వైసీపీ అవుట్: మళ్లీ టీడీపీకే సీటు

tdp
Spread the love

వాస్తవానికి ప్రస్తుతం అది టీడీపీ సిట్టింగ్ సీటు. వైసీపీలో చేరడానికి జగన్ పెట్టిన షరతు మేరకు పోరాడి గెలిచిన సీటును నాలుగు నెలలకే త్యాగం చేసి టీడీపీని వీడిన చరిత్ర శిల్పా చక్రపాణిరెడ్డిది. దాంతో మరోసారి ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో రెండు ప్రధాన పార్టీల్లోనూ వేడి రాజుకుంది. అభ్యర్థుల విషయంలో గట్టి పోటీ కనిపించింది. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థి ఎంపిక ఆపార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇద్దరు ముగ్గురు నేతలు చివరి వరకూ పట్టుబట్టడంతో ఎటూ తేల్చుకోలేని బాబు పదే పదే సమావేశాలు నిర్వహించాల్సి వచ్చింది. ఏకాభిప్రాయం సాధన అని చెప్పినప్పటికీ కొందరు సంపూర్ణంగా సంత్రుప్తి పడని స్థితి ఏర్పడింది, అయితే చివరకు డిప్యూటీ సీఎం కేఈ సోదరుడు మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కి అవకాశం దక్కడంతో ఆయన వర్గం సంబరాలు చేసుకుంది.

అదే సమయంలో వైసీపీలో కూడా మల్లగుల్లాలు పడ్డారు. అభ్యర్థి ఎవరనే విషయం తేలకపోవడంతో చివరకు పోటీ నుంచి విరమించుకున్నట్టు ప్రకటించారు. దాంతో ఈ పరిణామం ఆసక్తి రేపింది. తమకు బలం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యంగా వ్యవహరించని ప్రభుత్వ తీరుకి నీరసనగా పోటీ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించింది. కానీ అసలు కారణం పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడమేనని అనుమానిస్తున్నారు. పోటీ చేసి మరోసారి ఓటమిని కూడగట్టుకోవడం కన్నా దూరంగా ఉండడమే ఉత్తమమని పలువురు చేసిన సూచనలతో చివరకు జగన్ కూడా దానికి సై అన్నారని సమాచారం. మొత్తంగా ఈసారి కర్నూలు ఏకగ్రీవంగా టీడీపీ ఖాతాలో చేరుతుండడం విశేషం.


Related News

cbn-attar-chand-basha-666-11-1468234534

టీడీపీకి ముదిరిన క‌దిరి..!

Spread the loveటీడీపీలో వివాదాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు చోట్ల క‌ల‌హాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. కొన్నాళ్ల క్రితంRead More

bjp

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveతెలుగుదేశం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే డిఫెన్స్ లో ఉన్న నేప‌థ్యంలో చిన్న చిన్న అవ‌కాశాల‌ను కూడాRead More

 • అయ్యో..బైరెడ్డి
 • వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌
 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *