బాబు, చినబాబుపై చెలరేగిన సోము వీర్రాజు

somu veerraju
Spread the love

బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చెలరేగిపోయారు. మరోసారి ఆయన చంద్రబాబు మీద గురిపెట్టారు. తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మిత్రపక్ష నేత అవినీతి, అక్రమాలను ప్రస్తావించారు. రెండెకరాల నేతకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని చంద్రబాబుని సూటిగా ప్రశ్నించి సంచలనం రేపారు. గతంలో ప్రత్యర్థులుగా ఉన్నకాలంలో బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల కన్నా తీవ్రంగా తాజాగా సోము వీర్రాజు విరుచుకుపడడం గమనిస్తే వారి బంధం పూర్తిగా బీటలు వారడం ఖాయంగా కనిపిస్తోంది.

తాము నిప్పులాంటి వాళ్ళమని, మీరు అవినీతికి వారసులంటూ చంద్రబాబునుద్దేశించి సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ‘‘మీరు మహానేతను భూస్థాపితం చేసి రాజ్యమేలుతున్నారు. రెండెకరాల రైతును అంటున్న మీకు లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడివి? కేంద్ర నిధులు రాష్ట్రంలో స్వార్థపరులకు ఆదాయ వనరులుగా మారాయి. సీఎం నియోజకవర్గంలో భారీ అవినీతి జరిగింది నిజం కాదా? అంటూ నిలదీశారు.

అంతకుముందు నారా లోకేష్‌పై కూడా వీర్రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి లోకేష్‌కు 19 అవార్డులు రావడానికి కేంద్రం ఇచ్చిన నిధులే కారణం కాదా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. పోలవరానికి ఇప్పటి వరకు ఇచ్చిన నిధుల్లో జరిగిన పనులెంత అని నిలదీశారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్‌ను కేంద్రానికి అప్పగిస్తామన్న చంద్రబాబు… ఇప్పుడు మరో కంపెనీని ఎందుకు తెరపైకి తీసుకొచ్చారని మరోసారి ప్రశ్నించారు. దాాంతో సోము వీర్రాజు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఓవైపు బీజేపీ అధినేత అమిత్ షా సంయమనం పాటించాలని సూచింనట్టు వార్తలు రాగా, తాజాగా సోము వీర్రాజు గేరు మార్చి నేరుగా బాబు మీద గురిపెట్టడం విశేషంగా మారింది.


Related News

anantapuram

వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు

Spread the loveఅనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, మాజీRead More

kodumuru manigandhi

అమ్ముడుపోయిన ఎమ్మెల్యేని…

Spread the loveక‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను అమ్ముడుపోయిన ఎమ్మెల్యేనంటూ వ్యాఖ్యానించి క‌ల‌క‌లం రేపారు.Read More

 • బాబుని కాద‌ని జ‌గ‌న్ పై ప‌వ‌నాస్త్రం!
 • మర్డర్ కేసు: మంత్రికి షాక్
 • కర్నూలు కాక చల్లార్చే యత్నంలో బాబు
 • బాబు, చినబాబుపై చెలరేగిన సోము వీర్రాజు
 • టీడీపీకి 10మంది రాజీనామా
 • చంద్రబాబుకి గుడి..
 • కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..
 • కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *