రోడ్డెక్కిన అనంత టీడీపీ

tdp dharna
Spread the love

తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ అందించిన జిల్లాల్లో అనంతపురం ఒకటి. ఆపార్టీకి బలమైన జిల్లాగా భావిస్తున్న చోట వర్గవిబేధాలతో కొంపు మునిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న అధికార పార్టీలో తాజాగా విబేధాలతో రోడ్డెక్కే పరిస్థితి రావడం కలకలం రేపుతోంది. అనంతపురంలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల వైరం పెరుగుతోంది. అదే సమయంలో జేసీ బ్రదర్స్ వైఖరితో తాడిపత్రి తెలుగుదేశం నేతలు తల్లడిల్లిపోతున్నారు. సొంత పార్టీ నేతలపైనే దాడికి పాల్పడడంతో ధర్నాలకు దిగే వరకూ పరిస్థితి వచ్చింది.

తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ రాకముందు నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ పచ్చదండుతో జూనియర్ తమ్ముళ్ల తగాదా తారస్థాయికి చేరింది. మొన్నటి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన జేసీ వర్గం హవా చెల్లుతుండడంతో చాలాకాలంగా జెండా మోస్తున్న నేతలంతా కలత చెందుతున్నారు. చివరకు జేసీ బ్రదర్స్ తో వచ్చిన విబేధాలతో ప్రభాకర్ రెడ్డి మనుషులు తమపై దాడికి పాల్పడ్డారంటూ ఆందోళనకు దిగడం కలకలం రేపుతోంది. ఈ పరిణామాలతో తాడిపత్రి సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు సెక్షన్ 30 అమలులోకి తీసుకురావాల్సి వచ్చింది.

టీడీపీ నాయకుడు కాకర్ల హరనాథ్, ఆయన సోదరుడు శేఖర్ కి చెందిన ట్రాన్స్ పోర్ట్ సంస్థపై జేసీ వర్గాలు దాడికి పాల్పడడం కలకలం రేపుతోంది. లారీ, కారు, సహా కార్యాలయంపై దాడికి దిగడం దుమారం రేపుతోంది. పరిటాల సునీతకు సన్నిహితుడిగా పేరున్న కాకర్ల హరనాథ్ కి చెందిన ఆస్తులు ధ్వంసం చేయడంతో వారి అనుచరులతో కలిసి నిరసనలకు దిగారు. దాంతో టీడీపీలోని రెండు వర్గాలు సవాళ్లు చేసుకునే వరకూ వెళ్లారు. ఓ వైపు మంత్రి అనుచరులు, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే జేసీ వర్గం సై అంటే సై అనే స్థాయి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే తెలుగుదేశం పరువు తీస్తున్నారని చాలామంది వాపోతున్నారు. తమ పార్టీలో క్రమశిక్షణ ఎక్కువని చంద్రబాబు చెబుతుంటే దిగువన తమ్ముళ్లు ఒకరిపై ఒకరు దాడులుకు పాల్పడి, పోలీసుల వరకూ వెళ్లడం విస్మయకరంగా ఉందని చెబుతున్నారు.


Related News

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692

అయ్యో..బైరెడ్డి

Spread the loveబైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం.Read More

9173_ysrcp-3

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగాRead More

 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • నోరుపారేసుకున్న మంత్రి ఆది..
 • వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *