Main Menu

చంద్ర‌బాబు సంచ‌ల‌నం- చిన‌బాబుకి లైన్ క్లియ‌ర్

Spread the love

చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ప‌లు వ్యూహాలు ర‌చిస్తున్నారు. ముఖ్యంగా త‌న‌యుడు నారా లోకేష్ విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. చిన‌బాబుని ప్ర‌త‌క్ష పోరు కోసం సిద్ధం చేస్తున్నారు. అందుకు త‌గ్గ సీటు విష‌యంలో చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌య‌మే తీసుకుంటున్నారు. ఏకంగా త‌న సీటుని త్యాగం చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. సుదీర్ఘ‌కాలంగా చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా, ఆయ‌న‌కు బ‌దులుగా నారా లోకేష్ బ‌రిలో దిగుతార‌నే ప్ర‌చారం ఊపందుకుంది.

దాంతో కుప్పం రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. తొలుత కృష్ణా జిల్లా నుంచి బ‌రిలో దిగాల‌ని నారా లోకేష్ భావించారు. కానీ శ్రేయ‌స్క‌రం కాద‌ని భావించి, హిందూపూర్ విష‌యంలో దృష్టి సారించారు. అయితే అక్క‌డి నుంచే తాను మ‌ళ్లీ రంగంలో ఉంటాన‌ని బాల‌య్య తేల్చేశారు. దాంతో మామ‌గారి సీటు వ‌దిలి నాన్న‌గారి స్థానం కోసం లోకేష్ పావులు క‌దుపుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అందులో భాగంగానే కుప్పం సీటు కోసం నారా లోకేష్ సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారయిన‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి చంద్రబాబుకి సొంత జిల్లా అయినప్పటికీ చిత్తూరు ప్రజలు టీడీపీని ఆశీర్వ‌దించిన దాఖ‌లాలు పెద్ద‌గా లేవు. చివ‌ర‌కు మొన్నటి 2014 ఎన్నికల్లో కూడా మెజార్టీ సీట్లు వైసీపీకే ద‌క్కాయి. కేవ‌లం ఆరు స్థానాల్లో మాత్రమే టిడిపి గట్టెక్కింది. దాంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో సాగాల‌ని చంద్ర‌బాబు ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు సీట్ల‌లో నేత‌ల‌కు క్లియ‌రెన్స్ ఇచ్చేశారు.

అందులో భాగంగానే కుప్పం నుంచి నారాలోకేష్ ఎంట్రీ ఖాయం అయ్యింద‌ని స‌మాచారం. అదే జ‌రిగితే చంద్ర‌బాబు నేరుగా తిరుప‌తి నుంచి బ‌రిలో దిగాల‌ని భావిస్తున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. సీఎం తిరుప‌తి నుంచి పోటీ చేస్తార‌నే సంకేతాలు ఇప్ప‌టికే టీడీపీ నేత‌ల‌కు అందాయి. ఇటీవల నెల‌ రోజుల వ్యవధిలోనే మూడుసార్లు తిరుపతికి రావడం, ప్రాజెక్టులను ప్రకటించడం ఇందుకు బలం చేకూరుస్తోంది. చంద్ర‌బాబు రాజకీయ అరంగేట్రం 1978లో సొంత నియోజ‌క‌వ‌ర్గం చంద్రగిరి నుంచి ప్రారంభ‌మ‌యిన‌ప్ప‌టికీ, 1983లో ఆయ‌న చంద్ర‌గిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాల‌య్యారు. దాంతో ఆయ‌న టీడీపీలో చేరిన త‌ర్వాత‌ 1989లో కుప్పం నియోజకవర్గానికి వలస వెళ్లారు. నాటి నుంచి వెనక్కి తిరిగి చూడలేదు.

అయినా ఇప్పుడు వార‌సుడి కోసం ఆ సీటు త్యాగం చేసేందుకు స‌న్న‌ద్ధం కావ‌డం ఆస‌క్తిగా మారింది. ఇప్ప‌టికే లోకేష్ చిత్తూరు జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఎమ్మెల్యే సీటు కూడా చిత్తూరు జిల్లా సుర‌క్షిత‌మ‌ని భావించి, తొలుత చంద్ర‌గిరి అనుకున్న‌ప్ప‌టికీ పోటీ తీవ్రంగా ఉంటుంద‌ని భావించ‌డంతో చివ‌ర‌కు చంద్ర‌బాబు త‌న సీటు వ‌దులుకోవ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ట్టు చెబుతున్నారు. ఏమ‌యినా ఇదో ఆస‌క్తిక‌ర ప‌రిణామంగానే చెప్పాలి.


Related News

ఆ రెండు సీట్లే హాట్ టాపిక్!

Spread the loveఅనంత‌పురం జిల్లా రాజ‌కీయాల్లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అందులోనూ వార‌సులు బ‌రిలో దిగిన నేప‌థ్యంలో అనంత‌పురంRead More

కాంగ్రెస్ క‌ల తీరేనా?

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టాల‌న్న‌ది కాంగ్రెస్ క‌ల‌. తొలిసారిగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో 2014లో ఆపార్టీ ఖంగుతిన్న‌ది. కేవ‌లం మూడంటేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *