Main Menu

ఏం మంత్రం వేశావే…మువీ రివ్యూ

Spread the love

సినిమా ఏం మంత్రం వేశావూ
న‌టీన‌టులు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివానీ సింగ్‌, శివ‌న్నారాయ‌ణ‌, ఆశిష్ రాజ్‌, ప్ర‌భావ‌తి, దీప‌క్ త‌దిత‌రులు
సంగీతం: అబ్బ‌త్ స‌మ‌త్‌
కెమెరా: శివారెడ్డి
నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం: శ్రీధ‌ర్ మ‌ర్రి

పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి స‌క్సెస్ ల త‌ర్వాత విజ‌య్ దేవ‌రకొండ క్రేజ్ పెరిగింది. యూత్ ఫుల్ హీరోగా గుర్తింపు సాధించాడు. దాంతో ఆయ‌న సినిమాల కోసం ఎదురుచూస్తున్న వారికి చాలాకాలం క్రితం నాటి సినిమాతో విజ‌య్ ముందుకొచ్చాడు. వాస్త‌వానికి ఈ సినిమా ముందే తీసిన‌ప్ప‌టికీ విడుద‌ల ఆల‌శ్యం కావ‌డంతో ఇప్పుడొచ్చింది. దాంతో కెరీర్ స్టార్టింగ్‌లో విజ‌య్‌దేవర‌కొండ ఎలా న‌టించాడ‌నే ఆస‌క్తి క‌లిగింది. దాంతో విజ‌య్ దేవ‌ర‌కొండ ఎలాంటి మంత్రం వేశాడో తెలుసుకోవాలంటే సినిమా రివ్యూ చూద్దాం…

క‌థ‌:
నిఖిల్ ‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌) ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన యువ‌కుడు. ఇంటి నుండి బ‌య‌ట‌కు రాకుండా ఆన్‌లైన్ గేమ్స్‌లోనే కాలం గ‌డుపుతుంటాడు. ఓ రోజు నిక్కీకి రాగ్స్ అలియాస్ రాగ‌మాలిక (శివానీ సింగ్‌) ప‌రిచ‌యం అవుతుంది. నిక్కీకి పేరు చెప్పకుండా అత‌న్ని ఆట ప‌ట్టిస్తుంటుంది. రాగ్స్‌తో స్నేహం చేయాల‌నుకుంటాడు నిక్కి. అయితే త‌న‌ని క‌ల‌వాలంటే రియ‌ల్ లైఫ్‌లో ఓ గేమ్ ఆడి గెల‌వాల‌నే కండీష‌న్ పెడుతుంది రాగ్స్‌. త‌న నిబంధ‌న‌లకు ఒప్పుకున్న నిక్కి.. ఆమెను క‌లుసుకునే ప్ర‌య‌త్నంలో రాగ్స్‌కు ఓ ప్ర‌మాదం ఉంద‌ని తెలుసుకుంటాడు. రాగ్స్‌ను కాపాడే ప్ర‌య‌త్నంలో నిక్కి చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటాడు. ఆ స‌మ‌స్య‌లేంటి? చివ‌రికి నిక్కి, రాగ్స్ ఒక‌ట‌య్యారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష:
విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శివానీ సింగ్‌లు కొత్త వారైనా న‌ట‌న ప‌రంగా వారి బెస్ట్ ఇవ్వ‌డానికి చేసిన ప్ర‌య‌త్నం తెర‌పై క‌న‌ప‌డుతుంది. ముఖ్యంగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న ఆక‌ట్టుకుంది. శివానీ సింగ్ చూడ‌టానికి క‌త్రినా కైఫ్ పోలిక‌ల‌తో ఉంది. న‌ట‌న కూడా ఓకే అనిపించింది. ఇక సినిమాలో న‌టించిన మ‌రో హీరో ఆశిష్ రాజ్ కూడా పెద్ద‌గా ప్రాముఖ్య‌త లేని పాత్ర‌లో న‌టించాడు. సినిమాలోని మిగిలిన పాత్ర‌ధారులంతా వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. సాంకేతికంగా చూస్తే.. ద‌ర్శ‌క నిర్మాణంలో శ్రీధ‌ర్ మ‌ర్రి టేకింగ్ కాస్త బెట‌ర్ అనిపించినా ఇప్పుడున్న ప‌రిస్థితుల దృష్ట్యా ఇంకా బెట‌ర్ అవుట్‌పుట్ ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌నిపించింది. న‌టీన‌టుల నుండి ఇంకా మంచి పెర్ఫామెన్స్‌ల‌ను రాబ‌ట్టుకోవ‌డంలో ద‌ర్శక నిర్మాత పెయిల్యూర్ క‌న‌ప‌డింది. అలాగే కాంటెంప‌ర‌రీ పాయింట్ మీద క‌థ రాసుకుప్ప‌టికీ.. ప్రజెంటేష‌న్‌లో దారుణంగా ఫెయిల‌య్యాడు. అబ్బ‌త్ స‌మ‌త్ అందించిన ట్యూన్స్‌లో రెండు పాట‌లు బాగానే ఉన్నప్పటికీ పిక్చ‌రైజేష‌న్ బాలేదు. ఇక శివారెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అస్స‌లు బాలేదు. సీన్స్‌లో ఫ్రెష్‌నెస్‌, రిచ్ నెస్ వెతికినా క‌న‌ప‌డ‌లేదు. సినిమా నడిచిన క్ర‌మం నీర‌సంగా ఉంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉండుంటే బావుండేది.

పంచ్ లైన్: ఏ మంత్రం ఫ‌లించ‌లేదు..!
అప్ డేట్ ఏపీ రేటింగ్‌: 1.5/5


Related News

క‌వ‌చం మువీ రివ్యూ

Spread the loveసినిమా: క‌వ‌చం న‌టీన‌టులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, మెహ్రీన్ కౌర్ పిర్జాదా, నీల్ నితిన్Read More

రోబో2.0 రివ్యూ

Spread the loveసంచ‌ల‌న ద‌ర్శ‌కుడు శంక‌ర్ మ‌రో సృష్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. వ‌న్నె త‌ర‌గ‌ని క్రేజ్ తో దూసుకుపోయేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *