దర్శకుడు ఎలా ఉన్నాడు?:మువీ రివ్యూ

darshakudu-r3
Spread the love

సినిమా: దర్శకుడు
న‌టీన‌టులుః అశోక్‌, ఈషారెబ్బా, పూజిత‌, నోయెల్‌, సుద‌ర్శ‌న్‌, కేధారి శంక‌ర్‌, వైభ‌వ్‌, జెమినిసురేష్ త‌దిత‌రులు
సంగీతంః సాయికార్తీక్‌
నిర్మాత‌లుః బిఎన్‌సిఎస్‌పి విజయ్‌కుమార్‌, థామస్‌ రెడ్డి అదూరి, రవిచంద్ర సత్తి
క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః హ‌రిప్ర‌సాద్ జ‌క్కా

టాలీవుడ్ దర్శకుల్లో సుకుమార్ శైైలి వేరుగా ఉంటుంది. లెక్చరర్ గా పనిచేసి సినిమాల్లోకి వచ్చిన సుకుమార్ తొలిసినిమా ఆర్య‌ నుంచి ఆకట్టుకుంటున్నాడు. ీ క్రమంలోనే ఈ దర్శకుడు ఆలోచ‌న‌ల నుండి పుట్టిన మ‌రిన్ని క‌థ‌ల‌ను మినిమం బ‌డ్జెట్‌లో చేయాల‌నే ఆలోచ‌న‌తో నిర్మాతగా మారాడు. ఇప్పటికే కుమారి 21 ఎఫ్ సినిమాతో నిర్మాత‌గా స‌క్సెస్ అయ్యాడు. ఇప్పుడు సుకుమార్ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన మ‌రో సినిమాయే ఇక ఇప్పుడు `ద‌ర్శ‌కుడు`. దర్శకుడు ద్వారా సుకుమార్ అన్న త‌న‌యుడు, సుకుమార్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అశోక్‌ను హీరోగా ప‌రిచ‌యం చేశారు. మ‌రి సుకుమార్ నిర్మాత ద్వితీయ విఘ్నాన్ని దాటాడా అని తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో తెలుసుకుందాం.

క‌థః
మ‌హేష్‌(అశోక్‌)కి చిన్న‌ప్ప‌ట్నుంచి ద‌ర్శ‌కుడు కావాల‌నేదే కోరిక‌. సినిమాలంటే త‌న‌కున్న ప్యాష‌న్ చూసిన అశోక్ తండ్రి ఆనంద్‌రావు త‌న‌ని ద‌ర్శ‌కుడు కావాలంటూ ప్రోత్సాహిస్తాడు. మ‌హేష్ త‌న ప్యాష‌న్ మేర‌కు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా రెండేళ్లు ప‌నిచేస్తాడు. ద‌ర్శ‌కుడు కావ‌డానికి క‌థ‌ను సిద్ధం చేసుకుంటాడు. హీరో, నిర్మాత‌కు క‌థ వినిపిస్తాడు. క‌థ న‌చ్చినా, ల‌వ్ ట్రాక్ బాలేదంటూ నిర్మాత చెప్పి, ల‌వ్ ట్రాక్ మార్చ‌మ‌ని ప‌దిహేను రోజులు గ‌డువిస్తాడు. సినిమా గురించి ఆలోచిస్తూ మ‌హేష్ త‌న ఊరెళ్తాడు. అక్క‌డ నుండి తిరుగు ప్ర‌యాణంలో త‌న‌కు న‌మ్ర‌త‌(ఈషా రెబ్బా) ప‌రిచ‌యం అవుతుంది. న‌మ్ర‌త‌కు ఫ్యాష‌న్ డిజైన‌ర్‌. సినిమాల్లో చూపేవ‌న్నీ అబ‌ద్దాల‌ని న‌మ్రత అంటుంది కానీ మ‌హేష్ అందుకు ఒప్పుకోడు. మంచి నీళ్ల కోసం ట్రెయిన్ దిగిన న‌మ్ర‌త ట్రెయిన్‌ను మిస్ చేస్తుంది. న‌మ్ర‌త కోసం మ‌హేష్ ఆమె ఉండే ప్రాంతానికి వెళ‌తారు. న‌మ్రత అనుకోకుండా ఆప‌ద‌లో ప‌డితే ఆమెను ర‌క్షిస్తాడు. న‌మ్ర‌తకు మ‌హేష్ అంటే ల‌వ్ పుడుతుంది కానీ, ప్రేమ‌ను అత‌నికి చెప్ప‌దు. కానీ మహేష్, న‌మ్ర‌త‌కు త‌న‌పై ల‌వ్ పుట్టింద‌ని గ్ర‌హిస్తాడు. త‌న‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌తోనే త‌న సినిమాలో ల‌వ్ ట్రాక్‌ను రాసుకుంటాడు. ఆ విష‌యం తెలిసిన న‌మ్ర‌త‌, త‌న ప‌ర్స‌న‌ల్ ఫీలింగ్స్‌ను సినిమాగా ఎలా చేస్తావని మ‌హేష్‌ని తిడుతుంది. అంతే కాకుండా మహేష్‌కు ప్యాష‌న్ త‌ప్ప ఎమోష‌న్స్ లేవ‌ని అంటుంది? చివ‌ర‌కు మ‌హేష్‌, న‌మ్ర‌త‌లు ఒక‌ట‌య్యారా? అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్
కథ, స్క్రీన్ ప్లే
కామెడీ

మైనస్
హీరో
సెకండాఫ్

విశ్లేష‌ణః
ముందు న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే, హీరో అశోక్ హీరోగా ప‌రిచ‌య‌మైన సినిమా. సినిమా అంతా ఇత‌ని క్యారెక్ట‌ర్ చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో మంచి ఎమోష‌న్స్ ఉన్న పాత్ర‌. మంచి కంటెంట్ ఉన్న రోల్‌లో అశోక్ ప‌ర్వాలేద‌నిపించాడు. కొత్త హీరో కాబ‌ట్టి స‌బ్జెక్ట్‌కు త‌గిన రీతిలో క్యారెక్ట‌ర్‌ను మోయ‌లేక‌పోయాడేమోన‌నిపించింది. ఎక్స్‌ప్రెష‌న్స్ స‌రిగ్గాలేవ‌నిపించింది. ఇక హీరోయిన్ ఈషా రెబ్బా న‌ట‌న సినిమాకు ప్ల‌స్ క్యారెక్ట‌ర్‌ను చాలా ఈజ్‌తో చేసింది. హీరోతో ల‌వ్‌ను ఎక్స్‌ప్రెస్ చేసే విధానం, ప్రీ క్లైమాక్స్‌లో హీరోతో త‌న ప్రేమ‌ను చెప్పే తీరు, క్లైమాక్స్‌లో హీరోను తిట్ట‌డం, అత‌నికి ద‌గ్గ‌ర‌య్యే స‌న్నివేశాలు ఇలా ప్ర‌తి సీన్‌లో మంచి అభిన‌యాన్ని క‌న‌ప‌రిచింది. హీరో స‌హాయ‌కుడి పాత్ర‌లో సుద‌ర్శ‌న్‌, నిర్మాత పాత్ర‌లో కేదారినాథ్ శంక‌ర్‌, కో డైరెక్ట‌ర్ పాత్ర‌లో జెమినిసురేష్, హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర‌లో పూజిత‌, నోయెల్ ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఇక సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే ద‌ర్శ‌కుడు హ‌రిప్ర‌సాద్ జ‌క్కా తొలి చిత్ర ద‌ర్శ‌కుడైనా సినిమాను క‌థ‌నం న‌డిపించిన తీరు బావుంది. స‌న్నివేశాల‌ను ఫ్రెష్ ఫీల్‌తో చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు.

స‌న్నివేశాల‌ను కామెడి ఉండేలా రాసుకున్న విధానం బావుంది. సినిమా మంచి ఎంట‌ర్‌టైనింగ్‌తో సాగుతుంది. ఇక సాయికార్తీక్ అందించిన ట్యూన్స్ బావున్నాయి. ఆకాశం దించి మేఘాల‌తో సెట్ వేస్తా.., ప్రీ క్లైమాక్స్‌లో వ‌చ్చే ఎమోష‌న‌ల్ సాంగ్ నీ మ‌న‌సింతేనా, తొక్క‌లో స్క్రీన్‌ప్లే, ఇలా పాట‌ల‌న్నీ సంద‌ర్భానుసారం బావున్నాయి. ప్ర‌వీణ్ అనుమోలు సినిమాటోగ్ర‌ఫీ బావుంది. న‌వీన్ నూలి ఎడిటింగ్ కూడా మెప్పిస్తుంది. డైరెక్ట‌ర్ అంటే 20 శాతం క్రియేటివిటీ, 80 శాతం మేనేజ్‌మెంట్‌, ద‌ర్శ‌కుడి ఐడెంటియే సినిమా, ప్యాష‌న్ అంటే త‌ప‌స్సు, సినిమా అంటే చిన్న చూపుగా మాట్లాడేవారికి సినిమా విలువ‌ను చెప్పే సంద‌ర్భంలో డైలాగ్స్‌ ఇలా హ‌రి ప్ర‌సాద్ జ‌క్కా సంభాష‌ణ‌లు కూడా చ‌క్క‌గానే రాసుకున్నాడు. మొత్తం మీద ద‌ర్శ‌కుడు సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తుంది.

పంచ్ లైన్ …మెప్పించే ప్రయత్నం చేసిన దర్శకుడు
రేటింగ్ః 2.75/5


Related News

pawan-teaser-1-587x342

అజ్ణాతవాసి మువీ రివ్యూ

Spread the loveమువీ: అజ్ణాతవాసి న‌టీన‌టులు: ప‌వ‌న్ క‌ళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమాన్యేల్, రావు ర‌మేష్ త‌దిత‌రులు సంగీతం:Read More

Sapthagiri-LLB-Movie-Stills

సప్తగిరి మువీ రివ్యూ

Spread the loveసినిమా : సప్తగిరి ఎల్.ఎల్ బి నటీనటులు : సప్తగిరి, కషిష్ వోహ్రా, సాయి కుమార్ ,Read More

 • జవాన్ మువీ రివ్యూ
 • `బాల‌కృష్ణుడు`మువీ రివ్యూ
 • మెంటల్ మదిలో మువీ రివ్యూ
 • ఖాకీ మువీ రివ్యూ
 • ఒక్కడున్నాడు: మువీ రివ్యూ
 • నెక్ట్స్ నువ్వే: మువీ రివ్యూ
 • ఉన్నది ఒకటే జిందగీ: మువీరివ్యూ
 • మహానుభావుడు మువీ రివ్యూ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *