వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు

anantapuram
Spread the love

అనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, మాజీ మంత్రి ప‌ల్లె ర‌ఘునాథ్ రెడ్డి మ‌ధ్య ఫోన్ సంభాష‌ణ పెద్ద వైర‌ల్ అయ్యింది. తీవ్రంగా ప్ర‌చారం సాగ‌డంతో టీడీపీ నేత‌లు ఖంగుతినాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా ఓ రోడ్డు నిర్మాణ కాంట్రాక్ట్ ని వైసీపీ అనుచ‌రులకు ఇచ్చారంటూ ప‌ల్లె గుస్సా అయ్యారు. ప‌నులు నిలిపివేయించారు. దాంతో జేసీ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఫోన్ చేసి ప‌ల్లె మీద మండిప‌డ్డారు. నేను చేస్తా..చేస్తా అంటూ చీవాట్లు పెట్టేశారు. దాంతో ఈ వ్య‌వ‌హారం ర‌చ్చ‌ర‌చ్చ‌గా మారింది.

ఈ నేప‌థ్యంలోనే తెలుగుదేశం నేత‌లు ఇప్పుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ వీడియోను బ‌య‌ట‌పెట్టిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌ను కోరారు. దాంతో పోలీసులు న‌లుగురిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తున‌కు శ్రీకారంచుట్టారు. టీడీపీలో విబేధాలు సృష్టించాల‌నే ఇలాంటి వీడియోలు బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. అయితే ప‌ల్లె , జేసీ వ‌ర్గాల మ‌ధ్య ఈ వైర‌ల్ వీడియో పెద్ద స్థాయిలో చిచ్చు రాజేయ‌డంతో దానిని ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే ఇలాంటి ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.


Related News

cbn-attar-chand-basha-666-11-1468234534

టీడీపీకి ముదిరిన క‌దిరి..!

Spread the loveటీడీపీలో వివాదాలు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌లు చోట్ల క‌ల‌హాలు తీవ్ర‌మ‌వుతున్నాయి. కొన్నాళ్ల క్రితంRead More

bjp

ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌ల మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveతెలుగుదేశం వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే డిఫెన్స్ లో ఉన్న నేప‌థ్యంలో చిన్న చిన్న అవ‌కాశాల‌ను కూడాRead More

 • అయ్యో..బైరెడ్డి
 • వైసీపీలో ఆ వ‌ర్గానికి పెరుగుతున్న ప్రాధాన్య‌త‌
 • టీడీపీ మూడు ముక్క‌ల‌య్యింది…!
 • రాజ్య‌స‌భ కోసం మంత్రి ఆది ప‌ట్టు: సీఎంకి చెమ‌ట‌లు
 • మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!
 • అటూ ఇటూ రాజీనామాలే..!
 • బాబు, బీజేపీ రాజీ..!
 • యువ‌తిపై టీడీపీ నాయ‌కుడి లైంగిక వేధింపులు
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *