సెంటిమెంట్: నంద్యాల గెలిస్తే అధికార‌మే!

nandyala
Spread the love

నంద్యాల‌లో గెలుపు వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల‌కు స‌న్నాహామ‌ని అధికార‌, విప‌క్షాలు భావిస్తున్నారు. దాదాపు సెమీ ఫైన‌ల్ గా భావిస్తున్నాయి. స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతున్నాయి. ఉప ఎన్నిక‌ల్లో విజ‌య‌మో వీర‌స్వ‌ర్గ‌మో అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. దానికి సెంటిమెంట్ కూడా కార‌ణ‌మేనని చెప్ప‌వ‌చ్చు. 1983 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ అదే జ‌రిగింది. గ‌డిచిన ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచి పీఠం ఎక్క‌కపోయాన‌, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మాత్రం ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయారు. అంటే నంద్యాల ఎమ్మెల్యే నిత్యం పాల‌క‌ప‌క్ష‌మే అన్న‌ట్టుగా క‌నిపిస్తోంది. అందుకే ఇప్పుడు గెలిచిన వాళ్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డానికి, సీఎం పీఠం ద‌క్కించుకోవ‌డానికి దారులు ఏర్పాటు చేసుకున్న‌ట్టేన‌ని చంద్ర‌బాబు, జ‌గ‌న్ భావిస్తున్నారు.

1983 నుంచి నంద్యాల‌లో జ‌రిగిన ప‌రిణామాలు ఇలా..
1983 నుంచి గెలిచిన అభ్యర్థి పార్టీకి అధికారం చేజిక్కడం సెంటిమెంట్‌గా వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన చివరి ఎన్నికదాకా ఇదే నడిచింది. అయితే 2014 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి అధికార తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఆయన మరణంతో ఉప ఎన్నిక జరుగుతోంది. ఇప్పుడు ఎవరు గెలుస్తారో.. ఆ పార్టీకే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కుతుందని రాష్ట్రవ్యాప్త చర్చ జరుగుతోంది. దీనికి సెంటిమెంట్‌ చర్చ తోడవుతోంది.

1983లో నంద్యాల టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం సంజీవరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బొజ్జా వెంకటరెడ్డిపై 23 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధిం చారు. అవి తెలుగుదేశం పార్టీకి తొలి ఎన్నికలు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఎన్‌టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు.

1985లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డికి టీడీపీ టికెట్‌ దక్కలేదు. ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఎన్టీఆర్‌ టికెట్‌ కేటాయించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గోపవరం పార్థసారథి రెడ్డిపై ఫరూక్‌ 8 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.

1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ శాసన సభ్యుడి హోదాలో పోటీ చేసిన ఎన్‌ఎండీ ఫరూక్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి ఉలవల రామనాథ్‌ రెడ్డి 7 వేల ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.

1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్‌ఎండీ ఫరూక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మగ్బూల్‌ హుసేన్‌పై 40 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఐదేళ్ళ విరామం అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

1999లో జరిగిన ఎన్నికల్లో త్రిముఖ పోరు జరిగింది. టీడీపీ అభ్యర్థిగా ఎన్‌ఎండీ ఫరూక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌ఎండీ నౌమాన్‌ బరిలో దిగారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎస్పీవై రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. దీంతో 4 వేలలోపు మెజార్టీతో ఫరూక్‌ విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌పై 50 వేల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి తొలిసారి పీఠమెక్కారు.

2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పామోహన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి ఎన్‌హెచ్‌ భాస్కరరెడ్డిపై దాదాపు 32 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.

2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా మోహన్‌రెడ్డిపై వైసీపీ అభ్యర్థి భూమా నాగిరెడ్డి గెలుపొందారు. అయితే వైసీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. సెంటిమెంట్‌ గతి తప్పినా.. గెలిచిన అభ్యర్థి రెండేళ్ళ తరువాత అధికార పార్టీ టీడీపీలోకి చేరారు.


Related News

chandrabau kurnool

కర్నూలు టీడీపీలో కొత్త మార్పులు..

Spread the love9Sharesకర్నూలు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో టిక్కెట్ల తగాదా అప్పుడే మొదలయ్యింది.Read More

ysjagan-padayatra

కర్నూలులో వేడి రాజేసిన వైసీపీ

Spread the love17Sharesకర్నూలు రాజకీయాలు వేడెక్కాయి. కర్నూలు జిల్లాలో ఇప్పటికే అనూహ్య రాజకీయ పరిణామాలు కనిపిస్తూ ఉంటాయి. తాజాగా అదేRead More

 • రోడ్డెక్కిన అనంత టీడీపీ
 • చంద్రబాబు సభలో రౌడీషీటర్
 • అఖిలప్రియ ఏం మంత్రి?
 • టీడీపీకి కొత్త కష్టాలు
 • వైసీపీ అవుట్: మళ్లీ టీడీపీకే సీటు
 • కర్నూలు కోసం బాబు కుస్తీ
 • పులివెందులలో మర్డర్ ప్రకంపనలు
 • కర్నూలు అభ్యర్థులెవరు?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *