Main Menu

‘దువ్వాడ జ‌గ‌న్నాథం’ ఎలా ఉన్నాడు? మువీ రివ్యూ

dj
Spread the love

మువీ: దువ్వాడ జ‌గ‌న్నాథం
న‌టీన‌టులు: అల్లు అర్జున్‌, పూజా హెగ్డే, రావుర‌మేష్, సుబ్బ‌రాజు , త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు
కెమెరా: ఐనాక బోస్‌
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
ఎడిట‌ర్‌: చోటా కె. ప్ర‌సాద్‌
స్క్రీన్ ప్లే: ర‌మేశ్ రెడ్డి, దీప‌క్ రాజ్‌
నిర్మాత‌లు: దిల్‌రాజు – శిరీష్‌
క‌థ, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: హ‌రీశ్ శంక‌ర్‌

వ‌రుస స‌క్సెస్ ల‌తో ఊపుమీదున్న స‌రైనోడు అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జ‌గ‌న్నాథం గెట‌ప్ లో జ‌నం ముందుకు రావ‌డంతో ఆస‌క్తి పెరిగింది. డీజే టీజ‌ర్, ఆడియో అదిరిపోవ‌డంతో అంచ‌నాలు పెరిగిపోయాయి. అందులో దిల్ రాజు, బ‌న్నీ కాంబినేష‌న్ లో వ‌చ్చిన స‌క్సెస్ ల రీత్యా మ‌రింత క్రేజ్ క‌నిపించింది. హ‌రీష్ శంక‌ర్ వ‌రుస హిట్ల‌తో మెగా కాంపౌండ్ హీరోల‌కు మంచి సినిమాలు అందిస్తున్న నేప‌థ్యంలో డీజే భ‌జే భజే అన‌డం ఖాయ‌మ‌ని అంతా భావించారు. ఇక అల్లు అర్జున్ డ్యూయ‌ల్ రోల్ లో క‌నిపించిన తొలి సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ ని ఉత్సాహ‌ప‌రిచింది. దానికి త‌గ్గ‌ట్టుగానే థియేట‌ర్ల‌లో అడుగుపెట్టిన సినిమా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. మ‌రి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం

క‌థః
విజ‌య‌వాడ‌కు చెందిన బ్రాహ్మ‌ణ యువ‌కుడు డిజె ,దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌(అల్లు అర్జున్‌). ధ‌ర్మో ర‌క్షితి ర‌క్షితః అనే సూత్రాన్ని న‌మ్మేవాడు. అన్యాయం చేసేవాళ్ళ‌ను చంపేయాల‌నుకునే ర‌కం. జ‌గ‌న్నాథ‌మ్‌కు ఎఫ్‌.ఐ.ఆర్ రాసే పోలీస్ ఆఫీస‌ర్‌(ముర‌ళీశ‌ర్మ)తో స‌హా కొంత మంది స‌హ‌కారం అందిస్తూ ఉంటారు. హైద‌రాబాద్‌లో డి.జెగా ఉంటూ అన్యాయం చేసిన వారిని చంపేస్తుంటాడు, విజ‌య‌వాడ‌లో అన్న‌పూర్ణ క్యాట‌రింగ్ స‌ర్వీస్ న‌డుపుతుంటాడు. జ‌గ‌న్నాథ‌మ్ స్నేహితుడు విఘ్నేశ్వ‌ర శాస్త్రి పెళ్ళిలో పూజ(పూజా హెగ్డే)ను క‌లుస్తాడు. పూజ‌ను ప్రేమిస్తాడు కూడా. క‌థ ఇలా సాగుతుండ‌గా జ‌గ‌న్నాథ‌మ్ మావ‌య్య‌(చంద్ర‌మోహ‌న్‌) అగ్రో డైమండ్ అనే రియ‌ల్ ఎస్టేట్ సంస్థ చేసే ప‌ని వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకుంటాడు. దాంతో జ‌గ‌న్నాథ‌మ్ డిజెగా కంపెనీ గురించి ఆరా తీస్తాడు. ఆ కంపెనీ ఎండి స్టీఫెన్ ప్ర‌కాష్‌(శ‌త్రు)ను ప‌ట్టుకుంటాడు. కానీ స్టీఫెన్ ప్ర‌కాష్ వెనుక ఉండి రొయ్య‌ల నాయుడు(రావు ర‌మేష్) ఈ నాట‌కం ఆడిస్తున్నాడ‌ని తెలియ‌దు.

అలాగే డిజె అంటే ఎవ‌రో కూడా రొయ్య‌ల‌నాయుడుకి తెలియ‌దు. స్టీఫెన్ ప్రకాష్ అస‌లు గుట్టు ఎక్క‌డ చెప్పేస్తాడోన‌ని రొయ్య‌ల నాయుడు భ‌య‌ప‌డి డిజెను చంపేయాల‌నుకుంటాడు. మ‌రోవైపు హోం మినిస్ట‌ర్(పోసాని కృష్ణ‌ముర‌ళి) కుమార్తెకు, త‌న కొడుకునిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. అప్పుడేం జ‌రుగుతుంది. జ‌గ‌న్నాథానికి రొయ్య‌ల నాయుడు గురించి తెలుస్తుండా? రొయ్య‌ల నాయుడుకి జ‌గ‌న్నాథ‌మ్‌, డిజె ఒక‌టే అనే నిజం తెలుస్తుందా? చివ‌ర‌కు డిజెగా జ‌గ‌న్నాథ‌మ్ ప్ర‌జ‌ల‌కు ఎలా న్యాయం చేశాడు? త‌న ప్రేయ‌సిని ఎలా ద‌క్కించుకున్నాడు అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

allu arjun dj
ప్లస్:-

– క‌థ‌నం
– మ్యూజిక్

మైన‌స్:-

– రొటీన్ స్టోరీ
– స్క్రీన్ ప్లే

విశ్లేష‌ణః
అల్లు అర్జున్ మ‌ళ్లీ చెల‌రేగిపోయాడు. రెండు షేడ్స్‌లోనూ ప్ర‌త్యేక‌త ప్ర‌ద‌ర్శించాడు. ఒక‌వైపు మాస్‌గా అన్యాయాల‌పై తిర‌గ‌డ‌బ‌డే డీజే, మ‌రోవైపు కుటుంబం కోసం తాప‌త్ర‌య‌ప‌డే జ‌గ‌న్నాథ శాస్త్రిగా అద్భుతంగా న‌టించాడు. రెండు పాత్ర‌ల్లో చ‌క్క‌టి వేరియేష‌న్స్ చూపిస్తూ బ‌న్ని ప్ర‌ద‌ర్శించిన అబిన‌యం మెచ్చుకోలుగా ఉంది. ముఖ్యంగా బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా అల్లు అర్జున్ వేష‌ధార‌ణ‌, లాంగ్వేజ్ ఉప‌యోగించిన తీరు, హావ‌భావాలు చ‌క్క‌గా ప‌లికించాడు. ఇక బ‌న్ని ఫైట్స్‌, డ్యాన్సులు ఇర‌గ‌దీశాడు. పూజాహెగ్డే కొంత గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్ లో కనిపించింది. అయితే పూర్తిగా స్కిన్ షోకి ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. మిగిలిన పాత్ర‌ల్లో రావుర‌మేష్, సుబ్బ‌రాజు , త‌నికెళ్ల భ‌ర‌ణి త‌మ ప‌రిధిలో మేర‌కు ఆక‌ట్టుకున్నారు. ఇక పోసాని కృష్ణ‌ముర‌ళి, శ‌త్రు, హ‌రీష్ ఉత్త‌మ‌న్‌, చంద్ర‌మోహ‌న్‌, వెన్నెల‌కిషోర్ అల‌రించారు.

విశ్లేష‌ణ‌:

సినిమాలో అస‌లు పాయింట్ హీరో అన్యాయాల‌పై తిర‌గ‌బ‌డ‌తాడు..మరోవైపు ఎవ‌రికీ తెలియ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బ్రాహ్మ‌ణ వేష‌ధార‌ణ‌లో వంట‌వాడిగా ఉంటాడు. ఈ విష‌యం ఎంట‌నేది ప్రారంభంలోనే తెలిసిపోతుంది. ఇక హీరో హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ , హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్, హీరో ఎలివేష‌న్ స‌న్నివేశాలు మిన‌హా సినిమా అంతా రివేంజ్ ఫార్ములాలో సాగుతుంది. దేవిశ్రీ ప్ర‌సాద్ సాంగ్స్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూప‌ర్బ్‌గా సినిమాకు ప్లస్ అయ్యాయి. ఐనాక బోస్ సినిమాటోగ్ర‌ఫీ సూప‌ర్బ్‌. ప్ర‌తి సీన్ రిచ్‌గా క‌న‌ప‌డుతుంది. అబుదాబి సీన్స్, సాంగ్స్ పిక్చ‌రైజేష‌న్ చ‌క్క‌గా ఉంది. ఫ‌స్టాఫ్ అంతా ల‌వ్ ట్రాక్‌, ఎంట‌ర్‌టైనింగ్‌తో పాటు కాస్తా హీరోయిజ‌మ్ ఎలివేష‌న్ చేసేలా సాగుతుంది. ఇక సెకండాఫ్ పూర్తిగా హీరో, విల‌న్ మ‌ధ్య టామ్ అండ్ జెర్రీ త‌ర‌హాలో సాగుతుంది.

పంచ్ లైన్ః బీ, సీ సెంట‌ర్లలో ప‌క్కా..
updateap రేటింగ్ః 2.5/5


Related News

pantham-movie-review

పంతం మువీ రివ్యూ

Spread the loveసినిమా: ప‌ంతం తారాగ‌ణం: గోపీచంద్‌, మెహ్రీన్ కౌర్‌, శ్రీనివాస‌రెడ్డి, పృథ్వి, సంప‌త్ త‌దిత‌రులు మ్యూజిక్: గోపీ సుంద‌ర్‌Read More

kaala-karikaalan_044cf412-4c00-11e7-81ca-1a4d4992589d

రజనీకాంత్ ‘కాలా’ మువీ రివ్యూ

Spread the loveసినిమా: కాలా తారాగ‌ణం: ర‌జనీకాంత్‌, నానా ప‌టేక‌ర్‌, హ్యూమా ఖురేషి, ఈశ్వ‌రీరావు, స‌ముద్ర‌ఖ‌ని, అంజ‌లి పాటిల్‌, అర‌వింద్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *