Main Menu

‘భ‌ర‌త్ అనే నేను’ మువీ రివ్యూ

Spread the love

సినిమా: భ‌ర‌త్ అనే నేను
తారాగ‌ణం: మ‌హేశ్‌, కైరా అద్వాని, ప్ర‌కాశ్‌రాజ్‌, శ‌ర‌త్ కుమార్‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేశ్‌, సూర్య‌, జీవా, ర‌విశంక‌ర్‌, శ‌త్రు త‌దిత‌రులు
సంగీతం: దేవిశ్రీ ప్ర‌సాద్‌
నిర్మాత‌: దాన‌య్య డి.వి.వి
ద‌ర్శ‌క‌త్వం: కొర‌టాల శివ‌

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ వ‌రుస‌గా రెండు ఫెయిల్యూర్స్ తో ఉన్నారు. అదే స‌మ‌యంలో ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ మాత్రం హ్యాట్రిక్ హిట్స్ తో ఊపుమీదున్నాడు. వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే శ్రీమంతుడు సంచ‌ల‌నం అయ్యింది. దాంతో భ‌ర‌త్ అనే నేను మువీ మీద భారీ అంచ‌నాలు క‌నిపించాయి. అందుకు త‌గ్గ‌ట్టుగానే పొలిటిక‌ల్ మువీ కావ‌డం, మ‌హేష్ ఏకంగా ముఖ్య‌మంత్రి పాత్ర పోషించ‌డంతో మ‌రింత ఆస‌క్తి రాజేసింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డ్ స్క్రీన్స్ పై ఎంట్రీ ఇచ్చిన భ‌ర‌త్ అనే నేను ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. .

క‌థ:
ఆక్స్‌ప‌ర్డ్ యూనివ‌ర్సిటీలో చ‌దువుకుంటున్న భ‌ర‌త్ తండ్రిని హ‌ఠాత్తుగా కోల్పోతాడు. తండ్రి రాఘ‌వ‌రాజు(శ‌ర‌త్ కుమార్‌) చ‌నిపోయాడ‌ని తెలుసుకున్న భ‌ర‌త్ ఇండియాకు వ‌స్తాడు. భ‌ర‌త్ తండ్రి సీఎం కావ‌డంతో ఆయ‌న త‌రువాత ఎవ‌ర‌నే చ‌ర్చ మొద‌ల‌వుతుంది. అధికార పార్టీలో పోటీ మొద‌ల‌వుతుంది. నానాజీ అలియాస్ వ‌ర‌ద‌రాజులు(ప్రకాశ్ రాజ్‌) భ‌ర‌త్‌ని ముఖ్య‌మంత్రిని చేస్తాడు. ముఖ్య‌మంత్రి అయిన తొలి రోజు నుండే భ‌ర‌త్ ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నుకుంటాడు. అందులో భాగంగా వారికి వ్య‌తిరేకంగా కూడా కొన్ని ప‌నులు చేస్తాడు కూడా. అయినా కూడా ప్ర‌జ‌ల మంచి కోస‌మే కాబ‌ట్టి అంద‌రూ భ‌ర‌త్‌ను అర్థం చేసుకుంటారు.

ఫ్రీ ఎడ్యుకేష‌న్‌, వ్య‌వ‌సాయ‌దారులు కోసం స‌దుపాయాలు.. ప్ర‌తి ప‌క్ష‌నేత కుమారుడిని అవినీతి కేసులో అరెస్ట్ చేయించ‌డం.. లోక‌ల్ గ‌వ‌ర్నెన్స్ త‌దిత‌ర అంశాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తాడు. దాంతో అంద‌రూ ప్ర‌జ‌ల్లో భ‌ర‌త్ రామ్‌కి పేరు ప్ర‌తిష్ట‌లు వ‌చ్చేస్తాయ‌. ఈ క్ర‌మంలో త‌న సొంత న‌వోద‌యం పార్టీ నేత‌ల నుండి విమ‌ర్శ‌లు వ‌చ్చినా భ‌ర‌త్ ప‌ట్టించుకోడు. ఈ క్ర‌మంలో వ‌సుమ‌తి(కైరా అద్వాని)తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. కొన్ని కార‌ణాల వ‌ల్ల సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌స్తుంది. దాంతో ఎందుకు రాజీనామా చేశాడు..అస‌లు భ‌ర‌త్ తండ్రి మ‌ర‌ణం వెనుక క‌థేంటి అన్న‌దే సినిమాలో కీల‌కాంశం. తెర‌మీద‌కు చూడాల్సిందే…

ప్ల‌స్ పాయింట్స్‌:
– మ‌హేశ్ బాబు న‌ట‌న
– క‌థ

మైన‌స్ పాయింట్స్‌
– రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్ములాలో ఉండ‌టం
– సంబంధం లేని పాట‌లు

న‌టీన‌టులు

మ‌హేష్ బాబు మొద‌టి సారిగా అయినా ముఖ్య‌మంత్రి గా మెప్పించాడు. లేటెస్ట్ ట్రెండ్ కి త‌గ్గ గెట‌ప్ తో మురిపించాడు. మ‌హేష్ బాబు న‌ట‌నే ఈ సినిమాకు పెద్ద ఎసెట్ గా నిలిచింది. పొలిటిక‌ల్ గెట‌ప్ లో భావోద్వేగాల‌ను బాగా ప్ర‌ద‌ర్శించ‌డం విశేషం. ఇక కొత్త హీరోయిన్ కైరా అద్వానీ ఫ్రెష్ నెస్ ఉన్న‌ప్ప‌టికీ మిగిలిన అంశాల‌లో పెద్ద‌గా మార్కులు సాధించ‌లేక‌పోయింది. ఇక ప్ర‌కాష్ రాజ్ కి ఇత‌ర కొట్టిన పిండిలాంటి పాత్ర‌.

విశ్లేష‌ణ‌:
నాయ‌కులు లేని సమాజాన్ని రూపొందించ‌డ‌మే ఉత్త‌మ నాయ‌కుడి ల‌క్ష‌ణం అనే అంశాన్ని, ఇచ్చిన మాట మీద నిల‌బ‌డాల‌నే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని రాసుకున్న క‌థ ఇది. చూసినంత సేపు బావుంది. ఎక్క‌డా కామెడీ పెట్ట‌డానికి వీల్లేని చిత్రం. భావోద్వేగాలు కూడా స‌రిగా పండ‌లేదు. 40 ఏళ్ల స్నేహితుల్లో ఒక‌రు త‌ప్పు చేస్తారు. దానికి స‌రైన శిక్ష ప‌డాల‌ని ఇంకొక‌రు అనుకుంటారు. దాంతో త‌ప్పు చేసిన వ్య‌క్తికి కోపం వ‌చ్చి మంచివాడిని చంపేస్తాడు. కానీ చంపే ముందు అత‌ను చెప్పే డైలాగులు మెప్పించ‌వు. ఓవ‌రాల్ గా సినిమా నిడివి కాస్త ఎక్కువే. సినిమాలో లీన‌మైపోతే త‌ప్ప సీట్ల‌లో అస‌హ‌నంగా క‌ద‌లాల్సిందే. మ‌హేశ్‌బాబులాంటి క‌మ‌ర్షియ‌ల్ హీరోతో ఇలాంటి స్క్రిప్ట్‌లో పాట‌లు, ఫైట్లు చేయించినందుకు కొర‌టాల శివ‌ను మెచ్చుకోవాల్సిందే.

చివ‌ర‌గా.. భ‌ర‌త్ అనే నేను… ఇన్‌టెన్ష‌న‌ల్ పొలిటిక‌ల్ డ్రామా
రేటింగ్ : 2.75/5


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *