Main Menu

‘గీత గోవిందం’ సినిమా రివ్యూ

Spread the love

.

సినిమా: గీత‌గోవిందం
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మందాన్న, నాగ‌బాబు, సుబ్బ‌రాజు, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, గిరిబాబు, అన్న‌పూర్ణ‌మ్మ‌, త‌దిత‌రులు…
సంగీతం: గోపిసుంద‌ర్‌
సినిమాటోగ్రాఫ‌ర్‌: మ‌ణికంద‌న్‌
ఎడిట‌ర్‌: మార్తాండ్‌.కె.వెంక‌టేష్
నిర్మాత‌: బ‌న్నివాసు
క‌థ‌-స్క్రీన్‌ప్లే-మాట‌లు-ద‌ర్శ‌క‌త్వం: ప‌రుశురామ్‌

ఆస‌క్తిక‌ర టైటిల్ తో కుటుంబ క‌థా చిత్రంగా గీత గోవిందం విశేష ప్ర‌చారం సాధించింది. వ‌రుస‌గా స‌క్సెస్ లు కొడుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమా కావ‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఫ్యామిలీ సినిమాల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కిస్తాడ‌నే పేరున్న ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్‌. విలువ‌లున్న సినిమాల నిర్మాత‌గా బ‌న్నీ వాసు కాంబినేష‌న్ కావ‌డం దానికో కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు. అల్లు అర‌వింద్ స‌మ‌ర్పించిన సినిమాకు మెగా కుటుంబం నుంచి కూడా మ‌ద్ధ‌తు ల‌భించ‌డంతో ప్ర‌చారం పీక్ లో సాగింది. ఇక స్వ‌తంత్ర్య‌దినోత్స‌వం నాడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

క‌థ‌: విజ‌య్ గోవిందం(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఇంజ‌నీరింగ్ కాలేజీ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. అమ్మ చిన్న‌ప్పుడే చ‌నిపోవ‌డంతో.. కాబోయే భార్య‌ను ప్రేమ‌గా చూసుకోవాల‌ని విజ‌య్ గోవిందం అనుకుంటాడు. గుడిలో ఓ అమ్మాయిని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. గోవింద్ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఊరికి వెళ్ల‌డానికి బ‌స్సు ఎక్కిన గోవింద్‌కి బ‌స్సులో త‌ను గుడిలో చూసిన అమ్మాయి తార‌స‌ప‌డుతుంది. ఆ అమ్మాయి పేరు గీత‌(ర‌ష్మిక మండ‌న్న) అనుకోకుండా గీత‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ లిప్ లాక్ పెట్టేస్తాడు. విజ‌య్‌ని త‌ప్పుగా అర్థం చేసుకున్న గీత విష‌యాన్ని అన్న‌కు చెప్పేస్తుంది. గీత అన్న‌య్యే త‌న చెల్లెల‌కు కాబోయే భ‌ర్త అని త‌ర్వాత గోవిందంకు తెలుస్తుంది. అప్పుడు గోవిందం ఏం చేస్తాడు? గీత విజ‌య్ గురించి అన్న ద‌గ్గ‌ర చెప్పేస్తుందా? గోవిందం, గీత ఎలా ప్రేమ‌లో ప‌డ‌తారు? చివరికి వారి క‌థ ఎలాంటి మ‌లుపు తిరుగుతుంద‌నేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌:
కామెడీ సీన్స్
పాట‌లు

మైన‌స్ పాయింట్స్:
రొటీన్ క‌థాంశం
హీరోయిన్

ఫెర్మార్మెన్స్

అర్జున్‌రెడ్డిలో కోపోద్రేకమైన పాత్ర‌లో క‌న‌ప‌డ్డ విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమాలో అందుకు పూర్తి భిన్న‌మైన పాత్ర‌లో క‌న‌ప‌డ్డారు. హీరో, రాహుల్ రామ‌కృష్ణ‌, ఇత‌ర స్నేహితులు మ‌ధ్య సందర్భానికి తగ్గట్టు వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. అలాగే సిినిమా ద్వితీయార్థంలో వెన్నెల‌కిషోర్ పండించిన హాస్యం మెప్పిస్తుంది. హీరో, హీరోయిన్ మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు.. సినిమాటిక్‌గా ఉన్నా.. ఎక్క‌డా విసుగు తెప్పించవు. అలాగే హీరోయిన్ ప్రేమ‌ను గుర్తించిన హీరో.. పెళ్లిని ఆప‌డానికి శ్ర‌మ‌ప‌డ‌టం.. రాహుల్ రామ‌కృష్ణ‌, వెన్నెల‌కిశోర్ మ‌ధ్య కామెడీ ట్రాక్ అన్నీ ప్రేక్ష‌కుల‌కు న‌వ్వు తెప్పిస్తాయి. నిత్యామీన‌న్‌, అనుఇమ్మాన్యుయేల్ అతిథి పాత్ర‌ల్లో మెప్పించారు.

విశ్లేష‌ణ‌:
క‌థ పాత‌ది కావ‌డంతో సినిమా ఆసాంతం ప్రేక్ష‌కుడికి సీన్స్ ఊహించిన‌ట్టుగా ఉన్న‌ట్టు అనిపిస్తోంది. భావ‌ద్వేగాలు మేళ‌వించిన తీరు కొంత మెప్పించింది. కానీ పూర్తిగా హీరో విజ‌య్ దేవ‌రకొండ ఆధారంగా సినిమా సాగింది. సంగీతం ఆకట్టుకుంది. ఇంకేం ఇంకేం కావాలే.. పాట ప్రేక్ష‌కుల‌ను బాగా ఆకట్టుకుంటుంది. నేప‌థ్య సంగీతం బావుంది. మ‌ణికంద‌న్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. సినిమా లొకేష‌న్స్ కోసం తెగ క‌ష్ట‌ప‌డ్డ‌ట్టు ఎక్క‌డా క‌న‌ప‌డదు.

చివ‌ర‌గా.. ప్రేమ గీతాల గోవిందం
రేటింగ్ : 2.5/5


Related News

జెర్సీ మువీ రివ్యూ

Spread the loveమువీ: జెర్సీ న‌టీన‌టులు: నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్, స‌త్యరాజ్‌, రోనిత్ క‌మ్ర‌, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ, శిశిర్Read More

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *