Main Menu

టీడీపీకి దూర‌మ‌వుతున్న ఎమ్మెల్యే?

Spread the love

తెలుగుదేశం పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ఆపార్టీ అధినేత‌ను క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఎన్నిక‌ల ముంగిట తెర‌మీద‌కు వ‌స్తున్న ప‌రిణామాల‌తో ఆయ‌న సీరియ‌స్ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా స్వ‌యంగా సీఎం ప‌ర్య‌ట‌న‌కు ఎమ్మెల్యే దూరం కావ‌డం విశేషంగా మారింది. సొంత నియోజ‌క‌వ‌ర్గానికి సీఎం వ‌చ్చినా ఆమె మొఖం చాటేసిన తీరు ఆశ్చ‌ర్యంగా మారింది. దాంతో అధినాయ‌కుడి మీద ఆగ్ర‌హంతో అల‌క‌బూనిని ఎమ్మెల్యే ఇక టీడీపీకి దూర‌మ‌యిన‌ట్టేనా అన్న ప్ర‌చారం సాగుతోంది.

కొద్దిరోజుల క్రితం తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌లో తిరుప‌తి ఎమ్మెల్యే సుగుణ‌మ్మ కు అవ‌మానం జ‌రిగిందంటూ ఆగ్ర‌హం వెలిబుచ్చింది. సీఎంకి ఫిర్యాదు చేసింది. ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డంతో ఆమెకు త‌గిన న్యాయం జ‌రగ‌లేద‌ని వాపోతోంది. దాంతో ఏకంగా సీఎం తిరుమల పర్యటనకు డుమ్మా కొట్టి ఝ‌ల‌క్ ఇచ్చారు.

తిరుమలలో సుగుణమ్మకు చేదు అనుభవం ఎదురైన నేప‌థ్యంలో సీఎం స్పందించ‌క‌పోవ‌డం ప‌ట్ల ఆమె గుర్రుగా ఉన్నారన్న విష‌యాన్ని చంద్ర‌బాబు గుర్తించిన‌ట్టు తెలుస్తోంది. మ‌హా సంప్రోక్షణకు హాజరవ్వడం కోసం ఆమె వైకుంఠం వద్దకు చేరుకున్న స‌మ‌యంలో లోనికి అనుమతి లేదంటూ ఆమెను టీటీడీ సిబ్బంది అడ్డుకున్నన్న వైనాన్ని సీఎం ప‌ట్టించుకోక‌పోవ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోతున్నాన‌నంటూ ఆమె పేర్కొన‌డంతో టీడీపీ నేత‌లు ఖంగుతిన్నారు. దాంతో మంత్రి అమ‌ర్నాథ్ రెడ్డి ఈ విష‌యంలో జోక్యం చేసుకుని అల‌క‌బూనిన ఎమ్మెల్యే, అధినేత చంద్ర‌బాబు మ‌ధ్య రాయ‌బారాలు న‌డుపుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.






Related News

ఆ రెండు సీట్లే హాట్ టాపిక్!

Spread the loveఅనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అందులోనూ వార‌సులు బ‌రిలో దిగిన నేప‌థ్యంలో అనంత‌పురంRead More

కాంగ్రెస్ క‌ల తీరేనా?

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాల‌న్న‌ది కాంగ్రెస్ క‌ల‌. తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 2014లో ఆపార్టీ ఖంగుతిన్న‌ది. కేవ‌లం మూడంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *