పల్లెకు సొంత గూటిలో చిచ్చు

Palle Raghunatha
Spread the love

మాజీ మంత్రి పల్లెరఘునాథ్ రెడ్డికి కష్టాలు తప్పడం లేదు. సొంత నియోజకవర్గం పుట్టపర్తిలో ఆయన ఆదేశాలను తమ్ముళ్లు బేఖాతరు చేస్తున్నారు. చీఫ్ విప్ పదవి ఇస్తానంటూ మంత్రి పదవికి రాజీనామా చేయించినప్పటికీ ఆయనకు విప్ హోదా దక్కలేదు. అదే సమయంలో సొంత మనుషులే ఇప్పుడు మంత్రి మీద కస్సుమంటున్న సీన్ కనిపిస్తోంది. దాంతో పుట్టపర్తి రాజకీయాలు వేడెక్కాయి. మంత్రి ముఖ్య అనుచరులే సొంతంగా వ్యవహారాలు చక్కబెట్టుకునే పరిస్థితి రావడంతో పల్లె అవాక్కవ్వాల్సి వస్తోంది.

టిడిపి పుట్టపర్తి నియోజకవర్గంలో కీలక నాయకుడు కొండసాని సురేష్‌రెడ్డిపై ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి సీరియస్ అయ్యారు. తనకు తెలియకుండా జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్ట దిగజారుస్తున్నారని గరంగరంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు నియోజవర్గం లో చర్చనీయాశంగా మారింది. తాను పుట్టపర్తి ని యోజకవర్గానికి ఎమ్మెల్యేనని, ఇక్కడ అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు తన క నుసన్నల్లోనే జరగాలని సూచించిన ట్లు తెలుస్తోంది. ఏమైనా చేయాలంటే తన అనుమతి తప్పనిసరి అని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇక్కడి వ్యవహారాలు చూడమని ముఖ్యమంత్రి చంద్రబాబు మీకు బాధ్యతలు అప్పజెప్పారా లేక మరెవరైనా ఆదేశించారా అని ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ప్రతిష్ట కాపాడాలని ఇదంతా చేస్తున్నావా లేక దిగజార్చేందుకు ప్రయత్నిస్తున్నావా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గానికి తానొక్కడినే ఇన్‌చార్జినని, తనకు పార్టీ అధిష్టానం, సిఎం చంద్రబాబు ఆదేశమే శిరోధార్యం అని పల్లె అన్నట్లు సమాచారం. ఎంపి జెసి.దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే జెసి.ప్రభాకర్‌రెడ్డి దృష్టికి జరిగిన విషయాన్ని తీసుకెళ్లిన పల్లె వారికి కొండసాని గురించి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

కాగా తాము కొండసానిని ప్రోత్సహించడంలేదని, ఇందులో తమ ప్రమేయం ఎంతమాత్రం లేదని వారు పల్లెకు తెలియజేసినట్లు తెలిసింది. కాగా పల్లె తీరుపై కొండసాని తీవ్రంగా స్పందిచారు. తనకు, తన కుటుంబసభ్యులకు పల్లె రఘునాథరెడ్డి నుండి హాని ఉందంటూ కొండసాని సామాజిక మాధ్యమాల్లో సందేశాలు తన గ్రూపు సభ్యులకు పంపడం సంచలనం రేపింది. ఇదే ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. జేసీ బ్రదర్స్ అండదండలతో కొండసాని రెచ్చిపోతున్నారని పల్లె భావిస్తున్నారు. కానీ పుట్టపర్తిలో పల్లెను పక్కన పెట్టి తనకు పట్టంకడతారని ఆశిస్తున్న కొండసాని దానికి తగ్గట్టుగా కథ నడుపుతుండడం విశేషం.


Related News

Adinarayana-Reddy1455803904

నోరుపారేసుకున్న మంత్రి ఆది..

Spread the love4Sharesఏపీ మంత్రి ఆదినారాయ‌ణ రెడ్డి మ‌రోసారి నోరు పారేసుకున్నారు. రెండు రోజుల క్రిత‌మే అర్థ‌రూపాయి వాటా గురించిRead More

anantapuram

వీడియో బ‌య‌ట‌పెట్టారంటూ టీడీపీ ఫిర్యాదు

Spread the love2Sharesఅనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి, మాజీRead More

 • అమ్ముడుపోయిన ఎమ్మెల్యేని…
 • బాబుని కాద‌ని జ‌గ‌న్ పై ప‌వ‌నాస్త్రం!
 • మర్డర్ కేసు: మంత్రికి షాక్
 • కర్నూలు కాక చల్లార్చే యత్నంలో బాబు
 • బాబు, చినబాబుపై చెలరేగిన సోము వీర్రాజు
 • టీడీపీకి 10మంది రాజీనామా
 • చంద్రబాబుకి గుడి..
 • కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *