జ‌గ‌న్ చెప్పారు..చేస్తున్నా..!

DGTa20xUMAI-ACX
Spread the love

నంద్యాల బ‌హిరంగ‌స‌భ‌లో శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి వీరావేశం ప్ర‌ద‌ర్శించారు. ఆట‌మొద‌ల‌య్యిందంటూ మొద‌లెట్టి..క‌మాన్ అంటూ స‌వాల్ చేశారు. అప్ప‌ట్లో భూమన్న‌…బుడ్డ‌న్న అంటూ మ‌మ్మ‌ల్ని వ‌దిలి దొంగ‌ల‌ను చేర్చుకున్నారంటూ జ‌గ‌న్ మీద కూడా వ్యాఖ్య‌లు చేశారు. అదే స‌మ‌యంలో భూమా డ్రామాలు అంటూ కొత్త సినిమా మొదలెట్టార‌ని వ్యాఖ్యానించారు. ఆళ్ల‌గ‌డ్డ వాళ్లు కావాలా..బ‌న‌గాన‌ప‌ల్లి అల్లుడు కావాలా..నంద్యాల బిడ్డ కావాలా అంటూ స‌వాల్ చేశారు. వైశ్యులు, మైనార్టీలు అంటున్నార‌ని, వాళ్లంద‌రి ఓట్లు త‌మ‌కేన‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఎన్ఎండీ ఫ‌రూఖ్ వంటి ముగ్గురి కి ఉద్యోగాలిప్పించి, త‌న ఉద్యోగం ఊడ‌బీకింది జ‌గ‌న్ అంటూ సెటైర్ వేశారు. జ‌గ‌న్ వ‌ల్లే ఫ‌రూఖ్ వంటి వాళ్ల‌కు పోస్టులు వ‌చ్చాయ‌న్నారు. శిల్పా అంటేనే సంచ‌ల‌నం అని స్ప‌ష్టం చేశారు. తాము ఎన్న‌డూ ఎవ‌రికీ హాని చేయ‌లేద‌న్నారు. లోకేష్ మీద కూడా విమ‌ర్శ‌లు చేశారు. త‌న‌కు ఆశే లేద‌ని కానీ అత్యాశ అంటూ వ్యాఖ్యానించారంటూ విరుచుకుప‌డ్డారు.

ఈ సంద‌ర్భంగానే త‌న రాజీనామా లేఖ‌ను ఆయ‌న స‌భ‌లోనే రాసి జ‌గ‌న్ కి అందించడం విశేషం. స్పీక‌ర్ ఫార్మేట్ లో రాజీనామా చేశాన‌ని తెలిపారు. జ‌గ‌న్ నైతిక విలువ‌ల గురించి చెప్పార‌ని, ఆయ‌న మాట ప్ర‌కార‌మే రాజీనామా చేస్తున్నాన‌న్నారు. బాబుకి, జ‌గ‌న్ కి చాలా తేడా ఉంద‌న్నారు. బాబుకి చెప్పంది చేసే అల‌వాటు లేద‌న్నారు. జ‌గ‌న్ కి చెప్పిన మాట త‌ప్పే అల‌వాటు లేద‌న్నారు. నంద్యాల‌లో సంచులు తీసుకురావ‌డ‌మే అభివృద్ధి అన‌డం కాద‌ని, ఆళ్ల‌గ‌డ్డ వెళ‌దామా అంటూ భూమా అఖిల‌ప్రియ‌కు స‌వాల్ చేశారు.

DGTd2w1UQAA3_Vy






Related News

Payyavula-Keshav

పయ్యావుల కేశవ్ బాధపడుతున్నాడట..

Spread the loveతెలంగాణ తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాధించాయని ఆ పార్టీ ఎమ్మెల్సీ,Read More

Adinarayana-Reddy1455803904

మంత్రి వర్సెస్ ఎంపీ

Spread the loveనిన్న మొన్న వరకూ తెలుగుదేశం తరపున చక్రం తిప్పిన వ్యక్తి ఆయన. రాష్ట్రానికి సీఎం చంద్రబాబు అయితేRead More

  • వైసీపీ నేత దుర్మరణం
  • రచ్చకెక్కిన వైసీపీ విబేధాలు
  • వైసీపీ నేతల అరెస్ట్
  • వైసీపీలో గందరగోళం
  • టీడీపీ ఎమ్మెల్యే ఇంట్లో బెల్ట్ షాప్
  • నేను పోటీ చేస్తున్నా…
  • మళ్లీ చేతికి పనిచెప్పిన బాలయ్య
  • ఎమ్మెల్యే బంధువుని చితక్కొట్టిన జనం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *