Main Menu

జవాన్ మువీ రివ్యూ

Spread the love

మువీ: జవాన్
తారాగ‌ణం: సాయిధ‌ర‌మ్ తేజ్‌, మెహ‌రీన్‌, ప్ర‌స‌న్న‌, నాగ‌బాబు, జ‌య‌ప్ర‌కాష్‌, కోట శ్రీనివాస‌రావు, స‌త్యం రాజేష్, సుబ్బ‌రాజు త‌దిత‌రులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: కె.వి.గుహ‌న్‌
ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌
నిర్మాత: కృష్ణ‌
ద‌ర్శ‌క‌త్వం: బి.వి.ఎస్‌.ర‌వి

వరుస పరాజయాలతో ఢీలా పడి ఉన్న సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఎలాగైనా హిట్ సాధించి స‌క్సెస్ ట్రాక్‌లోకి రావాల‌నుకున్న నేపథ్యంలో వచ్చిన మువీ `జ‌వాన్‌`. బి.వి.ఎస్‌.ర‌వి కూడా ఎలాగైనా త‌న‌ను తాను ద‌ర్శ‌కుడిగా నిరూపించుకునే ప్ర‌య‌త్నంలో భాగంగా ఈ `జ‌వాన్` సినిమాను తెక‌రెక్కించాడు దేశం ప‌ట్ల బాధ్య‌త గ‌ల ఓ యువ‌కుడు దేశం కోసం..అదే స‌మ‌యంలో త‌న కుటుంబం కోసం ఏం చేశాడ‌నేదే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్ర ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపింది. ఓపెనింగ్స్ దానికి తగ్గట్టుగా ఉన్నాయి. మరి మువీ ఎలా ఉందో ఈ రివ్యూ చూడండి..

క‌థః
జై(సాయిధ‌ర‌మ్ తేజ్‌), కేశ‌వ‌(ప్ర‌స‌న్న‌)లు చిన్న‌ప్పుడు స్నేహితులు. చిన్న‌ప్పుడే ఇద్ద‌రు విడిపోతారు. చిన్న‌ప్ప‌టి నుండి కేశ‌వ హింస‌ను, స్వార్ధాన్ని న‌మ్ముకుని దేశానికి చెడు చేయాల‌నుకునే తీవ్ర‌వాద సంస్థ‌ల‌తో చేతులు క‌లుపుతాడు. జై చిన్న‌ప్ప‌టి నుండి ఆర్‌.ఎస్‌.ఎస్‌. స‌భ్యుడు కావ‌డం..తండ్రి బాధ్య‌త గ‌ల ఉపాధ్యాయుడిగా ఉండ‌టం వంటి కార‌ణాల‌తో దేశ భ‌క్తుడిగా ఎదుగుతాడు. కానీ కేశ‌వ దేశ ద్రోహి అనే విష‌యం జై తెలియ‌దు. దేశ ర‌క్ష‌ణ సంస్థ‌ల్లో ఒక‌టైన డి.ఆర్‌.డి.ఒ సంస్థ‌లో ఎలాగైనా ఉద్యోగం సంపాదించాల‌నే క‌ల‌తో ఉంటాడు జై. క‌థ ఇలా సాగే క్ర‌మంలో..దేశ ర‌క్ష‌ణ కోసం డి.ఆర్‌.డి.ఒ. అక్టోప‌స్ అనే మిసైల్‌ను త‌యారు చేస్తుంది. ఈ మిసైల్‌ను సొంతం చేసుకుని ఇండియాను భ‌య‌పెట్టాల‌ని శ‌త్రుదేశాలు ప్ర‌య‌త్నిస్తాయి. ఆ మిసైల్‌ను దొంగ‌లించే డీల్‌ను కేశ‌వ‌కు అప్పగిస్తారు. అయితే స్టాంపుల‌ను త‌యారు చేసే వ్య‌క్తి(కోట శ్రీనివాస‌రావు) వ‌ల్ల డి.ఆర్‌.డి.ఒకి సంబంధించి ఏదో జ‌రుగుతుంద‌ని జైకి తెలుస్తుంది. జై వేసే ఓ ప్లాన్ వ‌ల్ల అసలు విష‌యం తెలుస్తుంది. దాంతో దేశానికి చెడు చేయాల‌నుకునే కేశ‌వ ఆలోచ‌న‌కి బ్రేక్ వేస్తాడు జై దీంతో జై, కేశ‌వ‌ల మ‌ధ్య మైండ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. కేశ‌వ ఓ స్నేహితుడిలా..జై ఇంటికి వ‌చ్చి ..త‌న కుటంబాన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తాడు. చివ‌ర‌కు జై త‌న కుటుంబాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకున్నాడ‌నేదే? అస‌లు క‌థ‌.

ప్లస్:
సాయి ధరమ్ తేజ్
మ్యూజిక్

మైనస్:
కథనం
సెకండాఫ్

న‌టీన‌టులు:

హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమా ప్రారంభం నుండి ఓ మైండ్ సెట్‌లోనే క‌న‌ప‌డ‌తాడు. పాత్ర పరంగా త‌న‌కు ఈ సినిమాలో జై పాత్ర కాస్త‌ హెవీగానే అనే అనిపిస్తుంది. అయితే సాయిధ‌ర‌మ్ త‌న శ‌క్తి మేర చ‌క్క‌గానే న‌టించాడు. డ్యాన్సులు, ఫైట్స్‌ల్లో గ‌త చిత్రాల్లాగానే పూర్తి ఎన‌ర్జీని ఫోక‌స్‌చేశాడు. మెహ‌రీన్ భార్గ‌వి అనే పెయింట‌ర్‌గా ,బ‌బ్లీ పాత్ర‌లో క‌నిపించింది. తెర‌పై బొద్దుగా క‌న‌ప‌డింది. ఈ పాత్ర‌కు పెర్‌ఫార్మెన్స్ ప‌రంగా పెద్ద‌గా స్కోప్ లేదు. ఒక‌ట్రెండు స‌న్నివేశాలు మిన‌హా సాంగ్స్‌కే ప‌రిమితం అయ్యింది. గ్లామ‌ర్ ప‌రంగా మెహ‌రీన్ అందాల‌ను బాగానే అర‌బోసింది. విల‌న్ పాత్ర‌లో ప్ర‌స‌న్న న‌ట‌న మెప్పిస్తుంది. ఏదో భారీ డైలాగులతో బెద‌రగొట్ట‌కుండా ద‌ర్శ‌కుడు సిచ్యువేష‌న్ విల‌నిజాన్ని, స్టైలిష్‌గా చూపించాల‌నుకున్నాడు. దాన్ని ప్ర‌స‌న్న వంద‌శాతం తెర‌పై ఆవిష్క‌రించాడు. తెలుగుకి మ‌రో మంచి విల‌న్ దొరికిన‌ట్టే మ‌రి. ఇక నాగ‌బాబు, జ‌య‌ప్ర‌కాష్‌, ఈశ్వ‌రీరావు, సుబ్బ‌రాజు, కోట‌శ్రీనివాస‌రావు, స‌త్యం రాజేష్ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణులు:
దేశాన్ని కాపాడుకోవాల‌నుకునే ఓ యువ‌కుడు.. దేశ ర‌హ‌స్యాల‌ను శత్రు దేశాల‌కు అమ్మేయాల‌నుకునే మ‌రో వ్య‌క్తి మ‌ధ్య పోరాటం అనే కాన్సెప్ట్‌పై తెలుగులో ఎప్ప‌టి నుండో చాలా సినిమాలు వ‌చ్చాయి. సింపుల్‌గా చెప్పాలంటే నేను, నా కుటుంబం, నా దేశం అనుకునే క‌థానాయ‌కుడికి, నేను మాత్ర‌మే అనుకునే ప్ర‌తి నాయ‌కుడికి మ‌ధ్య జ‌రిగే పోరే `జ‌వాన్‌`. ఏదో అవేశంగా ఇద్ద‌రువ్య‌క్తులు పొట్లాడుకోవ‌డం కాకుండా సినిమాను మైండ్ గేమ్ స్టైల్లో తెరెకెక్కించాడు ద‌ర్శ‌కుడు బి.వి.ఎస్‌.ర‌వి. క‌థ‌ను చెప్పాల‌నుకున్న క్ర‌మం, ఎంచుకున్న డి.ఆర్‌.డి.ఒ బ్యాక్‌డ్రాప్ బావున్నా, సినిమాలో ఏదో హ‌డావుడి తెర‌పై బాగానే క‌న‌ప‌డింది. ఇది కాస్త ప్రేక్ష‌కుడిని అయోమ‌యానికి గురి చేస్తుంది. త‌మ‌న్ ట్యూన్స్ లో `బంగారు` అనే సాంగ్‌తో పాటు `బుగ్గ అంచున..` సాంగ్ బానే ఉంది . పాట‌ల చిత్రీక‌ర‌ణ విజువ‌ల్‌గా బావున్నాయి.అవునన్నా కాద‌న్నా..అనే శ్రేయోఘోష‌ల్ పాడిన సిచ్చువేష‌నల్ సాంగ్ బావుంది. ఇక నేప‌థ్య సంగీతం విషయానికి వ‌స్తే..త‌మ‌న్ చేయాల్సిన సౌండ్ కంటే ఎక్కువ రీరికార్డింగ్ చేశాడ‌నిపించింది. సినిమాకు ఇదొక మైన‌స్సే. ఇక సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ సినిమాకు మేజ‌ర్ ప్ల‌స్ అయ్యారు. ప్ర‌తి సీన్‌ను రిచ్ విజువ‌ల్‌లో తెర‌పై చూపించాడు. ఎడిట‌ర్ ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్ సినిమాను క్రిస్ప్‌గానే ఎడిట్ చేసినా..పైన చెప్పిన హడావిడి తెర‌పై ప్రేక్ష‌కుడిని ఏదో గంద‌ర‌గోళానికి గురి చేస్తుంది.

ఓవరల్ గా:

దేశ ర‌క్ష‌ణ‌లో డి.ఆర్‌.డి.ఒ సంస్థ‌ది కీల‌క‌మైన పాత్ర‌. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. ఆ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా చేయాల‌నుకోవ‌డం బానే ఉంది. కానీ నిర్వ‌హ‌ణ‌లో ఎక్క‌డో లోపం జ‌రిగిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది.

బోటమ్ లైన్ః జ‌వాన్‌..కథనం బోర్ కొట్టిస్తోంది.
రేటింగ్ః 2/5


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *