Main Menu

తెలంగాణా మంత్రి వియ్యంకుడికి టీటీడీ పదవి

Chandrababu-Naidu-Putta-Sudhakar-Yadav
Spread the love

మొత్తానికి టీడీపీలో ఉత్కంఠ రేపిని టీటీడీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. అయితే దాని వెనుక జరిగిన రాజకీయాలు మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పక్కా కాంట్రాక్టర్ కి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టడం వెనుక కారణాలపై పలువురు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల మంత్రి యనమలకు ప్రాధాన్యత తగ్గిపోతున్న తరుణంలో తాజాగా ఆయన వియ్యంకుడికి కీలక పదవి కట్టబెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే సుధాకర్ యాదవ్ కేవలం కేవలం యనమలకే కాకుండా తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కి కూడా వియ్యంకుడే కావడం విశేషం.

ఇద్దరు ఉద్దండులైన ఎంపీలు ప్రయత్నించారు. అటు రాయపాటి తన కోరిక తీర్చుకోవాలని పట్టుబట్టారు. అదే సమయంలో మాగంటి మురళీమోహన్ కూడా ఆశించారు. వాళ్లిద్దరికీ ఇప్పటికే పదవులున్న నేపథ్యంలో జోడు పదవులనే పేరు చెప్పిన పక్కన పెట్టేశారు. ఆ తర్వాత నందమూరి హరిక్రుష్ణ పేరు తెరమీదకు తెచ్చారు. కానీ ఆయన పేరు కూడా అంతలోనే కనుమరుగయ్యింది. ఆ వెంటనే పలువురు అధికారుల పేర్లు ముందుకు తెచ్చారు. చివరకు ఇప్పుడు రైల్వే కాంట్రాక్టర్ ని ఖరారు చేశారు. అయితే గడిచిన ఎన్నికల్లో టీడీపీ తరుపున మైదుకూరులో బరిలో దిగి ఓటమి పాలయిన నేత టీటీడీ చైర్మన్ పీఠం దక్కించుకోవడం ఆసక్తిగా కనిపిస్తోంది.

మైదుకూరులో టీడీపీలోకి మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వస్తారని, ఆయన కోసమే ఇప్పుడు సుధాకర్ యాదవ్ ని తప్పిస్తున్నారని ప్రచారం సాగుతున్నప్పటికీ అది అంత సులువు కాదని చెప్పవచ్చు. ఇక టీటీడీ చైర్మన్ గిరీ పేరుతో భారీగా ఆర్థిక లావాదేవీలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతంలో రాజ్యసభ ఎంఫీ రేసులో కూడా టీజీ వెంకటేష్ అనూహ్యంగా ముందుకు రావడం వెనుక ఆర్థిక వ్యవహారాలే కారణమని ప్రచారం సాగింది. ఇప్పుడు కూడా అదే కారణాలు అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దానికితోడు రాయలసీమ, బీసీ వర్గానికి చెందిన నేతకు ప్రధానమైన ఆలయ పదవి కేటాయించడం ద్వారా సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు కూడా కలిసివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నట్టు చెబుతున్నారు.

ఏమైనా ఇప్పుడు సుధాకర్ యాదవ్ టీటీడీ పదవి రెండు రాజకీయ కుటుంబాలకు అధికారం కట్టబెట్టినట్టవుతోంది. తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కూడా పూర్తిగా సంత్రుప్తి చెందే అవకాశం ఉంది. సుధాకర్ యాదవ్ గత పాలకమండలి సభ్యుడు కూడా కావడం విశేషం.


Related News

jc diwakar reddy

చంద్ర‌బాబు ప‌రువుతీసేసిన టీడీపీ ఎంపీ

Spread the love13Sharesఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై అధికార పార్టీ ఎంపీ చెల‌రేగిపోయారు. చంద్ర‌బాబు ధోర‌ణి వ‌ల్లే ఏపీకి అన్యాయంRead More

buggana

స్పీక‌ర్ కి నోటీసులు పంపించిన బుగ్గ‌న

Spread the love11Sharesత‌న‌కు వ్య‌తిరేకంగా సాగిన ప్ర‌చారంపై పీఏసీ చైర్మ‌న్ ఫైర‌య్యారు. ఏకంగా ప్రివిలైజ్ నోటీసులు పంపించారు.ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *