బాబుని కాద‌ని జ‌గ‌న్ పై ప‌వ‌నాస్త్రం!

ys jagan pawan cbn
Spread the love

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రోసారి మీడియా ముందుకొచ్చారు. ఈసారి గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యంగా త‌ను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది చెప్ప‌డ‌మే త‌ప్ప‌, ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న అంగీక‌రించ‌లేదు. అది కూడా కేవ‌లం 10 నిమిషాల‌లోనే ముగించేశారు. అదే స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ స‌వాల్ కి ఆయ‌న ప్ర‌తి సవాల్ గా చెప్పుకొచ్చి రాజ‌కీయంగా ఓ అడుగు వేశారు. స‌హ‌జంగా ప‌వ‌న్ తీరుకి భిన్నంగా స్పందించారు. ద‌మ్ము, ధైర్యం ఉన్న నాయ‌కుడిగా జ‌గ‌న్ గురించి త‌న‌కు తెలుసంటా చెప్పుకొచ్చిన ప‌వ‌న్, అవిశ్వాసం తీర్మానం పెట్టి చూపించాలంటూ స‌వాల్ చేశారు. అదే స‌మ‌యంలో తాను 4వ తేదీన ఢిల్లీ వ‌చ్చి లెఫ్ట్ స‌హా అన్ని పార్టీల నేత‌ల‌తో మాట్లాడ‌తాన‌ని చెప్పుకొచ్చారు. 80మంది మ‌ద్ధ‌తు తాను సాధిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

అయితే అదే స‌మ‌యంలో ఆయ‌న జ‌గ‌న్ గురించి మాట్లాడ‌డ‌మే త‌ప్ప‌, అవిశ్వాసం అంటేనే ఒంటికాలి మీద లేచిన చంద్ర‌బాబు గురించి మాత్రం ప‌ల్లెత్తు మాట అన‌లేదు. అవిశ్వాసం గురించి మాట్లాడ‌డం అంటే స‌భా సంప్ర‌దాయాలు తెలియ‌క‌పోవ‌డం అంటూ మండిప‌డిన టీడీపీ అధినేత గురించి ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ అవిశ్వాసం పెట్టాల‌ని చెప్పిన జ‌న‌సేన అధినేత‌, అదే స‌మ‌యంలో ఏపీలో పెద్ద పార్టీ, జ‌న‌సేన కి మిత్ర‌ప‌క్ష పార్టీ గురించి మాట్లాక‌పోవ‌డం విశేషంగా మారింది. సొంత రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీ గురించి ప్ర‌స్తావించ‌కుండా దేశంలోని అన్ని పార్టీల గురించి మాట్లాడ‌డం విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది.

మొత్తంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న పార్ట‌న‌ర్ గురించి మాట్లాడ‌కుండానే ప్ర‌తిప‌క్షాన్ని మాత్రం ప్ర‌శ్నించ‌డం ద్వారా తాను పూర్తిగా చంద్ర‌బాబుతో సెయిల్ అవ‌డానికి త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు స్ప‌ష్టమ‌వుతోంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. 20మంది స‌భ్యుల టీడీపీ గురించి మాట్లాడ‌కుండా ఐదుగురున్న వైసీపీ గురించి మాత్ర‌మే ప్ర‌స్తావించ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. అయితే వైసీపీ మాత్రం ఈ విష‌యంలో అవిశ్వాసం పెడుతుందా లేదా అన్న‌ది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. జ‌గ‌న్ బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన‌ట్టు అవిశ్వాసం పెడ‌తారా..లేక వెన‌క‌డుగు వేస్తారా అన్న‌ది ఆస‌క్తిదాయ‌క‌మే. అదే స‌మ‌యంలో ఏపీలో ఎవ‌రైనా అవిశ్వాసం పెడితే, దానిని బీజేపీ అంగీక‌రించే అవ‌కాశం లేదు కాబ‌ట్టి, ఏమేర‌కు చర్చ‌కు వ‌స్తుంద‌నే సందేహం కూడా క‌నిపిస్తోంది.


Related News

02-1456921428-25-1456381278-byreddy-rajasekhar-reddy-692

అయ్యో..బైరెడ్డి

Spread the loveబైరెడ్డి రాజ‌శేఖ‌ర్ రెడ్డి..క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో ఈ పేరు చిర‌ప‌రిచితం. రాయ‌ల‌సీమ వాసుల‌కు కూడా కొంత ప‌రిచ‌యం.Read More

9173_ysrcp-3

వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ఆపార్టీదే కొంత పై చేయిగా క‌నిపిస్తోంది. టీడీపీ పూర్తిగాRead More

 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • నోరుపారేసుకున్న మంత్రి ఆది..
 • వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *