పరిటాల పెళ్లిపనుల్లో విషాదం

paritala sunitha
Spread the love

మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌ వివాహ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పరిటాల శ్రీరామ్‌ పెళ్లి పనులు నిమిత్తం వెళుతున్న ఓ బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పెళ్లికి సంబంధించిన డెకరేషన్ సామగ్రిని డీసీఎం వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్‌ శివారులోని పెద్దాయపల్లి వద్ద 44వ నంబర్‌ జాతీయ రహదారిపై వ్యాన్‌ అదుపు తప్పి బోల్తా పడింది.

ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌, క్లీనర్‌తో పాటు ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా పరిటాల శ్రీరామ్‌ వివాహం వచ్చేనెల (అక్టోబర్‌) 1వ తేదీన జరగనుంది. అనంతపురం జిల్లాకు చెందిన జ్ఞానవితో గత నెల 10వ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.


Related News

former-cm-kirankumar-reddy-brother-kishore-kumar-reddy-to-join-in-tdp-id3_1510832759

నారా వారి గూటిలో నల్లారి

Spread the love1Shareచిత్తూరు జిల్లా రాజకీయాల్లో కొత్తమార్పులకు తెరలేసింది. మూడున్నర దశాబ్దాల వైరంగా ఉన్న నల్లారి, నారా కుటుంబాలు ఒక్కటయ్యాయి.Read More

shilpa brothers

శిల్పా బ్రదర్ప్ పై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Spread the love12Sharesఏపీ ప్రభుత్వ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అవుతోంది. అదికార పార్టీలో ఉన్నప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వంRead More

 • తెలుగు మహిళా తలవంచుకో…!
 • టీడీపీ నేతను కాల్చేసిన వైసీపీ నాయకుడు
 • ఫోర్జరీ లో పట్టుబడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే
 • రెండు పోస్టులు అనంతపురానికే..
 • తన టికెట్ ఖాయం అంటున్న ఫిరాయింపు ఎంపీ
 • పల్లెకి బాబు న్యాయం చేస్తారా?
 • పవన్ కల్యాణ్ సీటు అదే…కన్ఫర్మ్
 • జగన్ యాత్రలో జాప్యం..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *