మైనార్టీ నేతకు మంగళం పాడుతున్న టీడీపీ

anantapuram
Spread the love

తెలుగుదేశం పార్టీలో మైనార్టీలకు తగిన గుర్తింపు లేకపోవడం పట్ల చాలాకాలంగా ఆ వర్గంలో ఆందోళన కనిపించింది. కానీ హఠాత్తుగా నంద్యాల ఎన్నికల ముందు ఒలకపోసిన ప్రేమతో చాలామంది మైనార్టీలు సంత్రుప్తి చెందారు. నంద్యాలకే చెందిన ఫరూఖ్ ని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం. త్వరలో ఆయన మండలి చైర్మన్ కాబోతున్నారన్న ప్రచారం ఆ వర్గీయులకు ఊరటగా కనిపించింది. అదే రీతిలో మైనార్టీ కమిషన్ కూడా నంద్యాల వాసికే దక్కడం మరింత ఊపునిచ్చింది.

అయితే ఇప్పుడు మరోసారి మైనార్టీ నేతకు మంగళం పాడే విషయంలో తెలుగుదేశం ఓ నిర్ణయానికి వచ్చేసింది. నంద్యాల ఉప ఎన్నికలకు ముందు ఆయన్ని సాగనంపితే సమస్యలు వస్తాయని భావించి ఆలశ్యం చేసినప్పటికీ ఇప్పుడు ఎన్నికలన్నీ పూర్తికావడంతో ఇక అనంతపురం జెడ్పీ చైర్మన్ ను సాగనంపడం ఖాయంగా మారింది. జెడ్పీ చైర్మన్ గా ఉన్న నూర్ బాషా వర్గానికి చెందిన చమన్ ను తొలగించి ఆయన స్థానంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు వర్గీయుడు పూల నాగరాజుకి జెడ్పీ పీఠం కట్టబెట్టడానికి అంతా సిద్ధమయ్యింది. ఈలోగా నంద్యాల ఎన్నికలు రావడంతో అది జాప్యం జరిగింది.

ఇక ఇప్పుడు మైనార్టీల ఓట్ల అవసరం తీరిపోయింది కాబట్టి..ఇక ఇప్పుడు మైనార్టీ నాయకుడిని తొలగించినా పెద్ద సమస్య ఉండదన్న నిర్ణయానికి అధకిార పార్టీ వచ్చినట్టు సమాచారం. దాంతో చమన్ స్థానంలో పూల నాగరాజు త్వరలో అనంతపీఠం మీద కూర్చోడానికి ముహూర్తం సిద్ధం చేస్తున్నారు. గతంలో జెడ్పీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించిన సమయంలో రొటేషన్ పద్ధతిలో పదవులు పంపకం చేయడంతోనే ఈ మార్పు అని చెబుతున్నారు. కానీ అదే సమయంలో పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం సామాజికవర్గానికి చెందిన ముళ్లపూడి బాపిరాజు స్థానంలో విక్రమాదిత్యను నియమించాల్సి ఉన్నప్పటికీ అక్కడ మాత్రం నిరాకరించి, అనంతలో మార్పు అత్యవసరంగా చేస్తుండడం వెనుక మైనార్టీల పట్ల టీడీపీ చిత్తశుద్ధికి నిదర్శనంగా ఉందని కొందరు చెబుతున్నారు.

అయితే అనంత తర్వాత అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఒప్పందాలన్నీ అమలవుతాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. మొత్తంగా కారణాలేమయినా ప్రస్తుతం చమన్ కి పదవీగండం అనివార్యంగా మారింది.






Related News

chandrabau kurnool

కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..

Spread the loveకర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో టిక్కెట్ల తగాదా అప్పుడే మొదలయ్యింది.Read More

ysjagan-padayatra

కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ

Spread the loveకర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనూహ్య రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అదేRead More

  • రోడ్డెక్కిన అనంత టీడీపీ
  • చంద్రబాబు సభలో రౌడీషీటర్
  • అఖిలప్రియ ఏం మంత్రి?
  • టీడీపీకి కొత్త కష్టాలు
  • వైసీపీ అవుట్: మళ్లీ టీడీపీకే సీటు
  • కర్నూలు కోసం బాబు కుస్తీ
  • పులివెందులలో మర్డర్ ప్రకంపనలు
  • కర్నూలు అభ్యర్థులెవరు?
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *