Main Menu

మ‌రో ఫిరాయింపు ఎమ్మెల్యేకి క్యాబినెట్ బెర్త్!

Spread the love

ఏపీ క్యాబినెట్ లో మూడోసారి మార్పులు ఖాయంగా క‌నిపిస్తోంది. మంత్రివ‌ర్గంలో మార్పుల పై టీడీపీ అధినేత దృష్టి సారించిన‌ట్టు ప్రచారం సాగుతోంది. ఇద్ద‌రు బీజేపీ మంత్రులు దూర‌మ‌యిన నేప‌థ్యంలో రెండు బెర్తులు భ‌ర్తీకి అవ‌కాశం ఉంది. అయితే ఇప్పుడు ఆశావాహుల సంఖ్య ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో తేనెతుట్ట‌ను క‌దిలించే య‌త్నం చంద్ర‌బాబు చేస్తారా లేదా అన్న‌ది సందేహంగా క‌నిపిస్తోంది. గ‌తంలోనే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ నేప‌థ్యంలో పెను దుమారం చెల‌రేగింది. బుచ్చ‌య్య చౌద‌రి వంటి వారు తీవ్రంగా స్పందించారు. ఈ నేప‌థ్యంలో కాస్త చ‌ల్ల‌బ‌డుతున్న వాతావ‌ర‌ణాన్ని మ‌ళ్లీ వేడెక్కించే ప్ర‌య‌త్నం చంద్ర‌బాబు చేస్తారా అన్న‌ది సందేహ‌మే. కానీ తాజా ప‌రిణామాల‌తో ఊహాగానాలు మాత్రం పెరుగుతున్నాయి.

చంద్ర‌బాబు నిజంగానే ఖాళీల భ‌ర్తీకి సిద్ద‌మ‌యితే మాత్రం ఈ సారి రెండు బెర్తుల‌ను ఒక‌టి మైనార్టీల‌కు, మ‌రోటి ఎస్టీల‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. త‌ద్వారా పోటీ త‌గ్గుతుంద‌ని, అదే స‌మ‌యంలో ఇన్నాళ్లుగా విస్మ‌రించిన వ‌ర్గాల‌కు ప్రాధాన్య‌త‌నిచ్చిన‌ట్ట‌వుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఎన్నిక‌ల ముంగిట రెండు వ‌ర్గాల‌కు సంతృప్తిని క‌లిగించడానికి ఈ నిర్ణ‌యం దోహ‌ద‌ప‌డుతుంద‌ని టీడీపీ వ‌ర్గాల అంచ‌నాగా క‌నిపిస్తోంది. అందులో భాగంగానే ఎస్టీ . మైనార్టీ వ‌ర్గాల‌కు క్యాబినెట్ బెర్తు ఖాయం చేస్తార‌ని స‌మాచారం. అదే జ‌రిగితే రెండు వ‌ర్గాల్లోనూ టీడీపీ త‌గిన నేత‌లు లేక‌పోవ‌డంతో ఫిరాయింపుల‌కు అవ‌కాశం ఖాయంగా చెప్ప‌వ‌చ్చు.

టీడీపీ నుంచి మైనార్టీల‌కు కేవ‌లం ఒకే ఒక టికెట్ అది కూడా పీలేరులో కేటాయించారు. అక్క‌డ టీడీపీ అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఇక్బాల్ అహ్మ‌ద్ ఖాన్ వైసీపీ చేతిలో పరాజ‌యం పాల‌య్యారు. దాంతో మైనార్టీ నుంచి క్యాబినెట్ లోకి తీసుకోవాలంటే ఇటీవ‌ల టీడీపీలో చేరిన జంప్ జిలానీలు జ‌లీల్ ఖాన్( విజ‌య‌వాడ వెస్ట్), చాంద్ బాషా (క‌దిరి)ల‌లో ఒక‌రికి అవ‌కాశం ఇవ్వాల్సి ఉంటుంది. వారిద్ద‌రినీ కాద‌నుకుంటే మండ‌లికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎన్ఎండీ ఫ‌రూఖ్(నంద్యాల) గానీ ష‌రీఫ్ మ‌హ్మాద్(న‌ర్సాపురం) గానీ క్యాబినెట్ లోకి తీసుకోవాలి. అదే జిల్లాకు చెందిన బీజేపీ మంత్రి మాణిక్యాల‌రావు ఖాళీ చేయ‌డంతో ప‌శ్చిమ నుంచి మండ‌లిలో ప్రాతినిధ్యం వ‌హిస్తున‌న ష‌రీఫ్ పేరు ప‌రిశీలించే అవ‌కాశం క‌నిపిస్తోంది. స‌మ‌యంలో అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాల నుంచి కూడా ఇద్ద‌రేసి ఉండ‌డం చాంద్ బాషా, ఫ‌రూఖ్ కి ఆటంకం అవుతుంది. జ‌లీల్ ఖాన్ కి మాత్రం కామినేని ఖాళీ చేయ‌డంతో అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయ‌ని చెబుతున్నారు. ఆయ‌న‌కు మాత్రం బీకాంలో ఫిజిక్స్ ప్ర‌భావం ప‌డ‌వ‌చ్చ‌నే చెబుతున్నారు.

ఇక ఎస్టీ కోటాలో కూడా టీడీపీ త‌రుపున కేవ‌లం ఒకే ఒక ఎమ్మెల్యే ముడియం శ్రీనివాస‌రావు( పోల‌వ‌రం) నుంచి గెలిచారు. ఆయ‌న‌కు కూడా ఇద్ద‌రు మంత్రులు ప‌శ్చిమ గోదావ‌రి నుంచి ఉండ‌డం ప్ర‌ధాన‌మైన అడ్డంకి. అందుకు తోడు ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో విబేధాలు స‌మ‌స్య కాబోతున్నాయి. దాంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వ‌రి( పాడేరు), కిడారి స‌ర్వేశ్వ‌ర‌రావు( అర‌కు), వంత‌ల రాజేశ్వ‌రి(రంప‌చోడ‌వ‌రం) ప్ర‌త్యామ్నాయంగా క‌నిపిస్తున్నారు. వారిలో స‌ర్వేశ్వ‌ర‌రావు ఇప్ప‌టికే ప్ర‌భుత్వ విప్ గా ఉన్నారు. గిడ్డి ఈశ్వ‌రికి అవ‌కాశం ఇస్తే విశాఖ నుంచి ముగ్గురు మంత్రుల‌వుతారు. దాంతో వారి స్థానంలో విజ‌య‌న‌గ‌రం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న సంధ్యారాణికి అవ‌కాశం ఇవ్వొచ్చ‌నే అభిప్రాయం ఉంది. అయితే ఎస్టీ, మైనార్టీ కోటాల‌లో ఒక‌టి మండ‌లి నుంచి మ‌రోటి అసెంబ్లీ నుంచి ఇస్తార‌ని, అదే స‌మ‌యంలో ఒక‌రు ఫిరాయింపు ఎమ్మెల్యే త‌ప్ప‌ర‌ని భావిస్తున్నారు. ఏమ‌యినా ఇప్ప‌టికే న‌లుగురు ఫిరాయింపులు క్యాబినెట్ లో ఉండ‌గా మ‌రొక‌రికి ఛాన్స్ ద‌క్క‌వ‌చ్చ‌నే అంచ‌నాలు టీడీపీ వ‌ర్గాల్లో వినిపిస్తుండ‌డం విశేషం.


Related News

బాబు ఓటు బ్యాంకుపై గురిపెట్టిన జ‌గ‌న్

Spread the loveవైసీపీ వ్యూహాత్మ‌కం వ్య‌వ‌హ‌రిస్తోంది. చంద్ర‌బాబు బ‌లం మీద పెను ప్ర‌భావం చూపేందుకు సిద్ధ‌మ‌వుతోంది. సుదీర్ఘ‌కాలంగా బీసీ ఓటుRead More

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం

Spread the loveమాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్ సోద‌రుడు, మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌ఠాన్మ‌రణం పొందారు. తెల్ల‌వారు జామున గుండెపోటుతోRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *