Main Menu

అనంత టీడీపీలో అంతుబ‌ట్ట‌ని ఆందోళ‌న‌

Spread the love

అనంత‌పురం. రాయ‌ల‌సీమ‌లోనే టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న జిల్లా. గ‌త ఎన్నిక‌ల్లో కూడా జ‌గ‌న్ హ‌వాకి అడ్డుక‌ట్ట వేసింద‌క్క‌డే. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ అధికారం నిల‌బెట్టుకోవాల‌ని టీడీపీ ఆశిస్తోంది. అందుకు అనంత‌పురం జిల్లా అత్యంత కీల‌కంగా మారింది. అందుకు త‌గ్గ‌ట్టుగానే చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా దృష్టి పెట్టారు. రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పార్టీ ప‌రిస్థితిపై ప్ర‌త్యేకంగా శ్ర‌ద్ధ పెట్టి స‌మీక్ష‌లు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబుతో జ‌రిగిన భేటీలో ప‌లువురు ఎమ్మెల్యేలు ఖంగుతినే క‌బురు వినాల్సి వ‌చ్చింద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో ప్ర‌స్తుతం ఉర‌వ‌కొండ మిన‌హా మిగిలిన అన్ని స్థానాల్లోనూ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో క‌దిరి చాంద్ బాషా వైసీపీ నుంచి గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యే. అయితే వారిలో ఇప్పుడు ఏకంగా ఐదుగురిని మార్చేందుకు చంద్ర‌బాబు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు స‌మాచారం అంద‌డంతో సిట్టింగుల‌లో సెగ రాజుకుంటోంది.

ఇప్ప‌టికే తాడిప‌త్రి జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి స్థానంలో త‌న‌యుడు అస్మిత్ రెడ్డికి చాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. మంత్రి ప‌రిటాల సునీత త‌న‌యుడు శ్రీరామ్ కూడా పోటీకి ప్రిపేర్ అయిపోయారు. ఇలా వార‌సుల‌తో పాటు కొంద‌రు సీనియ‌ర్ల‌కు కూడా ఛాన్స్ ఉండ‌ద‌ని తెలుస్తోంది. వారిలో హ‌నుమంత‌రాయ చౌద‌రి పేరు వినిపిస్తోంది. గుత్తి, శింగ‌న‌మ‌ల ఎమ్మెల్యేల‌ను కూడా మార్చే ఆలోచ‌న చేస్తార‌ని అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ మిగిలిన వారిలో కూడా ప‌లువురు త‌మ‌కు మ‌ళ్లీ సీటు వ‌స్తుందో రాదోన‌నే బెంగ‌తో ఉన్నారు. ఏమ‌యినా టీడీపీ నేత‌ల్లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న అంతులేని ఆందోళ‌న మిగిల్చింద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.






Related News

హిందూపురంలో హీటురాజేస్తున్న రాజ‌కీయాలు

Spread the loveసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైకాపా వ్యూహాత్మకంగాRead More

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the loveటాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *