Main Menu

పరిటాల సునీత‌కు ఝ‌ల‌క్

Spread the love

అనంత‌పురం జిల్లాకు చెందిన మంత్రి ప‌రిటాల సునీత‌కు షాక్ త‌గిలింది. ఆమె సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే ఎదురు దెబ్బ త‌ప్ప‌లేదు. నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర మండంలో తెలుగు త‌మ్ముళ్లు తిర‌గ‌బ‌డ‌డంతో స్వ‌యంగా మంత్రి సోద‌రుడు వెన‌క‌డుగు వేయాల్సి వ‌చ్చింది. రాప్తాడులో జ‌రిగిన ఈ ప‌రిణామాలు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయి. ఇంత‌కాలంగా అలాంటివి ఊహించ‌డానికి కూడా సాధ్యం కాని వ్య‌వ‌హారం ఆచ‌ర‌ణ‌లోకి రావ‌డంతో ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

రాప్తాడులో ప‌రిటాల కుటుంబానికి తిరుగులేని ఆధిక్యం ఉంది. గ‌డిచ‌ని రెండు ఎన్నిక‌ల్లో ఆమె విజ‌యం సాధించ‌డమే కాకుండా సామాజికంగా, రాజ‌కీయంగా, అన్ని వ్య‌వ‌హారాల్లోనూ ప‌రిటాల మాట‌కు ఎదురులేని ప‌రిస్థితి క‌నిపించేది. అలాంటిది అనూహ్యంగా రాప్తాడు మండ‌లంలోని బండ‌మీద ప‌ల్లెలో గ్రామ‌ద‌ర్శిని కార్య‌క్ర‌మం స్థానిక టీడీపీ నేత‌కు తెలియ‌కుండా నిర్వ‌హించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఎంపీపీ ద‌గ్గుబాటి దుర్గాప్ర‌సాద్ ఈ విష‌యంలో మంత్రి సోద‌రుడు ముర‌ళీ తీరుపై మండిప‌డ్డారు.

ప్రోటోకాల్ పాటించ‌కుండా స‌మావేశం నిర్వ‌హించ‌డంపై నిల‌దీశారు. దాంతో మంత్రి సోద‌రుడి మాట ప్ర‌కారం స‌మావేశానికి సిద్ధ‌మ‌యిన అధికారులు వెనుదిర‌గాల్సి వ‌చ్చింది. దుర్గా ప్ర‌సాద్ తీరుతో మంత్రి సోద‌రుడు ఖంగుతినాల్సి వ‌చ్చింది. మురళీ వ‌ర్గం నేత‌లంతా ఈ ప‌రిణామాల‌తో చిన్న‌బుచ్చుకోవాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం రాప్తాడు నియోక‌వ‌ర్గంలో ఇదో హాట్ టాపిక్ అవుతోంది.

ప‌రిటాల సునీత వ్య‌వ‌హారాల్లో ఓవైపు కుమారుడు, మ‌రోవైపు సోద‌రుడి పాత్ర పెరిగింద‌నే ప్ర‌చారం చాలాకాలంగా ఉంది. దాంతో స‌హించ‌లేని టీడీపీ నేత‌లే ఇలా ఎదురుతిరుగుతున్న తీరు రాప్తాడు రాజ‌కీయాల్లో మార్పున‌కు సంకేతంగా కొంద‌రు అంచ‌నా వేస్తున్నారు.






Related News

ఆ రెండు సీట్లే హాట్ టాపిక్!

Spread the loveఅనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అందులోనూ వార‌సులు బ‌రిలో దిగిన నేప‌థ్యంలో అనంత‌పురంRead More

కాంగ్రెస్ క‌ల తీరేనా?

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాల‌న్న‌ది కాంగ్రెస్ క‌ల‌. తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 2014లో ఆపార్టీ ఖంగుతిన్న‌ది. కేవ‌లం మూడంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *