Main Menu

ప‌వ‌న్ కి పోటీగా రెండో భార్య‌!

Spread the love

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ జ‌నంలోకి వ‌చ్చారు. గ‌డిచిన కొంత కాలంగా పూర్తిగా పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌కే ప‌రిమితం అయిన ప‌వ‌న్ తాజాగా క‌ర్నూలు టూర్ పేరుతో రాయ‌ల‌సీమ‌లో అడుగుపెట్టారు. తొలిరోజు క‌ర్నూలు న‌గ‌రంలో సాగించిన రోడ్ షోకి మంచి స్పంద‌న ద‌క్కింది.

అయితే ఈలోగా క‌ర్నూలు జిల్లాకు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండో భార్య రావ‌డం విశేషంగా మారింది. రేణూ దేశాయ్ కూడా అదే జిల్లాలో ప‌ర్య‌టించ‌డం ఆస‌క్తిగా క‌నిపిస్తోంది. ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె రైతులతో ముఖాముఖీ జ‌రిపారు. ఆమెను చూసేందుకు ప‌లువురు జ‌నం కూడా ఎగ‌బ‌డ్డారు. ప‌వ‌న్ ప‌ర్య‌ట‌న సాగుతుండ‌గా ఆమె ఎంట్రీ ఇవ్వ‌డం, జ‌నం స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు గ్రామాల్లో ప‌ర్య‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

రేణుదేశ‌య్ క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో రైతుల‌ను క‌లిశారు. వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్నారు. రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారినికి ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆమె హామీ ఇచ్చారు. గ‌తంలోనే సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్, ఆయ‌న ఫ్యాన్స్ మీద తీవ్ర స్థాయిలో మండిప‌డిన రేణూ దేశాయ్ ఇప్పుడు నేరుగా ప‌వ‌న్ కి పోటీగా యాత్ర చేస్తున్నారా అన్న సందేహం క‌లిగించేలా పొలిటిక‌ల్ స్క్రీన్ మీద‌కు వ‌చ్చారు. రైతుల స‌మ‌స్య‌ల గురించి ఆమె మాట్లాడిన తీరు అందుకు ఉదాహ‌ర‌ణ క‌నిపిస్తోంది.

దాంతో ప‌వ‌న్ రెండో భార్య తీరు రాజ‌కీయంగా ప‌లు సందేహాల‌కు తావిస్తోంది. ఆమె నేరుగా పొలిటిక్స్ లో ఉంట్రీ ఇచ్చేందుకు ఇలాంటి ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టుగా ప‌లువురు సందేహిస్తున్నారు. అందులోనూ సాక్షీ టీవీతో క‌లిసి రేణు దేశాయ్ ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగ‌స్వామ్యం కావ‌డం మ‌రింత విశేషంగా చెప్ప‌వ‌చ్చు. భ‌విష్య‌త్తులో రాజ‌కీయ ప‌రంగా రేణూదేశాయ్ అడుగులు మ‌రింత వేడి పుట్టించే అవ‌కాశం ఉంద‌నే సంకేతాల‌కు ఆస్కారంగా క‌నిపిస్తోంది.






Related News

వైసీపీకి కోర్టులో ఊర‌ట‌

Spread the loveవైసీపీకి ఊర‌ట ల‌భించింది. ఆ పార్టీ అభ్య‌ర్థిత్వం విష‌యంలో ఏర్ప‌డిన అస్ప‌ష్ట‌త‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు కోర్ట్ జోక్యంతోRead More

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *