అఖిల‌ప్రియ‌కు నోటీసులు

akhila priya
Spread the love

ఓ వైపు విప‌క్షం దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. బ‌హిరంగ‌స‌భ‌తో త‌డాఖా చూపింది. మ‌రోవైపు శిల్పా బ్ర‌ద‌ర్స్ నేరుగా దాడికి దిగారు. భూమా అఖిల‌ప్రియ అనాథ ఎలా అవుతుంద‌నే ప్ర‌శ్న సంధించారు. భూమా వ‌ల్ల ప్రాణాలు పోయిన‌వాళ్లంతా అనాథ‌లుగా మారిపోయార‌ని నిల‌దీశారు. అదే స‌మ‌యంలో తాజాగా ఈసీ నుంచి కూడా మంత్రి అఖిల‌ప్రియ‌కు నోటీసులు రావ‌డం విశేషంగా మారింది. ఆమె ఇచ్చిన ఇంట‌ర్వ్యూ ఈ నోటీసుల‌కు కార‌ణం. ఓ ప‌త్రికా ప్ర‌తినిధి రాసిన క‌థ‌నంలో భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఓటేయాల‌ని విజ్ఞ‌ప్తిచేయ‌డంతో దానిని పెయిడ్ న్యూస్ గా భావించాల్సి ఉంటుంద‌ని ఈసీ చెబుతోంది. దీన్ని గమనించిన మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ) చైర్మన్‌ అయిన కలెక్టర్‌.. ఇంటర్వ్యూను ఎందుకు పెయిడ్‌ న్యూస్‌గా పరిగణించరాదో చెప్పాలని నోటీసులో పేర్కొ న్నారు.

ఆమెకు తోడుగా నంద్యాల నియోజకవర్గంలోని లోకల్‌ కేబుల్‌ టీవీ నెట్‌వర్క్‌ల కు కూడా నోటీసులు జారీ చేశారు. నంద్యాలకు చెందిన నందికేబుల్, నంద్యాల సిటీ కేబుల్‌ నెట్‌వర్క్, ప్రజా కేబుల్‌ నెట్‌వర్క్, శిల్పా కేబుల్‌ నెట్‌ వర్క్‌లకు నోటీసులను కలెక్టర్‌ జారీ చేశారు. ప్రసారం చేస్తున్న కథనాలను పెయిడ్‌ న్యూస్‌గా ఎందుకు పరిగణించరాదో వివరణ ఇవ్వాలని కోరారు.


Related News

balakrishna_12

టీడీపీ కార్యకర్తపై బాలయ్య దాడి

Spread the loveనంద్యాల ఉప ఎన్నికల ప్రచారానికి రంగంలో దిగిన నందమూరి బాలయ్య వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆయనRead More

nandyal

నంద్యాలలో అవి అవసరం..

Spread the loveఉప ఎన్నికల్లో భాగంగా నంద్యాలలో రాజకీయ వేడి రోజు రోజుకు పెరుగుతోంది. టీడీపీ, వైసీపీ తాడోపేడో తేల్చుకోవడానికిRead More

 • టీడీపీకి స్టార్ క్యాంపెయినర్లు…
 • వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడి: ప‌రిస్థితి విష‌మం
 • ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌ద్ధ‌తు మాకే..!
 • టీడీపీ ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లుతున్న నంద్యాల రోడ్లు
 • పాపం..క‌మ‌ల నాధులు..!
 • సెంటిమెంట్: నంద్యాల గెలిస్తే అధికార‌మే!
 • జ‌గ‌న్ వ్యూహంలో ఇరుక్కున్న టీడీపీ..!
 • జ‌గ‌న్ గురి అక్క‌డే..!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *