జ‌గ‌న్ గురి అక్క‌డే..!

jagan
Spread the love

నంద్యాల ఉప ఎన్నిక‌లు అంద‌రికీ చావో రేవో అన్న చందంగా మారిపోయాయి. ముఖ్యంగా అధికార‌, ప్ర‌తిప‌క్షాల‌కు విజ‌యమో, వీర స్వ‌ర్గ‌మో అన్న చందంగా మారింది. దాదాపు సెమీఫైన‌ల్ గా భావిస్తున్న త‌రుణంలో ఇక్క‌డ ప‌ట్టు నిలుపుకుంటేనే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టు సాధించ‌గ‌ల‌మ‌న్న అభిప్రాయం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. అందుకే చంద్ర‌బాబు , వైఎస్ జ‌గ‌న్ కూడా నంద్యాల మీద గురిపెట్టి ప‌నిచేస్తున్నారు. జ‌గ‌న్ నేరుగా నంద్యాల బ‌రిలో దిగారు. ప్ర‌చార బాధ్య‌త‌ను త‌న భుజాన వేసుకున్నారు. చంద్ర‌బాబు మాత్రం నోటిఫికేష‌న్ కి ముందే ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ప్ర‌స్తుతం స‌గం క్యాబినెట్ మంత్రులు, మ‌రో 30మంది ఎమ్మెల్యేలు అక్క‌డ ఎన్నిక‌ల బాధ్య‌త‌ల్లో ఉన్నారు.

అయితే నంద్యాల‌లో ప‌రిస్థితి ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. ఉభ‌య పార్టీలు హోరాహోరీగా త‌ల‌ప‌డుతున్న త‌రుణంలో త‌మ‌కు ప‌ట్టున్న పాకెట్స్ ను బ‌ల‌ప‌రుచుకోవ‌డ‌మే కాకుండా, ప్ర‌త్య‌ర్థుల బ‌ల‌మైన కేంద్రాల‌ను కొల్ల‌గొట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అందులో భాగంగా నంద్యాల ప‌ట్ట‌ణం మీదే వైఎస్ జ‌గ‌న్ కేంద్రీకరించ‌బోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. అభివృద్ధి మంత్రంతో ప‌ట్ట‌ణ వాసుల‌ను ప్ర‌భుత్వ పెద్ద‌లు ప్ర‌లోభాల‌కు గురిచేయాలని ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో జ‌గ‌న్ త‌న దృష్టి అంతా ప‌ట్ట‌ణ వాసుల మీదే పెడుతున్నారు. మొత్తం 12 రోజుల నిర‌వ‌ధిక క్యాంపెయిన్ కి శ్రీకారం చుట్టిన జ‌గ‌న్ తొలుత త‌మ‌కు బ‌ల‌మైన గోస్పాడులో ప్ర‌చారం సాగిస్తున్నారు. ఆ మండ‌లంలో వైసీపీకి మంచి మొగ్గు క‌నిపిస్తోంది. గంగుల ఫ్యామిలీ కూడా క‌ల‌వ‌డంతో ఇక్క‌డ శిల్పా సునాయాసంగా ముందంజ వేస్తార‌ని అంతా భావిస్తున్నారు.

ఆత‌ర్వాత నంద్యాల రూర‌ల్ మండ‌లంలోని కొన్ని గ్రామాల‌ను కూడా ఆయ‌న చుట్టి వ‌స్తున్నారు. రైతున‌గ‌ర్ వంటి ప్రాంతాల్లో ఆయ‌న ప్ర‌చారానికి మంచి స్పంద‌న రావ‌డంతో వైసీపీలో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. దాని ప్ర‌భావం ప‌ట్ట‌ణం మీద ఉంటుంద‌ని భావిస్తున్నారు. అందులోనూ టీడీపీ నేత‌లు ఎస్పీవై రెడ్డి కుటుంబానికి, ఎన్ఎండీ ఫ‌రూఖ్ కి ప‌ట్టున్న ప్రాంతాల్లో జ‌గ‌న్ విస్తృతంగా ప‌ర్య‌టించే ఏర్పాట్లు చేస్తుండ‌డం విశేషం. త‌ద్వారా ప‌ట్ట‌ణంలోని 11 నుంచి 35 వ‌ర‌కూ మ‌ధ్య‌లో ఉన్న వార్డుల్లో మంచి ప్ర‌భావం చూపించాల‌ని ఆయ‌న ప‌ట్టుద‌ల‌గా ఉన్నారు. శివారు ప్రాంతాల్లో వైసీపీకి ఊపు క‌నిపిస్తోంది. ఇక ప‌ట్ట‌ణం మ‌ధ్య‌లో అటు వ్యాపార వ‌ర్గాలు, ఇటు మైనార్టీ వ‌ర్గాల్లోనూ గ‌ట్టి మ‌ద్ధ‌తు కూడ‌గ‌ట్ట‌మే ల‌క్ష్యంగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న ప్ర‌ణాళిక సిద్దం చేయ‌డం విశేషం. దాంతో జ‌గ‌న్ గురి దాదాపుగా నంద్యాల పట్ట‌ణం మీదే క‌నిపిస్తోంది. మెజార్టీ ఓట్లు ప‌ట్ట‌ణంలోనే ఉండ‌డంతో అది అనివార్యం అని చెప్ప‌వ‌చ్చు. మ‌రి ఈ ప్ర‌యత్నాల‌కు ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో చూడాలి.






Related News

balakrishna_12

టీడీపీ కార్యకర్తపై బాలయ్య దాడి

Spread the loveనంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి రంగంలో దిగిన నందమూరి బాలయ్య వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయనRead More

nandyal

నంద్యాలలో అవి అవసరం..

Spread the loveఉప ఎన్నికల్లో భాగంగా నంద్యాలలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ, వైసీపీ తాడోపేడో తేల్చుకోవడానికిRead More

  • టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లు…
  • వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి: ప‌రిస్థితి విష‌మం
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ధ‌తు మాకే..!
  • టీడీపీ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లుతున్న నంద్యాల రోడ్లు
  • పాపం..క‌మ‌ల నాధులు..!
  • సెంటిమెంట్: నంద్యాల గెలిస్తే అధికార‌మే!
  • జ‌గ‌న్ వ్యూహంలో ఇరుక్కున్న టీడీపీ..!
  • జ‌గ‌న్ గురి అక్క‌డే..!
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *