Main Menu

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం

Spread the love

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సోద‌రుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం పొందారు. తెల్ల‌వారు జామున గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్టు కుటుంబీకులు చెబుతున్నారు. ఈ విష‌యం వైసీపీ శ్రేణుల‌ను విషాదంలో ముంచింది. జ‌గ‌న్ కుటుంబంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న ఇప్పుడు అంద‌రినీ క‌లచివేస్తోంది.

వైఎస్సార్ కి అత్యంత స‌న్నిహితుడిగా వివేకానంద‌రెడ్డికి పేరుంది. అన్న అడుగుజాడ‌ల్లో న‌డిచిన త‌మ్ముడిగా ఆయ‌న‌కు పేరు. వైఎస్సార్ త‌ర్వాత క‌డ‌ప ఎంపీ సీటుకి ఆయ‌న పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత 2009 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కోసం పోటీ నుంచి విర‌మించుకున్నారు. మ‌ధ్య‌లో ఒక‌టి రెండు సార్లు జ‌గ‌న్ తో అల‌క‌బూనిన‌ప్ప‌టికీ ఇటీవ‌ల వైసీపీ వ్య‌వ‌హారాల్లో చురుగ్గా ఉన్నారు. నాలుగు రోజుల క్రితం లోట‌స్ పాండ్ లోని వైసీపీ కార్యాల‌యం వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగిన ఉర‌వ‌కొండ నేత‌ల‌తో ఆయ‌న మంత‌నాలు జ‌రిపారు. అంద‌రికీ స‌ర్థిచెప్పారు.

ఇలాంటి త‌రుణంలో ఎన్నిక‌ల ముగింట వివేకానంద‌రెడ్డి మ‌ర‌ణం జ‌గ‌న్ కుటుంబానికి తీర‌ని లోటుగా చెబుతున్నారు. రెండేళ్ల క్రితం జ‌రిగిన క‌డ‌ప జిల్లా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో వివేకానంద‌రెడ్డి వైసీపీ త‌రుపున పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు. ఆగ‌ష్ట్ 8, 1950లో ఆయ‌న జ‌న్మించారు. 68 ఏళ్ల వ‌య‌సులో మ‌ర‌ణించారు. ఆయ‌న భార్య సౌభాగ్య‌మ్మ‌, ఒక కుమార్తె ఉన్నారు. అగ్రిగ‌ల్చ‌ర్ లో ప‌ట్ట‌భ‌ద్రుడైన వివేకానంద‌రెడ్డి సౌమ్యుడిగా పేరుంది. ఇప్పుడు ఆయ‌న మ‌ర‌ణం ఎన్నిక‌ల స‌న్న‌ద్ధంలో ఉన్న జ‌గ‌న్ కి కొంత ఆటంకంగా మారే ప‌రిస్థితి ఉంది






Related News

ఆ రెండు సీట్లే హాట్ టాపిక్!

Spread the loveఅనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అందులోనూ వార‌సులు బ‌రిలో దిగిన నేప‌థ్యంలో అనంత‌పురంRead More

కాంగ్రెస్ క‌ల తీరేనా?

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాల‌న్న‌ది కాంగ్రెస్ క‌ల‌. తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 2014లో ఆపార్టీ ఖంగుతిన్న‌ది. కేవ‌లం మూడంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *