జగన్ ని తిడితే రాయలసీమకు నీళ్లు..!

srisailam
Spread the love

జగన్ నీవు రాయలసీమలోనే పుట్టావా అంటూ KE, రాయలసీమకు నీరు ఇవ్వడం జగన్ కు ఇష్టం లేదు అంటూ మంత్రి పత్తిపాటి పుల్లారావు, నీటి విషయంలో రాజకీయాలు వద్దు అంటూ మరో మంత్రి ఆదినారాయణ రెడ్డి ఇలా అందరూ సీమ కోసం పరితపిస్తున్నారు. రాయలసీమకు నీరు రాకపోవడానికి, పోతిరెడ్డిపాడు నుంచి నీరు వదిలిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం పిర్యాదుకు ఉన్న సంబందం, పరిష్కారం పై కొత్త చర్చకు దారితీస్తుంది.

శ్రీశైలంలో వరద కారణంగా ప్రస్తుతం 867 అడుగులలో నీరు ఉంది. ఏపి ప్రభుత్వం పోతిరెడ్డిపాడు, హంద్రీ నీవల ద్వారా నీరు తోడితే తెలంగాణ ప్రభుత్వం నెట్టంపాడు కల్వకుర్తికి నీటిని మల్లించింది. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం పిర్యాదులు చేసుకున్నాయి. అంతిమంగా క్రిష్ణారివర్ బోర్డు ఉబయరాష్ట్రాల వ్యవహరాలను తప్పుపడుతూ రెండు రాష్ట్రాల అవసరాల కోసం కొంత నీటిని విడుదల చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. రెండు రాష్ట్రాలు బోర్డుకు పిర్యాదు చేసుకున్నపుడు ఆయా రాష్ట్రప్రభుత్వాల పిర్యాదులను రెండు తెలుగు రాష్ట్రాల సాక్షి పత్రిక ప్రచురించింది. తెలంగాణ లో సాక్షి ప్రచురించిన అంశాన్ని ఆదారంగా చేసుకుని రాయలసీమకు నీరు ఇచ్చే పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ప్రభుత్వం పిర్యాదు చేసింది కనుక, దాన్ని సాక్షిపత్రిక ప్రచురించడం దానికి జగన్ కారణం అన్న పేరుతో మొత్తం సమస్యకు కారణం జగనే అన్న అర్దం వచ్చేలా అధికార పక్షం దాడి చేస్తుంది. నిజానికి అదే వార్తను అంతకు మించిన మోతాదులో మిగిలిన పత్రికలు కూడా ప్రచురించాయి. కానీ రాజకీయం కాబట్టి అందులోనూ అసలు సమస్య పరిష్కారం కాకూడదు కాబట్టి అధికారపార్టీ సంబందంలేని విషయాలను ముందుకు తీసుకువస్తుంది.

పోతిరెడ్డిపాడుపై తెలంగాణ, కల్వకుర్తిపై ఏపి పిర్యాదులు ఎందుకు చేసుకున్నాయి…….

సమస్య ఉన్నపుడే పిర్యాదులు వస్దాయి. పోతిరెడ్డిపాడు నుంచి ఏపి ప్రభుత్వం గాలేరు నగరి, తెలుగు గంగకు నీటిని విడుదల చేసింది. నిజానికి రెండు ప్రాజెక్టులకు నీరు విడుదలకు ఉన్న ఆటంకం వాటికి హక్కుతో కూడిన నికరజలాలు లేవు. అందుకే తెలంగాణ ప్రభుత్వం పిర్యాదు చేయగలిగింది. అదే విదంగా కల్వకుర్తి, నెట్టంపాడుకు తెలంగాణ ప్రభుత్వం నీరు విడుదల చేయడం దానిపై ఏపి ప్రభుత్వం పిర్యాదు చేయడం జరిగింది. రెండు పిర్యాదులను బోర్డు సానుకూలంగా తీసుకుని ఇద్దరిని తప్పుపట్టింది. ఇక్కడ మౌళిక సమస్య పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకోవడానికి హక్కుతో కూడిన నికరజలాలు లేవు. బాద్యత కలిగిన నేతల అందులో సీమ ప్రాంతానికి చెందిన నేతలు చేయాల్సింది గాలేరు నగరి, హంద్రీ నీవా, తెలుగు గంగ ప్రాజెక్టులకు నికరజలాలు కేటాయించాలి. ఆ పని చేయాల్సింది అధికార పార్టీ. కాని అందుకు బిన్నంగా రాయలసీమ వారికి హక్కులు కావాలా నీరు కావాలా అంటూ రాయలసీమకు నీరకర జలాలు కావాలి అన్న రాయలసీమ ఉద్యమ కారులను వెటకారం చేసిన ముఖ్యమంత్రి బాబును ప్రశ్నించాల్సిన KE క్రిష్ణమూర్తి సంబందం లేని జగన్ ను విమర్సించడం బాద్యత అనిపించుకోదు. సీమ ప్రాజెక్టులకు నీకరజలాలు ఇస్దే జగన్ వద్దన్నారా సాక్షి కుదరదన్నదా… లేదా సాక్షి తెలంగాణ ఎడిషన్ లో ప్రచురించకపోతే వారికి తెలియదా కేవలం రాజకీయా దరుద్దేశం మినహ మరోటి లేదు. ఇకనైనా కీలక స్దానంలో ఉన్న KE సీమ ప్రాజెక్టులకు ఇలాంటి దుస్దితి కారణం పై స్పందించాలి లేక పోతే మౌనంగా ఉండాలి. రాయలసీమ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం మంచిది కాదు.

సీమకు నష్టం తెచ్చిన వారుకూడా ప్రేమ వలకబోస్తున్నారు……

రాయలసీమకు నీరు ఇవ్వడం జగన్ కు ఇష్టం లేదంటూ క్రిష్ణా డెల్టాకు చెందిన పత్తిపాటి, దేవినేని కూడా రాయలసీమ మీద ఎక్కడలేని ప్రేమ వలక బోస్తున్నారు. రాయలసీమ నీటి సమస్యకు ప్రదాన సమస్యలు రెండు. 1. శ్రీశైలం నీటిమట్టం…. శ్రీశైలంలో నీటిమట్టం 842 అడుగుల ఉంటేనే పోతిరెడ్డిపాడుకు ప్లో ఉంటుంది. అదే హంద్రీ నీవకు అయితే 840 అడుగులు ఉండాలి. అపుడు మాత్రమే హంద్రీ నీవా, గాలేరు నగరి, తెలుగు గంగ, కేసీ, యస్ ఆర్ బీ సీ లకు నీరు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులు ఉండటం రాయలసీమకు ప్రాణపధం ఆ నిర్ణయాన్ని మార్చి డెల్టా అవసరాల కోసం నీటిమట్టాన్ని 834 అడుగులకు తెచ్చింది బాబుగారు. వై యస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్దిని మార్చే ప్రయత్నం చేసినపుడు దేవినేని, పుల్లారావు లాంటివారు వై యస్ సీమకు నీరు తీసుకు వెలుతున్నారు అంటూ ఆందోళన చేసి వై యస్ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. 2 పోతిరెడ్డిపాడు విస్దరణ….. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 12 వేల క్యూషెక్కుల నీటిని వాడే ఏర్పాట్లు ఉన్నాయి. దాన్ని వై యస్ 44 వేల క్యూషెక్కుల స్దాయికి పెంచారు ఆ సందర్బంలో కూడా ఇదే పెద్దలు ఆందోళన చేసినారు. కాని లెక్క చేయక మిలిటరీని పెట్టి వై యస్ ఆ కార్యక్రమాన్ని పూర్ది చేసినారు. నేడు గాలేరు నగరి, తెలుగు గంగ, యస్ ఆర్ బీ సీ చివరకు నెల్లూరు సోమశిలకు నీరు శ్రీశైలం ద్వారా వరద నీరు వచ్చినపుడు వస్తుంది అంటే దానికి కారణం వై యస్ నిర్ణయమే. స్తూలంగా పరిసీలిస్దే రాయలసీమకు కీలకమైన పోతిరెడ్డిపాడు వెడల్పు, శ్రీశైలం నీటిమట్టం 854 అడుగులను నాటి నుంచి తీవ్రంగా వ్యతిరేకించే పత్తిపాటి, దేవినేని వారు నేడు రాయలసీమపై ప్రేమ వలకబోయడం ఆక్షేపనీయం. నిజాయితీ ఉంటే రామారావు గారు తెచ్చిన జీ ఓ ప్రకారం పోటిరెడ్డిపాడు వెడల్పు రోజుకు 1.5 లక్షల క్యూషెక్కుల సామర్దానికి పెంపుకు అంగీకరించాలి. శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగులకు ఆమోదం తెలపాలి. అంతవరకు వారు సీమ వ్యతిరేకులుగానే ఉంటారు.

రాయలసీమ నేతలు బాద్యతతో మెలగాలి

రాజకీయలు అన్న తర్వాత విమర్సలు, ప్రతి విమర్సలు సహజం కాని తమ రాజకీయ ప్రయోజనం కోసం జన్మనిచ్చిన ప్రాంతం అస్దిత్వాన్ని పణంగా పెట్టి చేయడం దుర్మార్గం. ఇప్పుడిప్పుడే రాయలసీమలో నీటి చైతన్యం మొగ్గతొడుగుతుంది. ఈ చైతన్యం ప్రజాచైతన్యంగా మారాలి. ఈ దశలో బాద్యత కలిగిన నేతలు తమ వంతు పాత్ర పోషించాలి. అంతే కాని ప్రజలను తప్పుదోవ పట్టించడం సీమకు ద్రోహం చేయడమే.

(మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారి వాల్ నుంచి)


Related News

katasa

కాటసానికి లైన్ క్లియ‌ర్ చేసిన వైసీపీ

Spread the love22Sharesఏపీ ప్ర‌తిప‌క్ష పార్టీలో మ‌రో సీనియ‌ర్ కి లైన్ క్లియ‌ర్ అయ్యింది. కాట‌సాని రాంభూపాల్ రెడ్డి రంగRead More

challa ramakrishna reddy

టీడీపీలో మ‌రో త‌గాదా:మాజీ ఎమ్మెల్యే అవుట్?

Spread the love8Sharesతెలుగుదేశం ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు నామినేటెడ్ ప‌ద‌వుల విష‌యంలో ఓ అడుగు వేసింది. కీల‌క ప‌ద‌వులను కేటాయింపులు చేసింది.Read More

 • వైసీపీలోకి మ‌రో వార‌సుడు
 • వైసీపీలోకి మ‌రో మాజీ ఎమ్మెల్యే
 • జ‌న‌సేన‌పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
 • చంద్ర‌బాబుపై తిర‌గ‌బ‌డండి..
 • టీడీపీకి ముదిరిన క‌దిరి..!
 • ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మీద గురిపెట్టిన టీడీపీ
 • అయ్యో..బైరెడ్డి
 • వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *