Main Menu

వైసీపీలోకి మ‌రో మాజీ ఎమ్మెల్యే

Spread the love

క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల్లో కొత్త ప‌రిణామాలు చోటు చేసుకునేలా క‌నిపిస్తోంది. సీనియ‌ర్ నేత ఒక‌రు వైసీపీ వైపు చూస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీటు క‌న్ఫ‌ర్మ్ అయితే జ‌గ‌న్ జెండా ఎత్తాల‌ని ఆశిస్తున్నారు. జ‌గ‌న్ నుంచి సానుకూల సంకేతం అందిన‌ట్టు పాణ్యంలో ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా..సిట్టింగ్ సంగ‌తేంట‌నేది వైసీపీ నేత‌ల్లో ఉత్కంఠ‌త రేపుతోంది. దాంతో క‌ర్నూలు జిల్లా వైసీపీ వ‌ర్గాల్లో ఇదో హాట్ టాపిక్ అవుతోంది.

పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ప్ర‌స్తుతం బీజేపీ లో ఉన్నారు. కానీ ఏపీ రాజ‌కీయాల్లో బీజేపీ తీరుని చూసిన త‌ర్వాత క‌మ‌లం కండువా వ‌దిలించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దాంతో ఆయ‌న వైసీపీ వైపు చూస్తున్నారు. ఈనెల 18న క‌ర్నూలులో త‌న అనుచ‌రుల‌తో స‌మావేశం నిర్వ‌హించి కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Senior-BJP-Leader-Katasani-Rambhupal-Reddy-to-Join-TDP-1

గ‌డిచిన ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సుమారు 30వేల ఓట్లు సాధించిన ఆయ‌న‌కు నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టు ఉంది. రాంభూపాల్ రెడ్డి తొలిసారి పాణ్యం నుంచి 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజ‌యం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఆతర్వాత 1989లో, 1994లో జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించారు. 1999లో టీడీపీ అభ్యర్థి పార్థసారథి చేతిలో ఓటమి చవిచూసిన కాటసాని.. 2004లో అదే పార్థసారథిని ఓడించారు. 2009లో టీడీపీ అభ్యర్థి భైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ని ఓడించి విజ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి బ‌రిలో దిగాల‌ని ఆశిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టుగా వైసీపీ నుంచి హామీ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి గౌరు చ‌రితా రెడ్డి వైసీపీ త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. గౌరు వెంక‌ట రెడ్డి జిల్లాలో పార్టీ అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో గౌరు కుటుంబాన్ని కాద‌ని కాట‌సానికి ఏమేర‌కు ఓకే చేస్తార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. అయినా ఆయ‌న‌కు క్లారిటీ వ‌చ్చేసింద‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో పాణ్యం రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి.






Related News

పోలీసుల‌ను ఆశ్ర‌యించిన జేసీ

Spread the loveఅనంత‌పురం జిల్లాలో ప్ర‌బోధానంద వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ముఖ్యంగా ఆశ్ర‌మ నిర్వాహ‌కుల నుంచి వ్య‌వ‌హారం గోరంట్ల సీఐపైRead More

సొంత జిల్లాలోనే సీఎంకి షాక్

Spread the loveఏపీ సీఎం సొంత జిల్లాలో రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. అధికార పార్టీకి స‌మ‌స్య‌లు త‌ప్పేలా లేదు. దాంతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *