Main Menu

జై లవకుశ మువీ రివ్యూ

Spread the love

సినిమా: జై లవకుశ
తారాగణం: ఎన్.టి.ఆర్‌, నివేదా థామ‌స్‌, రాశిఖ‌న్నా, సాయికుమార్, పోసాని త‌దిత‌రులు
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత: నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌
ద‌ర్శ‌క‌త్వం: కె.ఎస్‌.ర‌వీంద్ర‌

హ్యాట్రిక్ హిట్లతో ఊపు మీదున్న తారక్ తాజా సినిమా `జై ల‌వ‌కుశ‌`. అందులోనూ ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రిభినయం చేసిని సినిమా కావడంతో మరింత ఆసక్తిని రాజేసింది. చాలాకాలం తర్వాత ఓ స్టార్ హీరో త్రిపాత్రిభినయం చేసిన సినిమా ఇదే కావడం విశేషం. దానికి తగ్గట్టుగానే ఆడియోకి మంచి రెస్పాన్స్ రావడం, ట్రైలర్ కి రికార్డ్ వ్యూస్ రావడంతో సినిమా కోసం ఫ్యాన్స్ లో జోష్ కనిపించింది. మరి వారి అంచనాలు హై పీక్ లో ఉన్న దశలో వాటిని అందుకోవడంలో జై లవకుశ సక్సెస్ అయ్యాడా…ఈ రివ్యూలో చూద్దాం

క‌థ: సినిమా క‌థ రామ‌చంద్రా పురం గ్రామంలో మొద‌లవుతుంది. ఆ గ్రామంలో పుట్టిన జై ల‌వ‌కుశ‌లు క‌వ‌ల‌లు. జై పెద్ద‌వాడు. త‌న‌కు న‌త్తి ఉంటుంది. వీరి ఫ్యామిలీ నాట‌క రంగాన్ని న‌మ్ముకుని బ్ర‌తుకుతుంటుంది. జైకి ఉన్న న‌త్తి కార‌ణంగా వీరి మావ‌య్య‌(పోసాని), త‌న ఆధ్వ‌ర్యంలో వేసే రామాయ‌ణ నాట‌కంలో ల‌వ‌, కుశ‌ల‌కే ప్రాధాన్య‌త‌నిస్తుంటాడు. అందువ‌ల్ల జైకి ఆత్మ న్యూన‌త భావం ఏర్ప‌డుతుంది. దానిలో జైకి క‌సి పెరుగుతుంది. త‌మ్ముళ్ల‌ను చంపాల‌ని ప్లాన్ వేసి నాట‌క స్థలాన్ని పేల్చేస్తాడు. అక్క‌డితో సీన్ క‌ట్‌. ముగ్గురు అన్న‌దమ్ములు విడిపోతారు. ల‌వ‌కుమార్ బ్యాంక్ ఆఫీస‌ర్ అవుతాడు. మంచివాడైన ల‌వ‌కుమార్‌ను అంద‌రూ మోసం చేసి లోన్స్ తీసుకుని క‌ట్ట‌కుండా మోసం చేసేస్తుంటారు. ఆ స‌మ‌యంలో కుశుడు, ల‌వుడు ఒక‌రికొక‌రు తార‌స‌ప‌డ‌తారు.

కుశుడు దొంగ. ప‌క్క‌వారిని మోసం చేసే మ‌న‌స్త‌త్వ‌మున్న కుశుడు మోసంతో భారీ మొత్తంలో డ‌బ్బులు సంపాదిస్తాడు. అయితే నోట్ల మార్పిడి కార‌ణంగా పాత నోట్లు చెల్ల‌క‌పోవ‌డంతో దిగులుప‌డ‌తాడు. ఆ స‌మ‌యంలో కుశుడు ల‌వుడి స్థానంలో బ్యాంకులోకి వెళ్లి నోట్లు మార్చుకోవాల‌ని ప్ర‌య‌త్నం చేస్తాడు. కానీ కుద‌ర‌దు. రిక‌వ‌రీ డ‌బ్బుతో కూడా ల‌వ‌కుమార్‌కి చెప్ప‌కుండా పారిపోతాడు. పోలీసులు ల‌వ‌కుమార్‌ని అనుమానిస్తారు. అయితే క‌థ ట‌ర్న్ తీసుకుంటుంది. ఇద్ద‌రినీ జై కిడ్నాప్ చేస్తాడు. అస‌లు జై ల‌వ‌, కుశ‌ల‌ను ఎందుకు కిడ్నాప్ చేస్తాడు? జై ఎవ‌రు? జై రావ‌ణ‌లా ఎందుకు మారుతాడు? చివ‌ర‌కు ముగ్గురు అన్న‌ద‌మ్ములు క‌లుస్తారా? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్:
ఎన్టీఆర్ నటన
మ్యూజిక్

మైన‌స్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
సెకండాఫ్

విశ్లేష‌ణ:

మూడు పాత్రల్లోనూ మెప్పించడానికి ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమించాడు. సగటు ప్రేక్షకుడు పూర్తిగా సంత్రుప్తి పరిచాడు. సహజంగానే పాటల్లో చెలరేగిపోయాడు. జై పాత్రను పండించడం ద్వారా మాస్ ను మెప్పించాడు. కామెడీ కూడా బాగానే పండించాడు. ఎన్టీఆర్ మొత్తంగా మంచి మార్కులు సాధించాడు. ఇక హీరోయిన్స్‌గా న‌టించిన నివేద థామ‌స్‌, రాశిఖ‌న్నాలు పాట‌ల‌కే ప‌రిమితం అయ్యారు. వీరి పాత్ర‌ల్లో న‌ట‌న‌కు స్కోప్ త‌క్కువ‌గా ఉంది. ఇక సాయికుమార్‌, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, రోనిత్ రాయ్‌, అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

ఇక టెక్నికల్ టీమ్ లో ప్రధానంగా భారీ ఫ్లాప్ తర్వాత మంచి అవకాశమే దక్కించుకున్నప్పటికీ బాబీ దానిని నిలబెట్టుకోవడంలో పూర్తిగా సఫలం కాలేదని చెప్పక తప్పదు. ముఖ్యంగా సెకండాఫ్ లో మరిన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. కొన్ని డైలాగ్స్ మాత్రం బాగా ఆకట్టుకున్నాయి. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. పాటలు ఆకట్టుకున్నాయి.

మొత్తం మీద బాబీ కథ బోర్ కొట్టించకపోయినా ఆశించినంత ఫలితం అయితే ఇవ్వలేకపోయింది. క‌థ‌, సెకండాఫ్‌లో కాస్తా క‌థ టెంపో డ్రాప్ అవ‌డం మైనస్ గా మారింది. అయినా ఫ్యాన్స్ ని, మాస్ ఆడియోన్స్ ని ఓ మేరకు సంత్రుప్తి పరచగలదు.

పంచ్ లైన్ లైన్: మంచి ఎంటర్ టైనర్
రేటింగ్: 2.75/5


Related News

యూ ట‌ర్న్ మువీ రివ్యూ

Spread the loveసినిమా : యు ట‌ర్న్‌ న‌టీన‌టులు : స‌మంత‌, ఆది పినిశెట్టి, భూమిక‌, రాహుల్ రవీంద్రన్‌, న‌రేన్‌Read More

‘సిల్లీ ఫెలోస్’ మువీ రివ్యూ

Spread the loveసినిమా: సిల్లీఫెలోస్ న‌టీన‌టులు: అల్ల‌రి న‌రేష్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ‌, నందినిరాయ్, బ్ర‌హ్మానందం, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, పోసానిRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *