Main Menu

జేసీకి జ‌న‌సేనాని వార్నింగ్

Spread the love

ఒక్కో జిల్లాలో ఒక్కో నాయ‌కుడి మీద ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురి పెడుతున్నారు. గోదావ‌రి జిల్లాల్లో చింత‌మ‌నే ప్ర‌భాక‌ర్ మీద చిందులేశారు. తీవ్రంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక ఇప్పుడు రాయ‌ల‌సీమ‌లో జేసీని జ‌న‌సేనాని టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. అందులో భాగంగా ‘ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డీ..! ఫ్యాక్షన్‌ రాజకీయాలతో భయపెట్టాలని చూడొద్దు. పోలీసులు, ఇతర అధికారులను ఎంతమందిని భయపెడతారు. ఎంత మందిని చంపుతారు. ఎంతమందిపై బాంబులేస్తారు. రోజులు మారాయి. పాతతరం లాగా ఫ్యాక్షన్‌ రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. జనసేన అసలే ఊరుకోదు. సీమలో అధికారం కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉండిపోయింది. ఇది బాధకలిగించే అంశం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే సహించేదిలేదు. ఆ ప్రజలకు జనసేన అండగా ఉంటుంది. జనసేన సైనికులపైనా కేసులు పెట్టి ఇబ్బందులు కలిగించాలని చూస్తే ఊరుకోం.. జాగ్రత్త.’ అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రత్యక్షంగా పవన్‌ హెచ్చరించారు.

జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి పేరు పెట్టి మ‌రీ ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేయ‌డం విశేషంగా మారింది. రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. జేసీ ఎలా స్పందిస్తార‌న్న‌ది ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షిస్తోంది.






Related News

జ‌గ‌న్ కి ఎదురుదెబ్బ‌లు..!

Spread the loveవైసీపీ అధినేత‌కు డ‌బుల్ షాక్ త‌గిలింది. నిర్ల‌క్ష్యం ఆయ‌న‌కు చేటు తెస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. పార్టీ ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్దుకోవ‌డంలోRead More

సీఎం ర‌మేష్ కి షాక్!

Spread the loveప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ అన్నంత పనీ చేసింది. అనుమానాస్పద, వివాదాస్పద ఖాతాలను తొలగిస్తామని ఇటీవల ప్రకటించినRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *