వైసీపీలో గందరగోళం

ysrcp
Spread the love

వైసీపీలో గందరగోళం పెరుగుతోంది. రానురాను సమన్వయం పెరగాల్సిన చోట దానికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థి తెలుగుదేశం ఎత్తులను చిత్తు చేయడంలో విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. వ్యూహాత్మక లోపమే దానికి కారణమా అన్న అభిప్రాయం మొదలయ్యింది. ముఖ్యంగా వైసీపీకి బలమైన కర్నూలు, గడిచిన ఎన్నికల్లో ఖంగుతిన్న అనంతపురంలో జరుగుతున్న పరిణామాలు దానికి అద్దంపడుతున్నాయి. కర్నూలులో పార్టీ నుంచి మరికొందరు ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారన్న ప్రచారానికి సకాలంలో చెక్ పెట్టడంలో వైసీపీ వెనుకబడింది. చివరకు పార్టీలో గందరగోళం పెరిగిన తర్వాత ప్రచారంలో ఉన్న ఎమ్మెల్యేలు తెరమీదకు వచ్చారు. సహజంగానే పాలకపక్షం ఇలాంటి ఎత్తులతో నేతలకు పార్టీ మారడం అనివార్యం అనే పరిస్థితి తీసుకొస్తున్న తరుణంలో విపక్షం జాగ్రత్తలు పాటించకపోవడం విశేషంగా మారింది.

ఇక అదే సమయంలో అనంతపురంలో కూడా గుర్నాథరెడ్డి వంటి సీనియర్లు ప్రత్యర్థి గొడుకు పట్టడానికి సన్నద్ధమయినప్పటికీ చివరి క్షణం వరకూ దానిని గ్రహించలేకపోవడం వైసీపీ వ్యూహాకర్తల తీరుకి అద్దంపడుతోంది. అనంతపురంలో అధికార పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతోంది. వరుసగా జరుగుతున్న పరిణామాలు దానికి సాక్ష్యంగా ఉన్నాయి. టీడీపీలోని వర్గపోరే పుట్టిముంచుతుందనే సంకేతాలు వస్తున్నాయి. దానిని సొమ్ము చేసుకోవాల్సిన వైసీపీ చొరవ కనిపించడం లేదు. అదే సమయంలో జనసేన పవన్ కల్యాణ్ ని ఇక్కడే రంగంలో దింపి ప్రత్యర్థి ఆశలకు గండికొట్టాలనే లెక్కల్లో చంద్రబాబు ఉన్నారు. అలాంటి సమయంలో పక్కా స్కెచ్ తో వ్యవహరించాల్సిన వైసీపీ కొందరు కీలక నేతలను చేజేతులా విడిచిపెట్టడం విస్మయం కలిగిస్తోంది.

అదే సమయంలో గుర్నాథ్ రెడ్డి వంటి వాళ్లు పార్టీ మారినప్పటికీ తెలుగుదేశం పార్టీ కి ఏమేరకు ప్రయోజనం అనే చర్చ కూడా ఉంది. ఇప్పటికే అనంతపురం సిటీలో టీడీపీ మూడు వర్గాలు, ఆరు తగాదాలు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు మరో నాయకుడు ఆ పార్టీలో చేరితే నగరపాలక సంస్థ రాజకీయాలే కాకుండా పార్టీ వ్యవహారాలు కూడా కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాలతో కొత్త విబేధాలు ఖాయంగా మారుతోంది. ఈ పరిణామాలు పాలకపార్టీని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తాయనడంలో సందేహం లేదు. అయినా చంద్రబాబు సాహసం చేయడానికి సిద్ధపడినట్టు కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి పార్టీ శ్రేణుల్లో సందిగ్థత తొలగించాల్సి ఉంది. జగన్ యువబేరీ పేరుతో అడుగుపెట్టబోతున్న తరుణంలో అలాంటి వ్యవహారాలకు స్పష్టత రావచ్చని ఆశిస్తున్నారు.


Related News

katasa

కాటసానికి లైన్ క్లియ‌ర్ చేసిన వైసీపీ

Spread the love22Sharesఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీలో మ‌రో సీనియ‌ర్ కి లైన్ క్లియ‌ర్ అయ్యింది. కాట‌సాని రాంభూపాల్ రెడ్డి రంగRead More

challa ramakrishna reddy

టీడీపీలో మ‌రో త‌గాదా:మాజీ ఎమ్మెల్యే అవుట్?

Spread the love8Sharesతెలుగుదేశం ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో ఓ అడుగు వేసింది. కీల‌క ప‌ద‌వులను కేటాయింపులు చేసింది.Read More

 • వైసీపీలోకి మ‌రో వార‌సుడు
 • వైసీపీలోకి మ‌రో మాజీ ఎమ్మెల్యే
 • జ‌న‌సేన‌పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
 • చంద్ర‌బాబుపై తిర‌గ‌బ‌డండి..
 • టీడీపీకి ముదిరిన క‌దిరి..!
 • ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మీద గురిపెట్టిన టీడీపీ
 • అయ్యో..బైరెడ్డి
 • వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *