Main Menu

కాంగ్రెస్ నేత కోసం లైన్ క్లియ‌ర్ చేస్తున్న బాబు

Spread the love

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత కోసం చంద్ర‌బాబు లైన్ క్లియ‌ర్ చేస్తున్నారు. సైకిల్ స‌వారీకి ఆయ‌న‌కు స‌క‌ల ఏర్పాట్లు చేస్తున్నారు. సుదీర్ఘ‌కాలంగా కాంగ్రెస్ లో ఉన్న ఆయ‌న‌కు ప‌చ్చ కండువా క‌ప్పి పార్టీ టికెట్ క‌ట్ట‌బెట్టే ప‌నిలో టీడీపీ అధినేత ఉన్న‌ట్టు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు శైల‌జానాధ్ వ్య‌వ‌హారం అనంత‌పురం రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

గ‌తంలో శింగ‌న‌మ‌ల నుంచి ప్రాతినిధ్యం వ‌హించిన శైలజానాధ్ మ‌రోసారి బ‌రిలో దిగాల‌ని ఆశిస్తున్నారు.అ యితే కాంగ్రెస్ వ‌ల్ల త‌న కోరిక నెర‌వేర‌ద‌ని ఆయ‌న నిర్ధారించుకున్నారు. వైసీపీలో బ‌ల‌మైన నేత జొన్న‌ల‌గడ్డ ప‌ద్మావ‌తి ఉండ‌డంతో టీడీపీ టికెట్ కోసం ఆశాభావంతో సాగుతున్నారు. కానీ యామినీ బాల కారణంగా త‌న‌కు టికెట్ ద‌క్కుతుందో లేదోన‌నే బెంగ మాజీ మంత్రిలో ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని కాద‌ని త‌న‌కు ఛాన్స్ ఇచ్చే అవ‌కాశాల‌పై ఆయ‌న మ‌ధ‌న‌ప‌డుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

కానీ చంద్ర‌బాబు వేసిన ఎత్తుల‌తో ఇప్పుడు శైల‌జానాద్ కి ఛాన్స్ ఖాయ‌మ‌ని అంతా చెబుతున్నారు. ముఖ్యంగా యామినీ బాల త‌ల్లి శ‌మంత‌క‌మ‌ణికి మ‌రోసారి ఎమ్మెల్సీ ఖ‌రారు చేశారు. దాంతో ఒకే ఇంట్లో త‌ల్లీ బిడ్డ ఇద్ద‌రికీ రెండు టికెట్లు క‌ష్టం అని చెప్పేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నారు. గ‌డిచిన ఎన్నిక‌ల్లో విప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఛాన్స్ ఇచ్చిన‌ప్ప‌టికీ ఇప్పుడు అధికారం నిల‌బెట్టుకోవాల్సిన అవ‌స‌రం రావ‌డం, అదే స‌మ‌యంలో యామినీ బాల‌కు తోడుగా ఆమె సోద‌రుడు అశోక్ కూడా టికెట్ కోసం ప‌ట్టుబ‌ట్టుతుండ‌డంతో ఇద్ద‌రినీ కాద‌ని శైల‌జానాధ్ కి సీటు ఖాయం చేసే యోచ‌న‌లో చంద్ర‌బాబు ఉన్నార‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే తాజా ఎమ్మెల్సీ నిర్ణయం ఉంద‌ని అంచ‌నాలు వేస్తున్నారు.






Related News

వైసీపీకి కోర్టులో ఊర‌ట‌

Spread the loveవైసీపీకి ఊర‌ట ల‌భించింది. ఆ పార్టీ అభ్య‌ర్థిత్వం విష‌యంలో ఏర్ప‌డిన అస్ప‌ష్ట‌త‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు కోర్ట్ జోక్యంతోRead More

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *