తెలుగుదేశంలో భగ్గుమన్న విబేధాలు

tdp
Spread the love

తెలుగుదేశం పార్టీలో విబేధాలు భగ్గుమన్నాయి. పార్టీలో చిచ్చు రేగడంతో ఇప్పుడు పెను కలకలం రేగుతోంది. ఏకంగా పలువురు నేతలు రాజీనామా చేసేవరకూ సాగింది. ఇది కడప జిల్లా టీడీపీ నేతలను కలవరపరుస్తోంది. ఒక్కసారిగా పెల్లుబికిన విబేధాలతో ఇన్నాళ్లుగా చాపకింద నీరులా ఉన్న వివాదాలు తెరమీదకు వచ్చాయి. కడప జిల్లాలో టీడీపీ చాలాకాలంగా వర్గవిబేధాలతో కొట్టిమిట్టాడుతోంది. ఇటీవల పార్టీలో చేరిన నేతలతో పలు సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే జమ్మలమడుగు వివాదం అందరికీ తెలిసిందే. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తగాదా చల్లారేలా కనిపించడం లేదు. అదే సమయంలో ఇప్పుడు బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశంలో విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. దాంతో బ‌ద్వేలు, గోప‌వ‌రం టిడిపి జెడ్పీటీసీ స‌భ్యులు రాజీనామా చేశారు. టిడిపి అధిష్టానం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు. పార్టీలో పనిచేసిన వారికి ప్రాధాన్యం లేదని వాపోయారు. తెలుగుదేశం పార్టీలో కొనసాగలేక పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

దాంతో ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు తలనొప్పిగా మారుతోంది.


Related News

shilpa brothers

శిల్పా బ్రదర్ప్ పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Spread the loveఏపీ ప్రభుత్వ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అవుతోంది. అదికార పార్టీలో ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వంRead More

23622295_1467466723306639_2222383984397935155_n

తెలుగు మహిళా తలవంచుకో…!

Spread the loveతెలుగు మహిళ తలవంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందో చాటుతున్న సీన్ ఇది. అనంతపురంRead More

 • టీడీపీ నేతను కాల్చేసిన వైసీపీ నాయకుడు
 • ఫోర్జరీ లో పట్టుబడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే
 • రెండు పోస్టులు అనంతపురానికే..
 • తన టికెట్ ఖాయం అంటున్న ఫిరాయింపు ఎంపీ
 • పల్లెకి బాబు న్యాయం చేస్తారా?
 • పవన్ కల్యాణ్ సీటు అదే…కన్ఫర్మ్
 • జగన్ యాత్రలో జాప్యం..
 • ప్రజాసంకల్పం సాగుతుందిలా..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *