Main Menu

వైసీపీకి షాక్ తప్పదా?

Spread the love

కర్నూలు జిల్లా మీద గంపెడాశతో ఉన్న వైసీపీకి గట్టి దెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆపార్టీ ఎమ్మెల్యే ఫిరాయింపు ఖాయం అవుతోంది. త్వరలోనే పాణ్యం ఎమ్మెల్యే వైసీపీని వీడబోతున్నట్టు స్పష్టం అవుతోంది. ఆమెతో పాటుగా గౌరు వెంకటరెడ్డి కూడా తన పార్టీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరాలని నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది.

వైసీపీలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి చేరాక పాణ్యం వ్యవహారం చేతులు దాటిపోతున్నట్టు కనిపిస్తోంది. జగన్ ని ఇన్నేళ్లుగా నమ్ముకున్న వారిని ముంచేలా సీన్ మారుతోంది. దాంతో తమకు ప్రాధాన్యత తగ్గిందని గౌరు దంపతులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా, టికెట్ విషయంలో జగన్ హామీ ఇవ్వలేదని గౌరు వర్గం అలకబూనింది.

గౌరు దంపతులు రెండ్రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించనున్నట్లు సమాచారం. వచ్చే నెల 6న గౌరు ఫ్యామిలీ టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాటసాని పార్టీలో చేరిన సందర్భంలో మీకు పార్టీ టికెట్ దక్కుతుందా అని ఆమెను మీడియా ప్రశ్నించినప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరిగింది.






Related News

వైసీపీకి కోర్టులో ఊర‌ట‌

Spread the loveవైసీపీకి ఊర‌ట ల‌భించింది. ఆ పార్టీ అభ్య‌ర్థిత్వం విష‌యంలో ఏర్ప‌డిన అస్ప‌ష్ట‌త‌కు తెర‌ప‌డింది. ఎట్ట‌కేల‌కు కోర్ట్ జోక్యంతోRead More

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *