Main Menu

వైసీపీలోకి మ‌రో వార‌సుడు

Spread the love

సీనియ‌ర్ నాయ‌కుల వార‌సులు ఇప్ప‌టికే ఇత‌ర పార్టీల వైపు చూస్తున్నార‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో ఓ వికెట్ ప‌డిపోయింది. వైసీపీలో కీల‌క నేత త‌న‌యుడు చేరిపోయారు. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌లో య‌ల‌మంచిలి ర‌వి చేరికతో వైసీపీలో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. అది జ‌రిగిన కొద్దిసేప‌టికే మైసూరా రెడ్డి త‌న‌యుడు కూడా వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత మైసూరా రెడ్డి కొద్దికాలం క్రితం వైసీపీని వీడారు కానీ ఆయ‌న క్రియాశీల‌కంగా క‌నిపించ‌డం లేదు. ఆలోగా ఆయ‌న వారసుడు వైసీపీలో చేర‌డం విశేషంగా మారింది.

క‌డ‌ప జిల్లాలో ఎంవీ మైసూరారెడ్డి కి ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. విశేష ప‌రిజ్ణానం క‌లిగిన నాయ‌కుడిగా ఆయ‌న‌కు పేరుంది. ఆయ‌న‌ కుమారుడు హర్షవర్ధన్‌ రెడ్డి ఇప్పుడు వై సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు నియోజక వర్గంలోని పలువురు నాయకులు, నేతలు, మరో వంద కుటుంబాలు వైఎస్సార్‌ సీపీలో చేరాయి. ఎర్రగుంట్ల సమన్వయ కర్త సుధీర్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ గొప్పనాయకుడని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. చంద్రబాబు పరిపాలనలో జరిగిన అవినీతిపై విసుగెత్తి ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని చెప్పారు.

మైసూరా వార‌సుడి చేరిక‌తో క‌డ‌ప‌లో మ‌రికొన్ని కీల‌క ప‌రిణామాలు త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు.






Related News

హిందూపురంలో హీటురాజేస్తున్న రాజ‌కీయాలు

Spread the loveసార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం, వైకాపా వ్యూహాత్మకంగాRead More

హీరో గోడ‌దూక‌డానికి సాయ‌ప‌డి దొరికిపోయిన జ‌గ‌న్

Spread the loveటాలీవుడ్ హీరో సుమంత్ ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశాన్ని బ‌య‌ట‌పెట్టాడు. త‌న చిన్న‌నాటి స్నేహితుడు, వైసీపీ అధినేత వైఎస్Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *