా క‌నిపించాయి. కామెడీ క‌రువ‌య్యింది. డైలాగ్స్ కొన్ని ఆక‌ట్టుకున్నాయి. సినిమాలో రిచ్ నెస్ బాగా క‌నిపించింది. కానీ కేవ‌లం ఒక్క సెక్ష‌న్ కే ప‌రిమిత‌మ‌య్యేలా ఉంది. పూర్తిగా బోయ‌పాటి మార్క్ సినిమాల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌క న‌చ్చే మాస్ చిత్ర‌మిది.

పంచ్ లైన్: ప్యూర్ మాస్ మువీ
updateap రేటింగ్‌: 2/5


Related News

యూ ట‌ర్న్ మువీ రివ్యూ

Spread the loveసినిమా : యు ట‌ర్న్‌ న‌టీన‌టులు : స‌మంత‌, ఆది పినిశెట్టి, భూమిక‌, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్‌Read More

‘సిల్లీ ఫెలోస్’ మువీ రివ్యూ

Spread the loveసినిమా: సిల్లీఫెలోస్ న‌టీన‌టులు: అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్, బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసానిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *